గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రవికి మనోజ్ గోల్డ్ రింగ్-పోలీసును రెచ్చగొట్టి ఇరికించిన బాలు- మీనాకు 4 లక్షల ఆర్డర్

Gunde Ninda Gudi Gantalu Serial June 15th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 15వ ఎపిసోడ్‌‌లో రవికి మనోజ్ గోల్డ్ రింగ్ గిఫ్ట్‌గా ఇస్తాడు. మీనాకు శ్రుతి స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తుంది. ట్రాఫిక్ పోలీసును రెచ్చగొట్టిన బాలు వీడియో తీయిస్తూ ఇరికిస్తాడు. మీనాకు తమ్ముడు శివ ఆర్డర్ ఇప్పిస్తాడు.

Published on: Jun 15, 2026, 07:56:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రవి, శ్రుతి యానివర్సరీకి రవికి గోల్డ్ రింగ్ గిఫ్ట్‌గా ఇస్తాడు మనోజ్. మీరు ఎంత ఖరీదైనది ఇస్తారో చూస్తాను అని బాలు, మీనాను ఎగతాళి చేస్తాడు మనోజ్.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 15 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 15 ఎపిసోడ్

మీనాపై యుద్ధం

మేము ఖరీదు చూసి ఇవ్వంరా.. మనసు చూసి ఇస్తామని మీనా తయారు చేసిన ఫ్లవర్ బొకే ఇస్తారు. తర్వాత నీతు వస్తుంది. కాలు బెనికిందిగా, ఎందుకు వచ్చావని రవి అడిగితే.. మా హోటల్ బెస్ట్ చెఫ్‌వి నువ్వు. యానివర్సరీకి రాకుంటే ఎలా అని గిఫ్ట్ ఇస్తుంది నీతు. జరిగిన దానికి గొడవ చేశావట కదా. అయినా నీ అంత బ్యాడ్ టేస్ట్ నాకు లేదని శ్రుతితో అంటుంది నీతు.

తర్వాత అంత గ్రూప్ ఫొటో దిగుతారు. ఈరోజు రవిగాడు లేచిపోయిన రోజు అని బాలు అంటే.. మీరంతా నా మీద యుద్ధం ప్రకటించిన రోజు అని మీనా అంటుంది. ఈ మీనా, బాలు శ్రుతికి ఎలా నచ్చారో అర్థం కావట్లేదని శోభన అంటే.. నాకు ఊరికే ఉండాలని లేదు. వాడిని కెలికి గొడవ పెట్టుకుంటాను అని బాలు, మీనాల దగ్గరికి సురేంద్ర వెళ్తాడు.

నీకు మర్యాద తెలియదా. మమ్మల్ని పలకరించవా అని సురేంద్ర అంటే.. అయ్యా వచ్చావా. మీకు నన్ను కెలికే అంతా ఇంట్రెస్ట్ ఉన్న నాకు మీతో గొడవ పడే ఓపిక లేదు. మనకు ఫంక్షన్స్ అచ్చి రావు. గొడవ అయితే కిందపడేసి తొక్కి పోతాను అని కౌంటర్స్ ఇచ్చి బాలు, మీనా సైలెంట్‌గా వెళ్లిపోతారు. దాంతో సురేంద్ర ప్లాన్ ఫెయిల్ అవుతుంది.

అత్తకు బుద్ధి చెప్పిన మీనా

డ్యాన్స్ చేసినందుకు కాళ్లు నొస్తున్నాయని సత్యంతో ప్రభావతి చెప్పుకుంటుంది. కాపుడం పెట్టమంటారా అని మీనా అడిగితే.. నా నెత్తి మీద పోయి అని ప్రభావతి అంటుంది. సరే అని నీళ్లు తీసుకొస్తుంది. నిజంగానే మీనా తీసుకొస్తుంది. దాంతో ప్రభావతి భయపడుతుంది. అనేముందు ఆలోచించుకుని అనండి. ఏది కాపుడానికి నీళ్లు పెట్టమని రోహిణికి చెప్పి చూడండి అని మీనా అంటుంది.

ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని సత్యం అంటాడు. తర్వాత మీనాకు శ్రుతి, రవి గిఫ్ట్ ఇస్తారు. మాకేదిరా అని మనోజ్, మీనా ఏం చేసిందని రోహిణి అంటారు. మా ఫంక్షన్ జరగడానికి కారణం వదినే. డెకరేషన్ చేసిందిగా అని రవి అంటాడు. అందులో సెల్ ఫోన్ ఉంటుంది. చాలా కాస్ట్‌లీ ఫోనా అని మనోజ్, రోహిణి అంటారు. నాకెందుకు అని మీనా అంటుంది.

