Gunde Ninda Gudi Gantalu Today Episode: నర్సుతో బాలు 2 వేల డీల్- శ్రుతి రవిలతో శోభన గొడవ- మనోజ్ ప్రభావతికి ముప్పుతిప్పలు

Gunde Ninda Gudi Gantalu Serial July 10th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 10వ ఎపిసోడ్‌లో మనోజ్ ఓవరాక్షన్ చేస్తాడు. బాలు, మీనాలవి దొంగ లెక్కలు అంటాడు. దాంతో నర్సుతో 2 వేల డీల్ కుదుర్చుకుని మనోజ్‌కు బుద్ధి చెప్పేందుకు బాలు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. శ్రుతి, రవితో శోభన గొడవ పడుతుంది.

Published on: Jul 10, 2026, 09:24:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ డబ్బు గురించి అన్న మాటలకు బాలు కోపంగా బయటకు వస్తాడు. మనం ఎంత చేసినా వాళ్లు అలాగే మాట్లాడతారు. మనం కోప్పడి వాళ్లలాగే చేస్తే ఎలా, టైమ్ చూసి ఆడుకుందురు అని మీనా కంట్రోల్ చేస్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 10 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 10 ఎపిసోడ్

నర్సుకు బాలు 2 వేల డీల్

మనోజ్ రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ చూసి అంతా నార్మల్‌గా ఉందంటాడు. అది విన్న బాలు మీనా వెళ్లి అడుగుతారు. తనకు అంతా బానే ఉంది అని బాలుకు చెప్పిన డాక్టర్ నర్సుతో వెళ్లి అతని కట్లు విప్పేయమంటాడు. ఇదే సరైన అవకాశం. మనోజ్‌కు బుద్ధి చెప్పాలని బాలు అనుకుంటాడు. నర్సును ఆపి వాడికి రెండు రోజుల తర్వాత కట్లు విప్పితే ఏమైనా సమస్య అని అడుగుతాడు.

అలాంటిదేం ఉండదని నర్స్ అంటుంది. వాడు ఎంత కంగారు మనిషో చూశారుగా. అన్నింటికి భయపడతాడు. రెండు రోజుల తర్వాత విప్పితే బాగుంటుందని బాలు అంటాడు. కానీ, డాక్టర్ నన్ను తిడతారని నర్స్ చెబుతుంది. నర్సుకు డబ్బులు ఇచ్చి ఈసారికి నా మాట వినండి. రెండు రోజుల తర్వాత ఇంటికొచ్చి మీరే కట్లు విప్పండి. అప్పుడు కూడా మీకు ఫీజ్ ఇస్తానని బాలు అంటాడు.

మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని నర్స్ అడుగుతుంది. మీకు సమాధానం కావాలా.. 2 వేలు కావాలా అని బాలు అంటాడు. 2 వేలే అని నర్స్ లోపలికి వెళ్తుంది. అంతా బాగానే ఉంది. కానీ, కట్లు విప్పితే మళ్లీ సమస్య రావచ్చు. మళ్లీ రిపోర్ట్స్ చూస్తున్నారు అని నర్స్ అంటుంది. లేదు నేను ఇంటికి వెళ్తాను అని మనోజ్ కంగారుపడతాడు.

రెండు రోజుల్లో కట్లు విప్పుతాం

సరే మీరు చెప్పినట్లే విప్పుతా. కళ్లు రాకుంటే ఇలాగే చీకట్లో బతకండి అని నర్స్ అంటుంది. దాంతో మనోజ్ మరింత భయపడిపోతాడు. కట్లు విప్పేయండని బాలు, మీనా ఆడుకుంటారు. మీ ఇంటికి వెళ్లిపోండి. రెండు రోజుల తర్వాత నేనే ఇంటికొచ్చి కట్లు విప్పుతానని నర్స్ చెబుతుంది. దాంతో మనోజ్ సంబరపడతాడు. మనోజ్‌ను ఇంటికి తీసుకెళ్తారు.

