గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బయటపడిన ప్రభావతి ఫేక్ డ్రామా-ఏడిపించిన మీనా, బాలు గుణపాఠం-నీతు అసిస్టెంట్‌గా శ్రుతి
Gunde Ninda Gudi Gantalu Serial June 18th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 18వ ఎపిసోడ్‌లో రవి ఓనర్ నీతు దగ్గర శ్రుతి అసిస్టెంట్‌గా జాయిన్ అవుతుంది. ప్రభావతిది ఫేక్ డ్రామా అని మీనా తెలుసుకుంటుంది. బాలు వచ్చి మెడలో దండ వేసి జరిగింది బయటపెడతాడు. దాంతో సత్యం కొట్టడానికి చేయి ఎత్తుతాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాతో చేయి నొప్పి అని ఫేక్ డ్రామా ఆడిన ప్రభావతి తను వండిన కూరలు వద్దని, క్యారెట్ ఫ్రై, టొమాటో రైస్ చేయమంటుంది. ఆదరబాదరగా కాకుండా నిదానంగా చేయమని చెబుతుంది అత్త ప్రభావతి.

సాధించిన మీనా
సరేనని మీనా వెళ్లిపోతుంది. పిచ్చిది.. నా మాటలకు దడుసుకుని ఉండుంటుంది. ఇక ఆ కాంట్రాక్ట్ పోయినట్లే అని సంతోషపడుతుంది ప్రభావతి. వీడియో కాల్‌లో డెకరేషన్ చూసి బాగుందని, ఏది ఎలా చేయాలో చెబుతుంది మీనా. వీడియో కాల్‌లో డెకరేషన్ ఎలా చేయాలో చెప్పిన మీనా క్యారెట్ కట్ చేస్తూ వంట చేస్తుంది.
మొత్తం మండపం డెకరేషన్‌ను బాలు చూపిస్తాడు. శభాష్ మీనా నువ్వు సాధారణమైనదానివి కాదు. మేనేజర్ కూడా షాక్ అయ్యారు అని బాలు అంటాడు. మీరు ఉన్నారు, సుమతి చూసుకుంది. మీరంతా ఉన్నారు. మీరందరు ఉన్నారు కాబట్టే అది సాధ్యమైందని మీనా సంతోషిస్తుంది. మరోవైపు ఈ ప్రభావతి తలుచుకుంటే ఏమైనా చేయగలదు. దాని డెకరేషన్ కాంట్రాక్ట్ పోగొట్టాను అని మురిసిపోతూ గట్టిగా నవ్వుతుంది ప్రభావతి.
ఇంతలో ప్రభావతికి చింతామణి కాల్ చేసి ఏం ఊడబూడ్చారు అని అంటుంది. ఇంటి దగ్గరే ఆపేశాను అని ప్రభావతి అంటుంది. మీనా అక్కడే ఉంది. నాకన్న తెలివిగా ఆలోచించింది. నీ కొడుక్కి వీడియో కాల్ చేసి అందరితో పనులు చేయించింది. సాధించింది నీ కోడలు. గ్రాండ్‌గా డెకరేషన్ చేసి పేరు తెచ్చుకుందని చింతామణి చెబుతుంది.
బయటపడిన ప్రభావతి ఫేక్ డ్రామా
నాకు అన్ని సేవలు చేసింది అని ప్రభావతి అంటుంది. నా నోట్లో మట్టికొట్టింది. నీ కోడలు అసాధ్యురాలు. తన పోటీ తట్టుకుని నేను ఎంతదూరమైన వెళ్లగలను. కానీ, మీకే ఉంది. మీకే సినిమా చూపిస్తుందని చింతామణి కోపంగా కాల్ కట్ చేస్తుంది. ఆ మాటలు మీనా వింటుంది. కావాలనే చేసిందా, ఇదంతా ఎవరితో చెబుతుందని మీనా డౌట్ పడుతుంది.
