గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా ఆర్డర్ ఆపేలా ప్రభావతితో చింతామణి ప్లాన్- రాజేష్‌కు ఫైన్- బాలుకు పిడిగుద్దు

Gunde Ninda Gudi Gantalu Serial June 16th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 16వ ఎపిసోడ్‌‌లో మీనా ఆర్డర్‌కు రవి, శ్రుతి చెరో 20 వేల అప్పు ఇస్తారు. మీనా ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేందుకు ప్రభావతితో చింతామణి ప్లాన్ చేస్తుంది. అత్త పొగరు దించుతానని మీనా అన్నట్లు ప్రభావతికి చెబుతుంది చింతామణి.

Published on: Jun 16, 2026, 07:57:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాకు 4 లక్షల 20 వేల ఆర్డర్ రావడంతోపాటు 20 వేలు అడ్వాన్స్ ఇస్తారు. అన్ని పనులతో కలిపి 70 వేలు అవుతుందని, ఆ డబ్బును రవి, శ్రుతి దగ్గర అడుగుదామని బాలు, మీనా అనుకుంటారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 16 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 16 ఎపిసోడ్

40 వేలు తగ్గాయి

మరోవైపు రవి, శ్రుతి సినిమా చూస్తారు. రవికి నచ్చితే శ్రుతికి నచ్చదు ఆ సినిమా. దాని గురించి ఇద్దరు గొడవ పడుతుంటారు. అంతలో బాలు, మీనా వచ్చి అడిగితే.. ఫైటింగ్ జరుగుతుందని రవి అంటాడు. తర్వాత 4 లక్షల ఆర్డర్ గురించి చెప్పి ఇంకా 40 వేలు తక్కువ పడుతుందని, ఆ డబ్బు కావాలని బాలు, మీనా అడుగుతారు.

దానికి రవి, శ్రుతి ఇద్దరం ఇస్తామని గొడవ పడతారు. తర్వాత చెరో 20 వేలు ఇస్తామని చెబుతారు. ఏది కావాలన్న మొహమాట పడొద్దుని మీనాతో శ్రుతి అంటే.. చిన్నప్పుడు నేను చదువుకోడానికి కష్టపడ్డావ్, నువ్వు ఎప్పుడైనా డబ్బు అడగొచ్చు అన్నయ్య అని బాలుతో రవి అంటాడు.

మరోవైపు చింతామణితోపాటు పిల్లలకు ప్రభావతి డ్యాన్స్ నేర్పిస్తుంటుంది. చింతామణి బాగా చేస్తుందని ప్రభావతి చాలా మెచ్చుకుంటుంది. వేదికల మీద పర్ఫామెన్స్ కూడా ఇవ్వొచ్చు అని అంటుంది. ఇంతలో చింతామణికి కాల్ వస్తే వెళ్లి మాట్లాడుతుంది. వచ్చే వారంలో జరిగే పెద్ద ఆర్డర్ మనకు రాలేదు. మీనాకు వచ్చిందని అసిస్టెంట్ చెబుతాడు.

ప్రభావతితో చింతామణి ప్లాన్

ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఆ పని ఎలా చేస్తావో చూస్తాను అని మనసులో అనుకుంటుంది చింతామణి. ప్రభావతి వచ్చి ఎందుకు డల్‌గా ఉన్నారని అడుగుతుంది. నిన్న మీ కోడలు మీనా కనిపించిందని చెబుతుంది చింతామణి. కామాక్షి వినకుండా ఏదో ఒక పని చెబుతుంది ప్రభావతి.

మీనా మిమ్మల్ని మోసం చేస్తుంటే చెప్పకుండా ఊరుకోలేకపోతున్నాను. నిన్న తనతో మాట్లాడుతూ ఎందుకింత కష్టపడుతున్నావ్ అడిగాను. నేను పనిచేస్తుంది డబ్బుల కోసం కాదు మా అత్తయ్య అహంకారం తగ్గించడానికి, తను నన్ను ఏం అనకూడదని చెప్పిందని చింతామణి కావాలనే చాడీలు చెబుతుంది.