బాలు, రవి పట్టుకుని తీసుకొస్తే మనోజ్ ఓవర్ చేస్తాడు. నన్ను పట్టుకుని నడిపించకండి. నాకు తెలియని ఇల్లా అని నడిచి వెళ్లి గేటుకు గుద్దుకుంటాడు. తర్వాత గేటు గుమ్మం తగిలి కిందపడతాడు. నాన్నను అంటే కళ్లు పోతాయి నన్ను అంటే పళ్లు రాలతాయన్నాగా. ఇలాగే చేస్తే నీ కాళ్లు.. అని బాలు అనబోతుంటే మీనా నోరు మూస్తుంది.

నాలుకు మీద మచ్చ ఉన్నట్టుంది. ఏదంటే అది అవుతుందన్న మీనా వెళ్లి హారతి తీసుకొస్తుంది. ప్రభావతి హారతి తీసుకుంటుంది. మీనాను తిడుతుంది. మీనాను ఏమైనా అంటే.. వీడి చేతులు కాలుతాయని బాలు అంటాడు. అన్నట్లుగానే హారతి తగిలి మనోజ్ చేతులు కాలుతాయి. మీనా నవ్వుతుంది. బాలు అన్నాడు జరిగిందని శ్రుతి అంటుంది.

మనోజ్ ఓవరాక్షన్

తర్వాత ప్రభావతి హారతి ఇస్తుంది. జాగ్రత్తగా నడవమని బాలు చెబుతాడు. మళ్లీ గుమ్మం తగిలి కిందపడబోతాడు మనోజ్. ఇంటికొచ్చిన వాళ్లకు నాకు కళ్లు ఎలా పోయాయో వీడు కథలు కథలుగా చెబుతాడు. ఈ కట్లు కనపడకండా కూలింగ్ గ్లాసెస్ తీసుకురమ్మని మనోజ్ చెబితే రోహిణి తీసుకొచ్చి ఇస్తుంది. మనోజ్ పెట్టుకుంటాడు.

ప్రభావతి బాలును అంటే.. నిన్ను కూడా శపిస్తానంటాడు. రోహిణిని అంటే నీళ్లు పట్టుకుని శపిస్తానని బాలు అనబోతుంటే నోరు మూసి గదిలోకి బాలును లాక్కెల్తుంది మీనా. కళ్లు పోయాయిగా వదిలేయండని పాపం అని మీనా అంటే.. ఈ రెండు రోజుల్లో వాడికి బుద్ధి వచ్చేలా చేయాలని, వాడికి కళ్లు వచ్చాయి కాబట్టి ఏం కాదని బాలు అంటాడు.

తర్వాత మనోజ్‌ను డైనింగ్ టేబుల్‌పై రోహిణి కూర్చొబెడుతుంది. ఆకలేస్తుంది. ఆ మీనా ఎక్కడ చచ్చిందని మనోజ్ అంటాడు. ఆ మాటలు బాలు, మీనా వింటారు. టిఫిన్ ఇక్కడే ఉందని చెబుతుంది రోహిణి. మరోసారి హాస్పిటల్ బిల్‌ బాగా చూడు. దొంగ లెక్కలు చూపిస్తారు. వాళ్లు కావాలనే డబ్బులు వసూలు చేసేందుకు దొంగ లెక్కలు చూపించి ఉంటారని మనోజ్ అంటాడు.

మనోజ్‌ను ఆడుకున్న బాలు

ఇప్పుడేమంటావ్ అని బాలు అంటే.. ఇతను మారడ అని మీనా అంటుంది. రోహిణి లోపలికి వెళ్తే ఇడ్లీకి బదులు మిర్చీలు పెడతాడు బాలు. అది తిని కారం అంటూ అరుస్తాడు మనోజ్. తర్వాత బాలు వెళ్లి ప్లేట్ మారుస్తాడు. రోహిణి వచ్చి ఇడ్లీకి కారమేంటని అడుగుతుంది. నోట్లో పచ్చి మిర్చీ ఉంటుంది. మిర్చీ తిన్నావా అని అడుగుతుంది.

