నా లవర్‌తో కలిసి నా ప్రాణ స్నేహితుడే నమ్మకద్రోహం చేశాడు,అందుకే పెళ్లి చేసుకోలేదు: బుల్లితెర స్టార్ హీరో హర్షద్ కన్నీళ్లు
Harshad Chopda Emotional In Lock Upp Season 2: బుల్లితెర స్టార్ హీరో హర్షద్ చోప్రా తన వ్యక్తిగత జీవితంపై తొలిసారి నోరు విప్పారు. 'లాక్ అప్ సీజన్ 2' ఓటీటీ రియాలిటీ షోలో హర్షద్ చోప్రా పంచుకున్న ప్రేమ వైఫల్యం, ప్రాణ స్నేహితుడి నమ్మకద్రోహం గురించిన చేదు నిజాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Harshad Chopda Emotional In Lock Upp Season 2: బిగ్‌బాస్ తరహాలోనే హిందీ బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న వివాదాస్పద రియాలిటీ ఓటీటీ షో ‘లాక్ అప్: సచ్ యా సజా’ సీజన్ 2 అప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రముఖ టెలివిజన్ నటుడు హర్షద్ చోప్రా తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

కన్నీళ్లు పెట్టుకున్న బుల్లితెర హీరో
గత రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై స్టార్ హీరోగా రాణిస్తున్నప్పటికీ, హర్షద్ ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్‌ను కెమెరాలకు దూరంగానే ఉంచారు. అయితే, ఈ షో రెండో ఎపిసోడ్‌లో ఆయన తన గతాన్ని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?
ఈ ఓటీటీ షోలో తోటి కంటెస్టెంట్ శ్రేయా కల్రా.. "మీ వయసు పెరుగుతున్నా ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు, మీ జీవితంలో ఎవరూ లేరా?" అని హర్షద్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ హర్షద్ మనసులోని బాధనంతా బయటపెట్టారు. గతంలో తనకు ఒకరు దొరికినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనను పూర్తిగా మార్చేశాయని చెప్పారు.
"సరైన వ్యక్తి తోడుగా ఉంటే అది మనకు కొండంత బలాన్ని ఇస్తుందనే మాట నిజమే. కానీ, ఆ సరైన వ్యక్తిని వెతుక్కునే ప్రయాణంలో పెద్ద రిస్క్ ఉంటుంది. అందుకే నేను ఎలాంటి ఎమోషన్స్ లేని ఒక న్యూట్రల్ లైఫ్‌ను అలవాటు చేసుకున్నాను. ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా నా జీవితాన్ని ఇలాగే సాగించేస్తాను" అని హర్షద్ చోప్రా చెప్పుకొచ్చారు.
ప్రేమలో ఘోరమైన నమ్మకద్రోహం
ప్రేమ, బంధాల విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను హర్షద్ వివరిస్తూ.. అవతలి వాళ్లు చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. లోకంలో మనుషులు చాలా స్వార్థపరులని, తాను ఎమోషనల్ డెఫ్‌నెస్ (భావోద్వేగ బేధిరత్వం) అనుభవించానని అన్నారు.
తాను ఎంత మొత్తుకుంటున్నా అవతలి వ్యక్తి వినలేదని, అర్థం చేసుకోలేదని వాపోయారు. తాను అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండటమే తన మైనస్ పాయింట్ అయిందేమోనని, బహుశా అది తన తప్పే కావచ్చునని బాధపడ్డారు.
2010లో జరిగిన ఆ దారుణం
ఈ షో గ్రాండ్ ప్రీమియర్ సందర్భంగా హోస్ట్‌లు ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ సైతం హర్షద్‌ను ఇదే ప్రశ్న అడిగారు. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటినా నీ గురించి ఎవరికీ ఎందుకు ఏమీ తెలియదని రితేష్ ప్రశ్నించగా.. హర్షద్ తన జీవితాన్ని కుదిపేసిన 2010 నాటి సంఘటనను బయటపెట్టారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను అందరితో చాలా యాక్టివ్‌గా ఉండేవాడినని, కానీ 2010లో ఒకేసారి తన లవర్, బెస్ట్ ఫ్రెండ్‌ను కోల్పోయానని చెప్పారు. తన ప్రాణ స్నేహితుడే, తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని, ఆ చీటింగ్ తట్టుకోలేకే తాను ప్రపంచానికి దూరంగా మారానని అసలు రహస్యాన్ని బట్టబయలు చేశారు.
లాకప్ 2 కంటెస్టెంట్స్
ఒక నమ్మకద్రోహం మనిషిని ఎంతలా ఒంటరిని చేస్తుందో హర్షద్ చోప్రా మాటలు వింటే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ క్రేజీ రియాలిటీ షోలో హర్షద్‌తో పాటు సునీతా అహుజా, రామ్ కపూర్, శివాంగి జోషి, ఆకాంక్ష చౌదరి, యోగేష్ రావత్, రియాజ్ అలీ, ధీరజ్ ధూపర్, ఆకాంక్ష చమోలా, శ్రేష్ఠ అయ్యర్, సూఫీ మోతీవాలా వంటి ప్రముఖులు కంటెస్టెంట్లుగా సందడి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ 'లాక్ అప్' హౌస్‌లో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


