గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: వంటగదికి మీనా రాజీనామా- సిలిండర్ దాచేసి బాలు సమ్మే- ఆకలితో అల్లాడిన ప్రభావతి బ్యాచ్

Gunde Ninda Gudi Gantalu Serial June 19th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 19వ ఎపిసోడ్‌‌లో మీనా విలువ తెలియట్లేదని బాలు సమ్మే చేయమంటాడు. దాంతో మీనా వంటగదికి తాళం వేసి రాజీనామా చేస్తుంది. ఆకలితో ప్రభావతి, రోహిణి, మనోజ్ అలమటిస్తుంటారు. ఆర్డర్ పెట్టిన బాలు బిర్యానీదానం చేసి పంపిస్తాడు.

Published on: Jun 19, 2026, 07:43:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి ఫేక్ డ్రామా బయటపడటంతో బాలు గుణపాఠం కచ్చితంగా చెబుతానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. డాబా పైకి మీనాను తీసుకెళ్తాడు బాలు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 19 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 19 ఎపిసోడ్

సమ్మే చేయాలి

నీ గురించి ఎవరైనా ఏమైనా అంటే పోనిలే అని ఊరుకుంటావ్. అదే నువ్వు చేసే తప్పు. ఇకనుంచి నువ్వు ఇంట్లో వంట చేయకు. అప్పుడే నీ విలువ తెలుస్తుంది అని బాలు అంటాడు. వాళ్లు అలా చేశారని మనం కూడా అలాగే చేస్తే నాకు వాళ్లకు తేడా ఏంటీ అని మీనా అంటుంది. ఇంట్లో పనులు అలాగే ఉన్నాయని, వెళ్లాలని మీనా అంటుంది.

నేను చెబుతున్నాగా. భర్త మాట వినాలి కదా. నువ్వు సమ్మే చేయాల్సిందే అని బాలు అంటే.. సరేనని మీనా అంటుంది. తర్వాత మీనా చేసినదానికి చాలా గర్వంగా ఉందని, ఎంతమంది ఉన్నా నాయకత్వం ఉండాలని బాలు పొగుడుతాడు. వచ్చిన లాభం డబ్బు ఇస్తాడు బాలు. తనకు కావాల్సింది ఇవ్వమని అడిగితే.. ఇప్పుడు ఇవ్వలేనని, అదే డబ్బు జేబులో పెడుతుంది మీనా.

మళ్లీ కాఫీ పెట్టాలని మీనా అంటే.. అరే మళ్లీ అదే మాట. సమ్మే చేయు. నిన్ను అందరూ వాడుకుంటున్నారు అని బాలు అంటాడు. తర్వాత బాలు విష్ణుమూర్తిలా పడుకుంటే మీనా కాళ్లు పడుతుంది. అది చూసి అంతా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్లకు నా పెళ్లాం నాకు సేవలు చేసే భాగ్యం దక్కిందని బాలు అంటాడు. భోజనాల పెట్టే టైమ్‌లో ఈ సీన్లు ఏంటని మనోజ్ అంటాడు.

వంటగదికి రాజీనామా

మనోజ్‌కు ఆకలేస్తుందని, వడ్డించమని ప్రభావతి అంటుంది. కళ్లు తెరిచి వంటగదివైపు చూడమని బాలు అంటే.. మనోజ్ చూస్తాడు. అక్కడ వంటగది మూసివేయబడినది అని రాసి ఉంటుంది. అది మనోజ్ చెబుతాడు. ఏంటీ ఆటలుగా ఉందా అని ప్రభావతి అంటుంది. ఇవి నా లీలలు. నా భార్య వంట చేయదు. స్ట్రైక్ చేయదు. కోడలిగా వంట గదికి రాజీనామా చేసిందని బాలు అంటాడు.

ఎప్పటిదాకా అని రవి అంటే.. రెండు మూడేళ్ల దాకా చేయనని మీనా అంటుంది. కారణం తెలుసుకోవచ్చుగా అని సత్యం అడుగుతాడు. ప్రభావతి అని బాలు అంటాడు. మీనా ఏ పని చేయట్లేదు అన్నావుగా. అలాగే చేయదు. డబ్బుడమ్మా నువ్వు పని చేశావా అని బాలు అడిగితే.. నాకు రాదుగా అని శ్రుతి అంటుంది. పార్లరమ్మా నువ్వు చేశావా అని బాలు అంటే.. నాకు అంత టైమ్ ఉండదని రోహిణి అంటుంది.