మరోవైపు ఒకరిని నీతు ఇంటర్వ్యూ చేస్తుంది. తను 50 వేలు శాలరీ అడుగుతుంది. దానికి షాక్ అవుతుంది నీతు. ఇంతలో రవి వస్తాడు. రవికి తెలిసి కూడా షాక్ అవుతాడు. రవి తను శాలరీ గురించి కాకుండా డ్రీమ్, అనుభవం కోసం వర్క్ చేస్తున్నట్లు చెబుతాడు. మరికొంతమందిని ఇంటర్వ్యూ చేసి నాకు అసిస్టెంట్‌గా ఎవరు నచ్చరు.
దాంతో నీతు తలపట్టుకుని కూర్చుంటే శ్రుతి వచ్చి అసిస్టెంట్‌గా జాబ్ చేస్తానంటుంది. డబ్బింగ్ ఉంది కదా అని నీతు అంటే.. పార్ట్ టైమ్ కదా. నాకేం ఇబ్బంది లేదు. నిజం చెప్పాలంటే రవి కోసం వస్తున్నాను. మా మధ్య టైమ్ గ్యాప్ వస్తుందని, ఇక్కడ ఉంటే టైమ్ స్పెండ్ చేయొచ్చని, మళ్లీ ఇక్కడ రవి వర్క్ చేసే విధానం చూడాలని ఉందని శ్రుతి అంటుంది.
నీతుకు అసిస్టెంట్‌గా శ్రుతి
చాలా మంచి ఆలోచన. కానీ, రవిని అడిగి చెబుతానని నీతు అంటుంది. ఈ రెస్టారెంట్‌కి ఓనర్ మీరు కదా. శాలరీ మీరు ఎంతిస్తే అంతా. నాకు జాబ్ ముఖ్యం, శాలరీ కాదు అని శ్రుతి అంటుంది. దానికి సరేనని నీతు అంటుంది. నీతుకు అసిస్టెంట్‌గా శ్రుతి జాయిన్ అయి వెళ్లి రవిని కలుస్తుంది. తను జాబ్‌లో జాయిన్ అయినట్లు చెబుతుంది.
నీతు కూడా వచ్చి నిజమని చెబుతుంది. కాసేపు వాదించుకుని శ్రుతికి రవి వెల్‌కమ్ చెబుతాడు. మరోవైపు పూలదండ పట్టుకుని వచ్చి అందరిని పిలిచి ప్రభావతికి సన్మానం చేయాలని బాలు అంటాడు. ఎందుకని సత్యం అడిగితే.. ఇలాంటి స్త్రీ మూర్తి, దేవమూర్తి ఉంటే ఇల్లు వెలిగిపోతుందని, ప్రభావతి మెడలో దండ వేస్తాడు. అంతా చప్పట్లు కొడతారు.
అమ్మ ఎంతటి ఘనకార్యం చేసిందో తెలుసా అని బాలు అంటే.. ఎందుకు చేశారు ఆ పని అని మీనా నిలదీస్తుంది. ఏ పని అని ప్రభావతి అంటే.. చేయి విరిగిందని ఎందుకు నాటకం ఆడారు. నీ కొడుకు, కోడలు పైకి వస్తున్నారంటే ఆనందపడాలని కానీ ఇంతలా దిగజారాల అత్తయ్య అని మీనా అంటుంది. ఏం చేసిందని సత్యం అడుగుతాడు.
నేర ఆలోచనలతో ప్రభావతి
పూల డెకరేషన్ ఆర్డర్, చేయి బెణికిందని నాటకం ఆడి ఆపింది, పొద్దున్నుంచి ఖాళీ లేకుండా నాతో సేవలు చేయించుకున్నారు. వెళ్లకుండా ఆపారు అని జరిగింది అంతా ఎంతో బాధతో చెబుతుంది మీనా. మాట్లాడవేంటే పాపిష్టిదానా. మీనా చెప్పేది నిజమేనా అని నిలదీస్తాడు సత్యం. చూశావ రవి. ఇది మీ అమ్మ నిజస్వరూపం. ఇలాంటి నేర ఆలోచనలు ఉన్న మహిళను ఎక్కడ చూడలేదంటుంది శ్రుతి.