తనకు పెద్ద ఆర్డర్ వచ్చింది కదా అందుకే ఈ పొగరు. మీరు అది చేయకుండా ఆపితే చాలు మీ పవర్ పెరిగిపోతుంది. ఒక్కసారి ఆర్డర్ తీసుకుని చేయకపోతే మరోసారి ఆర్డర్ రాదు. మీరు ఆరోజు మండపానికి వెళ్లనివ్వకుంటే చాలు. నేను చెప్పానని చెప్పకండి. లేకుంటే నేనే పోటీ కోసం ఇలా చేశానని అనుకుంటుందని ప్రభావతితో ప్లాన్ వేస్తుంది చింతామణి.

రహస్య సమావేశం

ఇంతలో కామాక్షి వచ్చి కాఫీ ఇచ్చి రహస్య సమావేశం అయిపోయిందా అని అడుగుతుంది. ప్రభావతి ఏం చెప్పదు. ఇంటికెళ్లిన ప్రభావతి మీనాతో గొడవ పడుతుంది. కాఫీ ఇవ్వనా అని అడిగితే విషం ఇవ్వు ప్రశాంతంగా ఉంటావని, నేను ఈ ఇంట్లో ఉండటం దీనికి ఇష్టం లేదు. నన్ను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందని ప్రభావతి అంటుంది.

పూలమ్ముకుంటూ నా పొగరు తగ్గిస్తానంటుంది. ఇంట్లో నా మాట వినాలని చూస్తుంది అని ప్రభావతి అంటుంది. నేను అలా ఎప్పుడు అనలేదని మీనా అంటుంది. మీతో ఎవరన్నారని రోహిణి అడుగుతుంది. పేరు చెప్పనని ప్రభావతి అంటుంది. ఎవరో చెప్పిన మాటలు విని గొడవ చేస్తున్నావ్ అని సత్యం అంటాడు. నేను చెప్పని మాటలు నా మీద వేయొద్దని మీనా అంటుంది.

మీకు చెప్పిన వాళ్లు అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా అని శ్రుతి అంటుంది. మీనా మన గురించి బయట చెడుగా చెప్పొదని సత్యం అంటాడు. మీ గురించి మంచిగా మాట్లాడని చెడుగా ఎప్పుడు మాట్లాడలేదని మీనా అంటుంది. అదిగో నిజం ఒప్పుకుందని ప్రభావతి అంటుంది. నీకు చెప్పిన వారి పేరు చెప్పు లేకుంటే వదిలేయ్ అనేసి సత్యం వెళ్లిపోతాడు.

రాజేష్‌కు ఫైన్

మీనా చాలా బాధపడుతుంది. పట్టించుకోకని చెప్పి శ్రుతి వెళ్లిపోతుంది. ఇంటికొచ్చిన బాలుకు రాజేష్ కాల్ చేసి తనకు ఇప్పుడే జరిమానా పడిందని, అది ఎందుకో తెలియట్లేదని, అన్ని సరిగ్గా ఉన్నాయిరా. అయినా పట్టుకున్నాడురా. నీతో గొడవ పడిన పోలీస్‌రా. అన్ని వెతికి నెంబర్ ప్లేట్ మీద నెంబర్స్ సరిగా లేవని 2 వేలు రాశాడు. పోలీసులను ఎగతాళి చేసేవాళ్లకు ఇలాగే రాస్తాను అన్నాడు అని రాజేష్ చెబుతాడు.

వాడి కోపం అంతా నా మీద నువ్వు దొరికావ్ అని బాలు అంటాడు. హోటల్‌లో జరిగిన దానికి పగ పెంచుకున్నాడు. నేను ఫైన్ కట్టాను. నువ్వయితే జాగ్రత్తగా ఉండు ్ని రాజేష్ హెచ్చరిస్తాడు. ఇంట్లో అరుచుకుంటూ బాలు వెళితే మీనా ఏమైందని అడుగుతుంది. రాజేష్ గురించి చెప్పి ఒకరోజు వాడి పొగరు దించేస్తాను అని బాలు అంటాడు.

