గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శ్రుతి మిస్సింగ్, బాలు మీనా వెతుకులాట- ముసలోళ్ల డ్యాన్స్- సురేంద్రపై సత్యం పంచులు

Gunde Ninda Gudi Gantalu Serial June 11th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 11వ ఎపిసోడ్‌‌లో రెస్టారెంట్‌లో నీతూని రవి ఎత్తుకోవడం చూసి శ్రుతి కోపంగా వెళ్లిపోతుంది. రవి టెన్షన్ పడుతుంటాడు. శ్రుతి కోసం బాలు, మీనా వెతుకుతారు. ఫంక్షన్‌లో అవమానంగా మాట్లాడిన సురేంద్రపై సత్యం పంచులు వేస్తాడు.

Published on: Jun 11, 2026, 07:40:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో వెయిటర్ ఫుడ్ కింద పడేస్తే నీతూ తిడుతుంది. ఇంకో ఆర్డర్ ప్రిపేర్ చేస్తానని రవి అంటాడు. కిచెన్‌లోకి వెళ్లిన నీతూ జారడంతో కిందపడిపోతుంది. కాలు బెణుకుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 11 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 11 ఎపిసోడ్

కాలు జారి పడ్డ నీతూ

నొప్పితో అరుస్తుంది నీతు. అది విన్న రవి వచ్చి చూసి షాక్ అవుతాడు. నీతూను ఎంత పైకి లేపేందుకు ట్రై చేసిన లేవలేకపోతుంది. దాంతో నీతూని ఎత్తుకుని రవి బయటకు తీసుకొస్తాడు. అప్పుడే రెస్టారెంట్‌కు వచ్చిన శ్రుతి నీతూని రవి ఎత్తుకోవడం చూసి ఛీ కొట్టి వెళ్లిపోతుంది. సోఫాలో నీతూని కూర్చోబెట్టి శ్రుతి దగ్గరికి రవి వెళ్లి ఆపుతాడు.

కానీ, శ్రుతి ఏది వినకుండా ఆటో ఎక్కి వెళ్లిపోతుంది. నీతూ దగ్గరికి రవి వెళ్తాడు. శ్రుతి కోపంగా వెళ్లిపోయిందని రవి చెబుతాడు. నీతూ కాల్ చేయమని చెబుతుంది. రవి కాల్ చేస్తే శ్రుతి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. సరే ఇవాళ నీ యానివర్సరీ కదా, వెళ్లు అని నీతూ అంటుంది. కానీ, రవి నీతూని హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. మరోవైపు గ్రీన్ కలర్ సారీ కట్టుకుని ఎంతో అందంగా మీనా వస్తుంది.

అది చూసి ఫ్లాట్ అయిన బాలు మీనా అందాన్ని పొగుడుతాడు. రోజు రోజు వయసు తగ్గుతోందని, బయటకు వెళ్తే నాకు కూతురు అంటారని బాలు అంటాడు. ఏంటీ మోసేస్తున్నారు. ఇదంతా ఇవాళ పార్టీలో మందు తాగడానికా అని మీనా అంటుంది. భార్యను అందంగా ఉన్నావంటే ఇంత అనుమానమా అని బాలు అంటాడు. మీరు కూడా చాలా బాగున్నారని మీనా అంటుంది.

శ్రుతి మిస్సింగ్

ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందని బాలు అంటాడు. మీనా చీర మడతలు సర్దుతాడు బాలు. మరోవైపు శ్రుతికి కాల్ చేస్తూ రవి తెగ టెన్షన్ పడుతుంటాడు. ఇంకోవైపు ప్రభావతికి రోహిణి మేకప్ వేస్తుంది. ఎంత బాగున్నానో అని మురిసిపోతుంది ప్రభావతి. బాలు ప్రభావతిని అందంగా రెడీ అయిందని మెచ్చుకుంటాడు. రవిని బాలు పిలుస్తాడు.

