గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: విడాకుల కోసం లాయర్ దగ్గరికి శ్రుతి-కాపురం నిలబెట్టిన మీనా బాలు-సురేంద్రకు వార్నింగ్
Gunde Ninda Gudi Gantalu Serial June 12th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 12వ ఎపిసోడ్‌లో విడాకుల కోసం లాయర్ దగ్గరికి శ్రుతి వెళ్లిందని బాలు, మీనా తెలుసుకుని అక్కడికి వెళ్తారు. శ్రుతికి నచ్చజెప్పుతారు. మరోవైపు సురేంద్రకు వచ్చిన మూతిపళ్లతోనే వెళ్లాలిగా అని వార్నింగ్ ఇస్తాడు సత్యం.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రవి, శ్రుతికి మధ్య ఏదో గొడవ అయినట్లుందని మనోజ్‌తో రోహిణి అంటుంది. ప్రభావతి, కామాక్షితో శోభన డ్యాన్స్ చేస్తుంది. ఇందాక మీరన్నారుగా. మీ ఆవిడకు కూడా డ్యాన్స్ నేర్పిస్తే మీరు సస్పెండ్ అయిన ఆదాయం వచ్చేదిగా అని సురేంద్రకు మరో కౌంటర్ ఇస్తాడు సత్యం అంటాడు.

లాయర్ దగ్గరికి వెళ్లిన శ్రుతి
మరోవైపు శ్రుతి కనిపించకోవడంతో రవి ఇరిటేట్ అవుతాడు. బాలుకు కాల్ చేసి శ్రుతి గురించి రవి అడుగుతాడు. శ్రుతిని ఎలాగైనా వెతికి పట్టుకొస్తామని మీనా అంటుంది. మరో డబ్బింగ్ స్టూడియోకు వెళ్లిన బాలు, మీనా శ్రుతి గురించి అడుగుతారు. ఇందాకే వచ్చి వెళ్లిందని, సౌండ్ ఇంజినీర్‌తో ఏదో లాయర్ గురించి అడిగిందని, తన ఫ్రెండ్‌కు కుటుంబ సమస్య ఉందని, విడాకుల గురించి మాట్లాడాలని అంటుందని అక్కడున్నామే చెబుతుంది.
డబ్బుడమ్మా కోపంలో పెద్ద పిచ్చి నిర్ణయం తీసుకుంటుందా అని బాలు డౌట్ పడతాడు. లాయర్ అడ్రస్ ఇస్తుంది ఆమె. దాంతో లాయర్ దగ్గరికి బాలు, మీనా వెళ్తారు. శ్రుతి విడాకులు తీసుకోబోతుందా అని కంగారుగా అడుగుతుంది మీనా. బాలు సెటైర్లు వేస్తాడు. మరోవైపు నాన్‌స్టాప్‌గా డ్యాన్స్ చేసిన ప్రభావతి, కామాక్షి, శోభన అలసిపోతారు.
వాళ్ల డ్యాన్స్ గురించి గొప్పగా మాట్లాడమని సత్యంను స్టేజీ మీదకు తీసుకెళ్తాడు రవి. సురేంద్ర రావడం, శోభన డ్యాన్స్ చేయడం గురించి పొగుడుతాడు సత్యం. మళ్లీ ప్రభావతి, కామాక్షిలతో డ్యాన్స్ చేయిస్తాడు రవి. శోభన డ్యాన్స్ చేయడంపై సురేంద్ర ఫైర్ అవుతాడు. నాకు ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తోందని, రవి కంగారుపడటం గురించి చెబుతాడు సురేంద్ర.
రవిని నిలదీసిన సురేంద్ర
నిజమేనండి, శ్రుతి కూడా ఇంకా రాలేదని శోభన అంటుంది. రవిని పక్కకు తీసుకెళ్తారు శ్రుతి తల్లిదండ్రులు. నీకు శ్రుతికి ఏదైనా గొడవ జరిగిందా అని సురేంద్ర అడుగుతాడు. అయ్యో అలాంటిదేం లేదని రవి కవర్ చేస్తాడు. ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడే చెప్పమని సురేంద్ర అడుగుతాడు. శ్రుతి వచ్చేస్తుంది. అలాంటిదేం లేదని రవి అంటాడు.
సరే నువ్వైతే ప్రశాంతంగా ఉండు. అది కోపంలో ఏదేదో చేస్తుందని శోభన అంటుంది. మరోవైపు లాయర్ ఆఫీస్‌లో శ్రుతిని చూసి కలుస్తారు బాలు, మీనా. నీతుని ఎత్తుకోవడం గురించి కోపంగా చెబుతుంది శ్రుతి. దాంతో బాలు, మీనా నవ్వుతారు. దాంతో ఎందుకు నవ్వుతున్నారు అని శ్రుతి కోప్పడుతుంది. దాంతో నీతు కాలి జారిపడింది చెబుతారు బాలు మీనా.