అలాగే నా భార్య కూడా చేయదు. వాలంటైర్ రిటైర్‌మెంట్ తీసుకుని డెకరేషన్ చేసుకుంటుంది. ఖాళీ టైమ్‌లో నాకు సేవలు చేస్తూ తరిస్తుందని బాలు అంటాడు. వాళ్లు ఇది ఒక్కటేనా అని ప్రభావతి అంటుంది. ఏ ఎందుకు కాదు. ముగ్గురు కొడుకులు, కోడళ్లు ఉన్నప్పుడు ఒకటి ఎందుకు కాదు. ఉదయమే లేచి అన్ని పనులు చేసి ప్రతి ఒక్కరికి కావాల్సిన టిఫిన్ వండి. రాత్రి తిన్న కంచాలు కడిగి నేను ఒక్కదాన్నే పనులు చేశాను అని మీనా అంటుంది.

గౌరవమే పోయిందన్న మీనా

నన్ను ఆపేందుకు మాయదారి నాటకాలు ఆడి దొరికాక నేను ఏం చేయట్లేదని, బాగా లేదని అంటారా. నేను ఇక వంట చేయను అని మీనా అంటుంది. సత్యంకు మాత్రం చపాతి, పప్పు చేశానని, తినేసి మాత్రలు వేసుకోమ్మని మీనా అంటుంది. నాలుగు రూపాయలను కనపడేసరికి పొగరు తలకెక్కి మాట్లాడుతున్నావా అని ప్రభావతి అంటుంది.

ఏం తలకెక్కింది. నోరు జారితే పడే రోజులు పోయాయి. మీ అసలు రంగు తెలిసాకా మీ మీద గౌరవమే పోయింది. నేను ఏ పని చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండని మీనా తెగించి చెబుతుంది. అయితే, ఇంట్లోంచి ఇద్దరిని గెంటేస్తాను అని ప్రభావతి అంటుంది. ఏయ్.. నా కొడుకు, కోడలిని నువ్వెవరు గెంటేయడానికి అని సత్యం అంటాడు.

అది చేయకుంటే ఏంటీ నాకు చేయరాదా వంట. నేను చేస్తాను అని రోహిణి పిలుచుకుని వెళ్తుంది ప్రభావతి. రోహిణి ఉల్లిపాయలు కట్ చేస్తుంది. కాసేపటికి మంట మంట అంటూ అరుస్తుంది. బాలు, మీనాకు రవి, శ్రుతి సపోర్ట్ చేస్తానంటారు. నేను వచ్చి వండితే అందరూ లొట్టలేసుకుని తింటారు అని ప్రభావతి అంటుంది. ప్రభావతి స్టవ్ అంటిస్తుంది.

గ్యాస్ సిలిండర్ మాయం

కానీ, వెలగదు. తీరా చూస్తే అక్కడ గ్యాస్ సిలిండర్ ఉండదు. గ్యాస్ సిలిండర్ ఏదిరా అని ప్రభావతి వచ్చి అడుగుతుంది. గ్యాస్ సిలిండర్‌ను మీనానే బుక్ చేస్తుంది. తనే డబ్బులిచ్చి తీసుకుంటుంది. ఏనాడైనా ఒక్కరైన డబ్బులిచ్చి తీసుకున్నారా. కాబట్టి గ్యాస్ సిలిండర్ ఇవ్వం అని బాలు అంటాడు. ఏవండి అని ప్రభావతి అంటే.. సత్యం కలగజేసుకోను అంటాడు.

మేము పస్తులు ఉండాలా అని ప్రభావతి అంటే.. బయట 50 కేజీ కట్టెలు దొరుకుతాయి. అవి తెచ్చుకుని వండండి వంటావతి. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ రోగానికి మందు. పైనా డాబాపై మేము ఇంటికోసం తెచ్చిన ఇటుకలు ఉన్నాయి. వాటిని 50 రూపాయలకు అద్దెకు తీసుకుని వాడుకోండి అని బాలు అంటాడు. ఏవండి అని ప్రభావతి అరిస్తే.. కోడలిని అణగదొక్కాలని చూసిన అత్తకు కోడలు చెప్పే గుణపాఠం. జోక్యం చేసుకునే అధికారం మామకు లేదు అని సత్యం అంటాడు.