అప్పుడే వచ్చిన ప్రభావతి నా గురించే మాట్లాడుకుంటున్నారని గొడవ పడుతుంది. మీనా పొగరు దించుతానన్నది చెప్పి బాలు, మీనాతో గొడవ పడుతుంది ప్రభావతి. బాలు అనుమానవతి, ఆవేశవావతి, అగరబత్తి అంటూ సెటైర్లు వేస్తుంటాడు. దానికి మీనా నవ్వుతుంది. ఇద్దరు తోడుదొంగలు అంటూ వెళ్లిపోతుంది. అత్త మాటలకు బాధపడుతున్నట్లు మీనా చెబుతుంది.

చిన్నమ్మను కాబోతున్నానా

మన ఎదుగుదల చూసి కూడా ఓర్వలేక ఇలాంటి నిందలు వేస్తుంటారు. ఎవరు ఏమన్నా ఆలోచించకు అని బాలు మోటివేట్ చేస్తాడు. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ అరుణ్ తల్లికి మీనా చెల్లి సుమతి సేవలు చేస్తుంది. అరుణ్ వచ్చి ఫ్రూట్స్ ఇస్తాడు. సుమతికి థ్యాంక్స్ చెబుతాడు. నీలాంటి కూతురు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని అరుణ్ తల్లి అంటే.. తండ్రి చనిపోయాడని చెబుతుంది సుమతి.

ఇంట్లో ఉన్నవాళ్ల గురించి చెబుతుంది. మీనా కాల్ చేస్తే పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది. శుభవార్త అని మీనా చెబితే.. నేను చిన్నమ్మను కాబోతున్నానా అని సుమతి అంటుంది. కాదు అని శివ తీసుకొచ్చిన ఆర్డర్ గురించి చెబుతుంది. పనివాళ్లు ఎక్కువ పడతారు. నువ్వు వస్తావా అని మీనా అడిగితే.. సుమతి వస్తానని చెబుతుంది.

అరుణ్ తల్లిని పలకరిస్తానని చెప్పిన మీనా ఆమెతో మాట్లాడుతుంది. సుమతిని ప్రేమగా చూస్తాడు అరుణ్. రేపు పని ఉండి హాస్పిటల్‌కి రావట్లేదు. మీరు డిశ్చార్జ్ అయి వెళ్లాక కాల్ చేస్తానని సుమతి అంటే.. ఓరోజు భోజనానికి రావాలని అరుణ్ తల్లి అంటుంది. తర్వాత అమ్మను ప్రేమగా చూసుకున్నందుకు అరుణ్ డబ్బు ఇస్తాడు.

బాలుకు పిడిగుద్దు

డబ్బుకోసం చేయలేదని సాటి మనిషిగా చేశాను. ఇలాంటివి నాకు నచ్చవని సుమతి వెళ్లిపోతుంది. ఏ ఇంటికి వెళ్తుందో కానీ ఆ ఇంటిని బృందావనం చేస్తుందని అరుణ్ తల్లి అంటుంది. మరోవైపు మీనా కూరగాయలు కట్ చేస్తుంది. బాలు వస్తాడు. ఏ ట్రిప్ లేదని చెబుతాడు. దాంతో బాలును కూరగాయలు కట్ చేయమంటుంది మీనా. దాంతో బాలు అలాగే చేస్తాడు.

తర్వాత స్కూల్ నుంచి సత్యం వస్తాడు. పని ఎక్కువుంది చేస్తే జీతం ఎక్కువ వస్తుందని ప్రభావతి అంటుంది. దాంతో బాలు కత్తి పట్టుకుని వచ్చి డబ్బు సంపాదించి లక్షలు మింగినోడుకి దారపోయాడనికా అని అంటాడు బాలు. దాంతో బాలును వీపులో కొడుతుంది ప్రభావతి.

మనోజ్ గాడిని పిడిగుద్దు గుద్దుంటే

ఇలా మనోజ్ గాడిని పిడిగుద్దు గుద్దుంటే ఎప్పుడో బాగుపడేవాడని బాలు బాధతో అంటాడు. వీళ్లను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకు వస్తున్నారా అని మీనా అంటే అంతే కదమ్మా అని సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More