మనోజ్, రోహిణి అడ్డుపడితే అత్త చరిత్ర చెప్పమంటావా అని శ్రుతి పంచ్ ఇస్తుంది. కోడలు సంపాదిస్తే నీకేంటీ కడుపు మంట అని రవి అంటాడు. నాకు నిజంగానే చేయి బెణికిందని ప్రభావతి అంటుంది. అలా అయితే హాస్పిటల్‌కు వెళ్లాలిగా. మీనానే ఎందుకు ఆపాలని శ్రుతి, రవి అంటుంది. అసలు డ్రామా ఆడిందని మీకెవరు చెప్పారని మనోజ్ అంటాడు.
డెకరేషన్‌కు వెళ్లకుండా ఆపానని ఎవరితోనో ఫోన్‌లో చాలా గర్వంగా చెప్పారు. నా చెవులారా విన్నాను, కళ్లారా చూశాను. ఆ మోసం చూసి తట్టుకోలేకపోయాను. ఏడ్చాను. అదే నన్ను కన్నతల్లి అయితే ఆపేదా అని బాధపడ్డాను అని మీనా అందరిని ఏడిపించేస్తుంది. నాకు చెప్పుకుని ఏడ్చింది. నీ చేయి బెణికిందంటే కూతురులా చూసుకుంది. అప్పుడైనా ఇది తప్పని అనిపించలేదా అని బాలు అంటాడు.
చేయి ఎత్తిన సత్యం
ఇప్పుడు కూడా అబద్ధం చెబుతున్నారని బుకాయిస్తావా అని సత్యం కోప్పడుతాడు. తలోమాట అంటారు. అందరిని ఆపమని అరుస్తుంది. కావాలనే నాటకం ఆడాను. అయితే ఏంటీ. ఇప్పుడేం చేస్తారు అని ప్రభావతి అంటుంది. ఊరు మీద తిరుగుతు ఇంటి పని పట్టించుకోవట్లేదు. ఇలా వదిలేస్తే ఇంటి పని వదిలేసి వీడి వత్తాసుతో రెచ్చిపోతుందని ప్రభావతి అంటుంది.
నోర్మూయ్ అని గట్టిగా అరుస్తూ భార్య ప్రభావతిపై చేయి ఎత్తుతాడు సత్యం. అంతా షాక్ అవుతారు. నీది ఆడజన్మేనా. నీది కన్న కడుపునే. మూడు పూటల అన్నపూర్ణలా అన్నం పెడుతున్న మనిషికి కష్టం తలపెడతావా. రేపు కాళ్లు చేయి పడిపోతే గంజి కూడా పోసే దిక్కులేకా చస్తావ్. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావ్. నీ మెడలో దండ ఎందుకే అని పూలదండను లాగేస్తాడు సత్యం.
నేను వండట్లేదా అని మీనా అంటే.. అంతా ఉడికిఉడకని కూరలు, ఎవరైనా తినేలా ఉంటున్నాయా అని ప్రభావతి అంటుంది. మనోజ్ తనకు వడ్డించదంటాడు. ఏదోటి చేస్తే అయిపోతుందనుకుంటుంది అని రోహిణి అంటుంది. ఆపండి. మనుషుల్లా మాట్లాడుతున్నారా. ఎంత పని ఉన్నా అందరికి కమ్మంగా వండిపెడుతుంది. అలాంటిదాన్ని పట్టుకుని ఇలా అంటారా అని బాలు అంటాడు.
బాలు గుణపాఠం
ఇవాళ మా అమ్మ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. వీడియో కాల్‌లో డెకరేషన్ చెప్పి సక్సెస్ అయింది. మేనేజర్ మెప్పు పొందింది. ఈ విషయంలో అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ డెకరేషన్ చూసి ఒకేసారి ఇంకో చోట నాలుగు ఆర్డర్స్ వస్తే, ఒకేసారి చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని వీడియో కాల్ మాట్లాడుతూ డెకరేషన్ చేయించే అనుభవం సంపాదించింది అని బాలు గర్వంగా చెబుతాడు.
కానీ, ఇలా చేసినందుకు నీకు మంచి గుణపాఠం చెప్పకుండా వదిలే ప్రసక్తే లేదు అని ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు బాలు. మీనాను తీసుకెళ్లిపోతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