నీ బిజినెస్‌కు బాగా ఉపయోగపడుతుందని రవి, శ్రుతి అంటారు. మనం గోల్డ్ ఇచ్చాం. వాళ్లు బొకే మాత్రమే ఇచ్చారు. మీనాకు ఫోన్ కొన్నారు అని మనోజ్ అంటాడు. ఏం చేస్తాం. నేను మీనాల మంచిదానిలా నటించలేను అని రోహిణి అంటుంది. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అరుణ్ తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని మీనా చెల్లి సుమతి హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు.

అరుణ్ తల్లిని చూసుకున్న సుమతి

అరుణ్ తల్లిని చెక్ చేసిన డాక్టర్ పల్స్ బాగా పడిపోయిందని, ఆస్పత్రిలోనే ఉండాలని చెబుతుంది. సుమతికి చెప్పి టెస్ట్‌లు చేయించమంటుంది. ఇంతలో అరుణ్‌కు మినిస్టర్ వేహికిల్ వస్తుందని, ట్రాఫిక్ క్లియర్ చేయాలని కాల్ వస్తుంది. అరుణ్ ఎవరు లేరని కంగారుపడుతుంటే సుమతి దగ్గరుండి చూసుకుంటానంటుంది. దాంతో అరుణ్ సరేనంటాడు.

అరుణ్ తల్లి లేవలేకపోతే సుమతి హెల్ప్ చేస్తుంది. తను బాగా చూసుకుంటుంది. నువ్వెళ్లురా అని తల్లి అంటే అరుణ్ వెళ్లిపోతాడు. మరోవైపు స్కూటీపై విద్య, రోహిణి వెళ్తారు. స్కూటీ బ్రేక్ పడట్లేదే అని విద్య చెబితే చావు కబురు చల్లగా చెబుతావేంటే అని రోహిణి భయపడుతుంది. భయంతో బైక్‌పై నుంచి రోహిణి దూకేస్తుంది. దాంతో విద్య నవ్వుతుంది.

గుణకు తెలివిలేదని, బాలుకు చాలా తెలివి ఉందని విద్య అంటుంది. దాంతో రోహిణి ఇరిటేట్ అవుతుంది. మీనా కనిపిస్తే విద్య వెళ్లి పలకరిస్తుంది. మీ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు వచ్చిందని మీనా అంటే.. ఫోన్ ఇవ్వమని డైరెక్ట్‌గా ఎలా అడగాలి. ఫోన్ తీసుకునేందుకు ఐడియా చెప్పమని విద్య అంటుంది.

ఫోన్ ఆట ఐడియా

ఈసారి ఇంటికి వచ్చినప్పుడు గట్టిగా నిలదీసి అడుగు. అప్పుడు నువ్వు ఇష్టపడుతున్నట్లు చెప్పి ఫోన్‌లు మార్చుకునే ఆట ఆడుకుందామని, ఒకరిపై మరొకరికి ప్రేమ ఎంత ఉందో తెలుసుకోడానికిని చెప్పు. నువ్వు రెగ్యులర్‌గా వాడే ఫోన్ కాకుండా వేరే ఫోన్ ఇవ్వు అని మీనా ఐడియా ఇస్తుంది. దాంతో సూపర్ ఐడియా అని విద్య అంటుంది.

రోహిణి అరవడంతో విద్య వెళ్తుంది. ఏంటే అంతగా మాట్లాడుతున్నావని రోహిణి అడిగితే సీక్రెట్ అని విద్య చెబుతుంది. మరోవైపు హోటల్‌లో లంచ్‌కి బాలు, రాజేష్ కూర్చుంటారు. హ్యాండ్ వాష్‌కు బాలు వెళ్తాడు. అప్పుడే ట్రాఫిక్ పోలీస్ అరుణ్ వస్తాడు. అరుణ్‌ను చూసి కష్టపడి తినాలి. కానీ, లేనివాళ్లను, ముసలివాళ్లను కొట్టి తినకూడదు అని బాలు ఇన్‌డైరెక్ట్‌గా అరుణ్‌ను అంటాడు.

ఇప్పుడు ఎవడ్రా నెత్తుటి కూడు తినేదని రాజేష్ అడుగుతాడు. ఒకడు పుట్టాడులే ఊరికే కేసులు పెడతాడు అని బాలు అంటాడు. రికమండేషన్ జాబ్ అంటూ అరుణ్‌కు కోపం వచ్చేలా బాలు మాట్లాడుతాడు. దాంతో బాలు కాలర్ పట్టుకుని నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతావా అని అరుణ్ అంటాడు. నా మీద కేసు పెట్టావుగా. ఇప్పుడు దొరికావుగా అన్న బాలు రాజేష్‌తో అక్కడున్నవాళ్లతో వీడియో తీయమని అంటాడు.