సగం చూసి మిగతాదంతా ఊహించేసుకున్నావ్. వాడు చెప్పిన వినలేదని బాలు అంటాడు. అవును వాడు కాల్ చేశాడు. నేనే లిఫ్ట్ చేయలేదని శ్రుతి అంటుంది. కోపంలో నువ్వు రంపంలా మారిపోతావ్. మాటలతో రప్పా రప్పా కోస్తావని బాలు అంటాడు. అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశానని శ్రుతి అంటుంది. సరే పదా అని బాలు, మీనా అంటే.. అయ్యయ్యో కుట్టించిన బట్టలు మర్చిపోయానని శ్రుతి అంటుంది.
సురేంద్రకు సత్యం సెటైరికల్ వార్నింగ్
మరోవైపు రవిని సత్యం ఫ్యామిలీ అంతా కలిసి శ్రుతి గురించి అడుగుతారు. సురేంద్ర, శోభన కూడా వచ్చి నా కూతురుని ఏం చేశావని అడుగుతారు. అల్లుడు సరిగా చెప్పట్లేదు. అందుకే అనుమానాలు వస్తున్నాయని శోభన అంటుంటారు. ఇంతలో శ్రుతిని బాలు, మీనా తీసుకొస్తారు. శ్రుతిని చూసి అంతా సంతోషిస్తారు.
ఇంత లేట్ అయిందేంటే అని తల్లి అరిస్తే.. డిజైనర్ డ్రెస్ సరిగా కుట్టలేదు. బాలు, మీనా, నేను గొడవ పెట్టి మరి కరెక్ట్‌గా కుట్టించేసరికి ఇలా లేట్ అయిందని శ్రుతి చెబుతుంది. ఇందాక నా కొడుకును ఏదో అన్నారు. గౌరవనీయులైన సార్ గారు మీరు మీ నోటి దూల కొంచెం తగ్గించుకుంటే మంచిది. అసలే మా బాలుగాడికి మీరు పడరు. మూతి పళ్లతో వచ్చారు. మళ్లీ అన్ని పళ్లతో వెళ్లండి అని సరేంద్రకు అదిరిపోయేలా సెటైరికల్ వార్నింగ్ ఇస్తాడు సత్యం.
తర్వాత జరిగింది మాట్లాడుకుంటారు రవి, శ్రుతి. బాలు, మీనాకు థ్యాంక్స్ చెబుతాడు రవి. నా కాపురం నిలబెట్టావ్ వదిన అని మీనాతో అంటాడు రవి. రవి, శ్రుతి కేక్ కట్ చేసి ఐ లవ్యూ చెప్పుకుని యానివర్సరీ విషెస్ చెప్పుకుంటారు. ఇద్దరు వెళ్లి బాలు, మీనాకు మొదటగా కేక్ తినిపిస్తారు. ప్రభావతి, మనోజ్ అసూయ పడతారు.
శ్రుతిలో ముగ్గురి పోలికలు
మా పెళ్లి జరగడానికి మీనా కారణమని, సంతోషంగా ఉండటానికి బాలు, మీనా కారణమని మెచ్చుకుంటారు శ్రుతి, రవి. మా అమ్మలోని పొగరు, నాన్నలోని గర్వం, మా అత్తలోని చాదస్తం అన్ని నాలో ఉన్నాయి. దానివల్ల మందలో తప్పిపోయిన మేకపిల్లలా చేస్తాను. బాలు, మీనాలే నన్ను వెతికి తీసుకొస్తారు. ఎలా ఉండాలో నాకు మీనా చాలా బాగా చెబుతుందని మీనా గురించి చాలా గొప్పగా చెబుతుంది శ్రుతి.
బాలు, మీనా బెస్ట్ కపుల్స్ అని పొగుడుతుంటారు. తనను చాలా బాగా అర్థం చేసుకున్నాడని, భరించాడని రవికి ముద్దు పెడుతుంది శ్రుతి. ప్రభావతి నోరు అదుపులో ఉండదని, బెస్ట్ ఎంటర్‌టైనర్ అని ప్రభావతి గురించి, అంకుల్ తనను కన్న కూతురులా చూసుకుంటారని చెబుతుంది శ్రుతి. భార్య శ్రుతి కోసం స్పెషల్ సర్‌ప్రైజ్‌గా సింగర్‌ను తీసుకొచ్చానని రవి చెబుతాడు.
ఆ సింగర్ పాటలు పాడుతాడు. నమ్మావేమో గానీ అందాల యువరాణి పాటకు రవి, శ్రుతి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