కిందకు రవి వస్తాడు. శ్రుతి గురించి అడిగితే.. డబ్బింగ్‌కు వెళ్లిందని, వాళ్లు చాలా అర్జంట్ అన్నారని చెప్పిందని రవి అబద్ధం చెబుతాడు. సరేనని సత్యం వాళ్లు ఫంక్షన్‌కి వెళ్తారు. రవి టెన్షన్ చూసి ఏమైందని బాలు నిలదీస్తాడు. శ్రుతి ఎక్కడికి వెళ్లిందో తెలియట్లేదు. ఫోన్ స్విచ్ఛాప్ వస్తుందని, రెస్టారెంట్‌లో నీతూతో జరిగింది అంతా చెబుతాడు రవి.

వీడి గురించి తెలిసి అనుమాన పడటం ఏంటని బాలు అంటాడు. ఇప్పుడు శ్రుతి ఎక్కడికి వెళ్లిందో అని భయంగా ఉందని, అంతా శ్రుతి గురించే అడుగుతారని రవి కంగారుపడతాడు. ఇందులో నీ తప్పు ఏం లేదు. ముందు నువ్వు ఫంక్షన్‌కు వెళ్లు. శ్రుతిని మేము తీసుకొస్తాం. శ్రుతి వస్తుందని చెప్పు. ఈ విషయం ఎవరికి చెప్పకు. లేకుంటే గొడవ అవుతుందని బాలు అంటాడు.

ప్రభావతి వార్నింగ్

దాంతో రవి ఫంక్షన్‌కు వెళ్తాడు. శ్రుతిని వెతికేందుకు బాలు, మీనా వెళ్తారు. ఇద్దరిని కలపాలని బాలు అంటాడు. మరోవైపు ఫంక్షన్‌కు సత్యం వాళ్లు వెళ్తారు. వియ్యంకులు ఏర్పాట్లు చాలా బాగా చేశారని అనుకుంటారు. ఖర్చు మనది కాకపోయినా మన చేతుల మీదుగా ఈ ఫంక్షన్ జరుగుతుందని సత్యం అంటాడు. రవి, శ్రుతి మీ చేతుల మీదుగా జరిపించేటట్లు లేరులే నాన్న అని మనోజ్ అంటాడు.

రేయ్ మీ నాన్నను తక్కువ చేస్తే ఫంక్షన్ అంతా ఉరికించి కొడతా అని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. శ్రుతి గురించి అడుగుతారు. వస్తుందని రవి అంటాడు. కామాక్షి వస్తుంది. మణికంఠ కూడా వచ్చి రవితో మనోజ్ పిలిచాడని, మనోజ్‌తో బాలు పిలిచాడని చెబుతాడు. మందు పార్టీ గురించి అడుగుతాడు. బాలు ఫ్రెండ్ రాజేష్ వస్తాడు.

శ్రుతి తల్లిదండ్రులు వస్తారు. ఈ ఫంక్షన్ అయ్యేవరకు ఎలాంటి గొడవ పెట్టుకోకండని సురేంద్రతో శోభన అంటుంది. వాళ్లను చూసిన రవి ఫోన్ మాట్లాడుతున్నట్లుగా శోభన పిలిచిన చూడకుండా వెళ్లిపోతాడు. బిజీగా ఉన్నాడని అనుకుంటారు. సురేంద్రను సర్ అంటూ సత్యం పలకరిస్తాడు. బావగారు అనొచ్చుగా అని కామాక్షి అంటుంది.

పిల్లల డ్యాన్స్

ఆయన మొదటి నుంచి నా పై ఆఫీసర్‌గానే తెలుసు. ఆ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని సత్యం అంటాడు. రవి అస్సలు పట్టించుకోలేదని అత్తమామలు అంటారు. చూసి ఉండరని పిలుచుకుని వస్తానని ప్రభావతి తీసుకొస్తుంది. శ్రుతి గురించి అడిగితే డబ్బింగ్‌కు వెళ్లిందని రవి చెబుతాడు. విద్య వస్తుంది.