ఏమైందని బాలు, మీనా వచ్చి అడుగుతారు. వీడే ప్లేట్ మార్చి ఉంటాడని మనోజ్ అంటే.. వాళ్లు ఇప్పుడే వచ్చారని రోహిణి చెబుతుంది. మమ్మల్ని ఇలా అన్నందుకే ఈ గతి పట్టిందని బాలు అంటాడు. మమ్మల్ని ఏదోటి అంటూనే ఉంటాడు నువ్వైనా చెప్పు రోహిణి అని మీనా అంటుంది. కారంతో అంటున్నాడని రోహిణి అంటుంది. మళ్లీ మనోజ్ ఏదోటి అనబోతుంటే ఇడ్లీ కుక్కి నోరు మూసుకుని తినమంటుంది రోహిణి.

పక్కకు వెళ్లిన బాలు వీడికి ఇలాగే డోస్ మీద డోస్ పెంచాలని మీనాతో అంటాడు. మరోవైపు కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకుంటుంది శ్రుతి. నాకు మీలాంటి ఎంప్లాయ్ కావాలి. మీరు చాలా అందంగా, స్మార్ట్‌గా ఉన్నారు. బాగా చదువుకుని ఇలాంటి జాబ్ ఎందుకు. మా కంపెనీలో మీకు మంచి జాబ్ రికమండ్ చేస్తాను అని కస్టమర్ అంటాడు.

శ్రుతితో తల్లి గొడవ

సరే నా హస్పండ్ ఉన్నారు. అతనికి ఇదే చెప్పి పర్మిషన్ తీసుకోండి అని శ్రుతి అంటుంది. మీకు పెళ్లి అయిందా అని అతను ఆశ్చర్యపోతాడు. అర్జంట్ మీటింగ్ ఉంది. ఆర్డర్ త్వరగా తీసుకురండని కస్టమర్ అంటాడు. శ్రుతి వెళ్తుంది. అదంతా చూసిన మేనేజర్ తన్ని తరిమేద్దామా అని అడిగితే.. ఇలాంటి వాళ్లు ఎదురుపడుతూనే ఉంటారు. తరిమేస్తే ఎవరు రారు వద్దని శ్రుతి అంటుంది.

మరో టేబుల్ దగ్గర తల్లి శోభన ఉంటుంది. నీ స్థాయి ఏంటీ చేసే పని ఏంటని శ్రుతిపై కోప్పడుతుంది శోభన. నీతో చాకిరి చేయిస్తూ నీ అత్త మామలు ఇంట్లో కూర్చుని తింటున్నారు. సిగ్గు లేదా వాళ్లకు అని శోభన అంటే.. మాటలు మర్యాదగా రాని మమ్మీ. ఒకరు చెబితే నేను ఇక్కడ పనిచేయట్లేదు అని తల్లిపై రివర్స్ అవుతుంది శ్రుతి.

రవిపై శోభన ఫైర్

ఇంతలో రవి వచ్చి క్షేమసమాచారాలు అడుగుతాడు. ఈ దరిద్రం చూశాక ఏం తినాలని లేదని, నా కూతురును బాగా చూసుకోవడం అంటే ఇదేనా, నా కూతురును మిడిల్ క్లాస్ అమ్మాయిని చేశావని, కోడలు సంపాదిస్తుంటే మీ అమ్మనాన్నకు ఎలా తినాలనిపిస్తుంది. అలా తింటే వాళ్లకైనా అరుగుతుందా అని రవిపై ఫైర్ అవుతుంది.

శ్రుతి జాబ్ విషయంలో నా ప్రమేయం, నా తల్లిదండ్రుల ప్రమేయం లేదని రవి చెబుతాడు. అంతా చూస్తున్నారు. డిగ్నిటీగా బిహేవ్ చేయు. ఇక్కడి నుంచి వెళ్లు అని శ్రుతి అంటుంది. ఇది ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా అని కోపంగా వెళ్తుంది శోభన. శ్రుతితో ఈ తలనొప్పి ఏంటీ. నిన్ను హింసిస్తున్నట్లు అందరికి చాటింపు వేయిస్తే ఎలా అని రవి అంటాడు.