పోలీసును రెచ్చగొట్టి ఇరికించిన బాలు

దాంతో అంతా వీడియో తీస్తారు. అరుణ్ తనపై అన్యాయంగా చేయిచేసుకుంటున్నట్లు డ్రామా ఆడుతాడు బాలు. అదంతా అందరూ వీడియో తీస్తారు. ఏంటండి ఊరికే మీరే వచ్చి అతనితో గొడవ పెట్టుకుంటున్నారని మిగతా వారు అడుగుతారు. దాంతో అరుణ్‌తో ఉన్న గొడవను బాలు చెబుతాడు. నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక శత్రువు నువ్వే ఎక్కడున్నా ఇరికించేస్తాను అని అరుణ్ కోపంగా వెళ్లిపోతాడు.

ఏంట్రా పోలీస్‌తో పెట్టుకున్నావని రాజేష్ అంటాడు. ముసలివాళ్లను అని, నాతో పెట్టుకున్నాడని బాలు అంటాడు. మరోవైపు తల్లి దగ్గరికి మీనా వెళ్తుంది. పూలు ఇస్తుంది. శివ వీడియో బయటకు రావడం గురించి మాట్లాడుకుంటారు. గుణకు ఇంకెవరో సాయం చేశారు. వాళ్లను కనిపెట్టాలని మీనా అంటుంది. హాస్పిటల్‌లో అరుణ్ తల్లి గురించి చెప్పి త్వరగా వెళ్తుంది సుమతి.

నాన్న లాంటి గుణమే నీకు వచ్చిందని, నాన్న మా మధ్య ఉన్నట్లే ఉందని మీనా అంటుంది. సుమతి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో శివ వచ్చి అక్కకు ఒక ఆర్డర్ తెచ్చానని గుడ్ న్యూస్ చెబుతాడు. చాలా పెద్ద మండపం. గ్రాండ్‌గా చేస్తున్నారు పెళ్లి. ఆర్డర్ ఇచ్చింది మా ప్రొఫెసరే. ఆయనకు మనగురించి బాగా తెలుసు అని శివ అంటాడు.

మీనాకు 4 లక్షల ఆర్డర్

మీనా అనుమానిస్తుంటే.. అక్క గురించి గొప్పగా చెబుతాడు శివ. మీనా ఒప్పుకుంటుంది. ప్రొఫెసర్‌తో మీనాను మాట్లాడిస్తాడు శివ. అతను ఒప్పుకుంటాడు. సర్ వాళ్లు ఇంటికి రమ్మన్నారు. అడ్వాన్స్ ఇస్తారట అని శివ అంటాడు. ముగ్గురు ఒకరికోసం ఒకరు ఉండటం చాలా సంతోషంగా ఉందని పార్వతి అంటుంది.

మరోవైపు రాత్రి మీనా దగ్గరికి వెళ్లి బాలు ఆకలేస్తుందంటాడు. మీనా మొహం వెలిగిపోతుందని, ఏమైందని బాలు అడుగుతాడు. శివ ఇప్పించిన ఆర్డర్ గురించి, మొత్తం నాలుగు లక్షల 20 వేల పని. ఇది బాగా చేస్తే ఇంకా నాలుగు పనులు వచ్చే అవకాశం ఉంది. కానీ, అడ్వాన్స్ 20 వేలు మాత్రమే ఇచ్చారు. మిగతా ఖర్చు అంతా మనమే పెట్టాలని మీనా చెబుతుంది.

పూలు, సామాన్లు, కూలీలు, అడ్వాన్సులు అన్ని కలిపితే 70 వేల వరకు అవుతాయని మీనా అంటుంది. మన దగ్గర అంత డబ్బు లేదుగా. కానీ, పని వదులోకూకడదని బాలు అంటాడు. రవి, శ్రుతిని అడుగుదామా అని మీనా అంటుంది. మొన్ననే యానివర్సరీ చేసుకున్నారుగా. వాళ్ల దగ్గర ఉంటాయా అని బాలు డౌట్ పడతాడు.

అప్పు తీసుకోవడం ఇష్టం లేదు

అప్పుడు మరోదారి చూద్దామని, బయట అప్పు తీసుకోవాలని లేదని మీనా అంటుంది. సరేనని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More