Serial: బుల్లితెరపైకి హీరోయిన్ సంజన సీరియల్- ప్రేక్షకుల ముందే ఏ దేవి వరమో నీవు ఫస్ట్ ఎపిసోడ్- ప్రీమియర్ లాంచ్‌లో బాలు!
Ye Devi Varamo Neevu Serial Premiere Launch Event: బుల్లితెర ప్రేక్షకుల ముందుకు స్టార్ మా సరికొత్త ఫ్యామిలీ డ్రామా ఏ దేవి వరమో నీవు సీరియల్‌తో ముందుకు వస్తోంది. ఈ సీరియల్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు సందడి చేశాడు.
Ye Devi Varamo Neevu Serial Premiere Launch Event: బుల్లితెరపై సరికొత్త ఎమోషనల్ జర్నీ షురూ కాబోతోంది. విభిన్నమైన కథాంశాలతో తెలుగు ఇళ్లల్లో ఒకరిగా కలిసిపోయిన 'స్టార్ మా' ఛానెల్.. ఇప్పుడు మరో పవర్ ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.

సరికొత్త సీరియల్‌గా
'ఏ దేవి వరమో నీవు' పేరుతో వస్తున్న ఈ సరికొత్త సీరియల్ జూలై 6 నుంచి రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్స్‌లో ఏ దేవి వరమో నీవు సీరియల్ గ్రాండ్ ప్రీమియర్ లాంచ్ ఈవెంట్‌ను ఎంతో కోలాహలంగా నిర్వహించారు.
సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు అమ్మ-కూతుళ్ల సెంటిమెంట్, కుటుంబ బంధాల నేపథ్యంలో వచ్చే సీరియల్స్ అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌తో టీఆర్‌పీ రేటింగుల్లో దూసుకుపోతున్న స్టార్ మా.. ఈ కొత్త కథతో ప్రైమ్ టైమ్ స్లాట్‌లో మరింత సందడి చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనాలను చూస్తుంటే ఈ సీరియల్‌పై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయని అర్థమవుతోంది.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా సంజనా గల్రానీ.. ఊపుతెచ్చిన బాలు!
ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో సీనియర్ హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజనా గల్రానీ, సోనియా, శ్రవణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెండితెరపై హీరోయిన్‌గా మెరిసిన సంజనా ఇప్పుడు బుల్లితెరపై ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ కార్యక్రమానికి స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ ‘గుండె నిండా గుడి గంటలు’ హీరో బాలు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
"ఈ సీరియల్ కథలో ఉన్న ఎమోషన్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. చ్చితంగా ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది" అని హీరో బాలు ఆశాభావం వ్యక్తం చేశారు. బుల్లితెర కమెడియన్, యాంకర్ ఎక్స్‌ప్రెస్ హరి తనదైన శైలిలో ఈవెంట్‌ను హోస్ట్ చేస్తూ అక్కడ ఉన్నవారందరినీ ఎంటర్‌టైన్ చేశారు.
మొదటి ఎపిసోడ్‌కే ఫిదా అయిన ఆడియెన్స్!
ఈ ఈవెంట్‌లో కేవలం హంగామా మాత్రమే కాకుండా, అక్కడికి వచ్చిన అభిమానుల కోసం సీరియల్ మొదటి ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా స్క్రీన్ చేశారు. సాధారణంగా సీరియల్స్ టీవీల్లో వచ్చే వరకు సస్పెన్స్ ఉంటుంది, కానీ మేకర్స్ ఎంతో ధైర్యంగా మొదటి ఎపిసోడ్‌ను థియేటర్ తరహాలో ప్రదర్శించారు. ఈ ఎపిసోడ్ చూసిన ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. కథలోని భావోద్వేగాలు, నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాయి.
అసలు కథేంటి?
ఈ సీరియల్ లైన్ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. నమ్ముకున్న ప్రేమికుడు మోసం చేయడంతో గీతాంజలి అనే యువతి ఒక ఆడపాపకు జన్మనిస్తుంది. అయితే సమాజానికి భయపడిన ఆమె తండ్రి, అన్నయ్య ఆ పాపను తమ వారసురాలిగా అంగీకరించడానికి నిరాకరిస్తారు. కన్నతల్లికి కూడా తెలియకుండా ఆ చిన్నారిని తీసుకెళ్లి ఒక అనాథ ఆశ్రమంలో పారేస్తారు.
ఆ ఆశ్రమంలోనే 'అంజలి' అనే పేరుతో ఆ పాప పెరిగి పెద్దవుతుంది. కాలం తిరిగిన చక్రంలా.. అనుకోని పరిస్థితుల్లో అంజలి మళ్లీ తన కన్నతల్లి గీతాంజలి ఇంటికే చేరుకోవాల్సి వస్తుంది.
స్టార్ మా ఛానెల్‌లో
మరి కన్నకూతురిని గీతాంజలి గుర్తుపడుతుందా? తల్లి ప్రేమ కోసం తపించే అంజలికి అమ్మ ఆప్యాయత దక్కుతుందా? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సీరియల్ సాగనుంది.
ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్టార్ మా లో ఈ సరికొత్త డ్రామాను వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