అత్తయ్య మీకు, మనోజ్, నాకు మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం అని రోహిణి అంటుంది. మన గురించి ఆలోచించనేలేదు అని రవి, శ్రుతి అనుకుంటారు. ఆర్డర్ పెట్టుకోండి. ఎలా వస్తుందో నేను చూస్తాను అని బాలు అనుకుంటాడు. డెలివరీ అతను వస్తాడు. మనోజ్ అని చెప్పి బాలు తీసుకుంటాడు. దాన్ని వాసన చూసి కేవలం వాసన చూసేందుకే పెట్టాను. నువ్వే తీసుకెళ్లు అని బాలు అంటాడు.

బాలు అన్నదానం

దాంతో డెలివరీ బాయ్ రివర్స్ వెళ్లిపోతాడు. మనోజ్ వెళ్లి చూస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. డెలివరీ అయిపోయిందని చూపిస్తుందని రోహిణి అంటుంది. సరే మళ్లీ పెడతానని పెడుతుంది రోహిణి. ఆ డెలివరీ బాయ్ కూడా వస్తాడు. బయట ఉన్న బాలు ఈరోజు అన్నదానం నువ్వే ఉంచుకో అని అంటాడు. దాంతో అతను కూడా వెళ్లిపోతాడు.

బాలు ఇంట్లోకి వెళ్తాడు. ఫుడ్ డెలివరీ అతనికి మనోజ్ కాల్ చేస్తే థ్యాంక్స్ సర్ మీరే కదా అన్నదానం అని ఇచ్చారని చెబుతాడు. అదే వెళ్లి బాలును మనోజ్ నిలదీస్తాడు. మీ అందరికి పాఠం చెప్పాలని, ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. మీనా అన్ని పనులు చేస్తుందని ఒప్పుకో మీనా వంట చేస్తుందని బాలు అంటాడు. అలా అస్సలు జరగదని ప్రభావతి అంటుంది.

అయితే విప్లవ జ్వాలలు రగులుతూనే ఉంటాయని బాలు అంటాడు. శ్రుతి కూడా ఆకలని అంటే.. గ్యాస్ లేకున్నా వంట వండుతానని రవి అంటాడు. కుక్కర్‌లో మ్యాగీ, బ్రెడ్ టోస్ట్ చేస్తాడు రవి. అది మనోజ్ వాళ్లకు వాసన వస్తుంది. మనోజ్ చూసి చెబుతాడు. రేయ్ రవి మాకు కూడా చేసి పెట్టు. డబ్బు ఇస్తాను అని మనోజ్ అంటాడు. గరిటతో కొడతానని రవి అంటాడు.

ప్రభావతి శాపం

రవి, శ్రుతి తింటారు. మనోజ్, ప్రభావతి, రోహిణి ఆకలితో అలమటిస్తుంటారు. ఆర్డర్ పెడితే వాడు ఆపుతున్నాడు. నేరుగా వెళ్తే వాడు ఏం చేయలేడుగా అని ప్రభావతి అంటుంది. అవును అని కారు కీస్ కోసం పైకి వెళ్తాడు మనోజ్. బయటకు వెళ్లిన బాలు కారు టైర్‌లో గాలి తీస్తాడు. మనోజ్ వెళ్లి చూస్తే టైర్ పంచర్ అయిందని ఏడుస్తూ వస్తాడు.

బాలు సెటైర్లు వేస్తాడు. రేయ్ నడుచుకుంటూ వెళ్లవని ప్రభావతి అంటుంది. నేను బిజినెస్ మ్యాన్‌ను నడుచుకుంటూ వెళ్లను. కుక్కలు ఉంటాయని మనోజ్ అంటాడు. అరేయ్. ఏమైనా తీసుకురార అని ప్రభావతి నీరసంగా అనడంతో మనోజ్ వెళ్తాడు. ప్రభావతి వాళ్ల పరిస్థితిని సెటైర్లు వేసి సత్యంకు చెబుతాడు బాలు.

ఇప్పుడు నీకు సంతోషంగా ఉందిగా. మీరు తిని మాకు పెట్టలేదు. మీకు ఆ పాపం ఊరుకేపోదని ప్రభావతి అంటుంది. ఏనాడైనా నాకు నువ్వు గోరుముద్దలు పెట్టావా. నీ ఒళ్లో పడుకోబెట్టుకున్నావా. ఒక్కసారైనా నీ చేత్తో వడ్డించావా, మరెందుకమ్మా మాకు శాపాలు పెడతావు. నీ పాపాలే నీకు శాపాలుగా మారుతాయ్. నాకు నా భార్యకు చచ్చిన పాపం తగలదని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More