ప్రభావతి దగ్గరికి వెళ్లి డ్యాన్స్ స్టార్ట్ చేయమని రవి అంటాడు.

వియ్యంకుల ముందు నేను ఎలా చేస్తానురా. పిల్లలతో చేయిస్తానని చెబుతుంది ప్రభావతి. ప్రభావతి డ్యాన్స్ స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేస్తారు. ప్రభావతిని క్లాసిక్ డ్యాన్స్ చేయమంటాడు రవి. దాంతో ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది. ఈ వయసులో ఈ డ్యాన్సులేంటీ అని సురేంద్ర అంటే.. నోరు తెరవకండని చెప్పానుగా అని శోభన అంటుంది.

అంతా చప్పట్లు కొడతారు. మీ ఇంట్లో ఆడవాళ్లు ఏ వయసొచ్చిన డ్యాన్స్ చేస్తారా అని సురేంద్ర అంటే.. అది శాస్త్రీయ నాట్యం. అది చేయడం తప్పేం కాదు అని సత్యం బదులిస్తాడు. అది ముందే గ్రహించి మంచి డ్యాన్సర్‌ని చేస్తే నువ్వు డ్యాన్సర్ భర్తగా ఉండేవాడివని సురేంద్ర అవమానంగా ఎద్దేవా చేస్తాడు.

సురేంద్రకు సత్యం పంచ్

భార్య టాలెంట్‌తో పైకి ఎదగాలని నేను అనుకోలేదు. డ్రైవర్.. డ్రైవర్‌గా రిటైర్ అవ్వడంలో సిగ్గు పడటానికి ఏం లేదు. సర్వీసులో నాలుగు సార్లు సస్పెండ్ అయి చెడ్డపేరు తెచ్చుకోవడం కన్నా నేను చాలా నయం కదా సర్ అని ఏమాత్రం తగ్గకుండా సురేంద్రకు గట్టి పంచ్ ఇస్తాడు సత్యం. నన్నే అంటున్నాడు అని సురేంద్ర భార్యతో అంటే.. అందుకే ఏమనకండని అన్నాను అని శోభన అంటుంది.

మరోవైపు డబ్బింగ్ స్టూడియోకి బాలు, మీనా వెళ్తారు. అక్కడికి శ్రుతి రాలేదని అక్కడ చెబుతారు. ఇంకో డబ్బింగ్ స్టూడియో గురించి అడిగి అక్కడికి వెళ్తారు బాలు, మీనా. రవి దగ్గరికి మనోజ్, రోహిణి, ప్రభావతి వచ్చి శ్రుతి గురించి అడుగుతారు. ప్రభావతిని ఇంకాసేపు డ్యాన్స్ చేయమని రవి అంటాడు. అత్తను కూడా తీసుకెళ్లమంటాడు.

శోభనను పిలిచి కామాక్షితోపాటు డ్యాన్స్ చేద్దామని, తాను నేర్పిస్తానని ప్రభావతి బలవంతంగా తీసుకెళ్తుంది. ఈ ముసలోళ్ల డ్యాన్స్ అవసరమా. కేక్ కట్ చేస్తే తినేసి వెళ్తాం కదా అని మనోజ్ అంటాడు. ఎప్పుడు తిండిగోల అని ఛీ కొట్టి రవి వెళ్లిపోతాడు. వీళ్లిద్దరి మధ్య ఏదో అయింది. రవి టెన్షన్ పడుతున్నాడని రోహిణి అంటుంది.

ముసలోళ్ల డ్యాన్స్

స్టేజీ మీద ప్రభావతి, శోభన, కామాక్షి ముగ్గురు డ్యాన్స్ చేస్తారు. సత్యం సంతోషంగా చూస్తే సురేంద్ర ఇరిటేట్ అవుతాడు. మిస్ అయిన శ్రుతి గురించి ఇంకా ఏం తెలియదు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More