వాళ్ల నోరు నేను మూయిస్తానుగా అని శ్రుతి అంటుంది. ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యావని కోప్పడుతాడు రవి. వాళ్ల మాటలకు ఇరిటేట్ కాకని కన్విన్స్ చేస్తుంది శ్రుతి. మరోవైపు మురళిని విద్య కలుస్తుంది. విద్యకు ఇష్టమైనవి రాసిన లెటర్ మురళి చదివినట్లు చెబుతాడు. మనిద్దరి ఆలోచనలు చాలా వరకు ఒకేలా ఉన్నాయని అంటాడు.

మురళి ప్రేమ తంటాలు

ఇప్పుడు నిజం చెప్పండని విద్య అంటుంది. దాంతో ఒక నాలుగైదు చోట్ల మ్యాచ్ కాలేదు. మీకోసం మార్చుకుంటాను అని మురళి అంటాడు. మీరు మీలాగే ఉండండని విద్య అంటుంది. మనకు నచ్చినవాళ్ల కోసం మారడమేగా ప్రేమ అని మురళి అంటాడు. ఇద్దరం కాస్తా వేరుగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని విద్య అంటుంది. నెక్ట్స్ ఏంటని మురళి అడిగితే.. అలా ఐదు నిమిషాలు పక్కకు వెళ్లి నా మనసును అడిగి వస్తానని విద్య వెళ్తుంది.

మురళి వెళ్లి దేవుడుకి మొక్కుకుంటాడు. మరోవైపు ప్రభావతితో మనోజ్ బాలు గాడు హాస్పిటల్ బిల్ కట్టినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అదంతా విని నాన్న వాడి పేరు మీద ఆస్తి రాసిస్తాడేమో అని అంటాడు. అది బాలు వింటాడు. మీ నాన్న నీలా కాదు. వాడి మీద ఏడవకుండా సైలెంట్‌గా కూర్చో. చచ్చి చెడీ వాళ్లు హాస్పిటల్ బిల్ కట్టారు. నువ్వు పార్కులో, రోహిణి హాస్పిటల్ ముందు అడుక్కునేవారు. వాడు వింటే నోరు పడిపోవాలంటాడు అని ప్రభావతి వెళ్లిపోతుంది.

నువ్వు కూడా బాలు గాడిని మెచ్చకుంటే వాడి కాళ్లు నేలమీద ఉంటాయ. రూపాయికి రెండు రూపాయలు తీసుకుంటాడు. వాడు ఆస్తి రాయించుకుంటాడు. వాడిని, మీనాను ఇంట్లో లేకుండా చేయాలి. నువ్వు రోహిణి కలిసి ప్లాన్ చేయండమ్మా అని మనోజ్ అంటాడు. ఆ మాటలు విన్న బాలు చైర్ ఎత్తబోయి ఆగుతాడు. మనోజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంటాడు.

బాలు నోరు పవర్

బాలు పాటలు మారుస్తాడు. భయపడిన మనోజ్ ఫోన్ కోసం వెతుక్కుంటాడు. ప్రభావతి రావడం చూసి ఫోన్ పక్కనే పెట్టి వెళ్తాడు. ప్రభావతి కుదురుగా ఉండమంటుంది. ఫోన్ పక్కనే ఉందని బాలు ఇస్తాడు. ఇలాగే చేస్తే పడిపోతావని కావాలనే కుర్చీ జరుపుతాడు బాలు. దాంతో మనోజ్ కిందపడిపోతాడు. ఏం నోరురా అని ప్రభావతి తిడుతుంది.

మీనాను అంటే అనకుండా ఉంటానా. నువ్వు కూడా కిందపడిపోతావని బాలు అంటాడు. అలాగే ప్రభావతి అనుకోకుండా కిందపడిపోతుంది. నీ నోరు పాడుగాను నా నడుము విరిగింది. రేయ్ మనోజ్‌గా నేను కూర్చునే కుర్చీ లాగేసావ్ అని తిడుతుంది ప్రభావతి. చేయి ఇవ్వమంటే నీలాంటి వాళ్లను క్షమించడం కూడా పాపమే అని బాలు అంటాడు.

మనోజ్ చేయి ఇస్తానంటాడు. మళ్లీ బాలు అనడంతో తల్లిని లేపబోయి మనోజ్ కూడా పడిపోతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More