గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతితో చింతామణిని చూసిన మీనా- ఇద్దరికి ఇచ్చిపడేసిన పూలగంప-అత్తపై శ్రుతి రివేంజ్

Gunde Ninda Gudi Gantalu Serial July 3rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 3వ ఎపిసోడ్‌లో ప్రభావతి డైట్ కోసం డైటిషియన్‌ను తీసుకొస్తాడు మనోజ్. ప్రభావతితో చింతామణిని చూసిన మీనా మాస్ వార్నింగ్ ఇస్తుంది. అత్త మీద కోపంతో డైట్ ఫుడ్‌లో ఆముదం కలుపుతుంది శ్రుతి. బాలుపై కోపంతో ఊగిపోతాడు అరుణ్.

Published on: Jul 3, 2026, 07:53:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్, కల్పనకు మధ్య ఇంకా సంబంధం అలాగే ఉందని, రోహిణికి మనోజ్ అన్యాయం చేస్తున్నాడని, చింటు మనోజ్ కల్పనల కొడుకే అని మీనా అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 3 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 3 ఎపిసోడ్

డైటిషియన్ సున్నిత

దీంట్లో మనకు ఎలాంటి ఆధారాలు తెలియవు. నువ్వు ఎవరితో అనకు అని బాలు అంటాడు. మీ అన్నయ్య చేస్తుంది మాత్రం చాలా పెద్ద తప్పు. కొడుకును ఎక్కడో ఉంచి పెంచుతున్నాడు అని మీనా అంటుంది. మరుసటి రోజు ఉదయం డైటిషియన్ సున్నితను తీసుకొస్తాడు మనోజ్. రాగానే ప్రభావతి కాఫీ కప్పు లాగేస్తుంది సున్నిత.

పేరు గురించి అడిగితే.. నా పేరు సునీత. అందరికి డైట్ గురించి సున్నితంగా చెబుతాను కాబట్టి సున్నిత అంటారని ఆమె చెబుతుంది. వెయిట్ తగ్గాలంటే టీలు, కాఫీలు, షుగర్ తగ్గించాలని, నా దగ్గర ఏం దాచకుండా ఏం చెప్పాలని సునీత అంటుంది. అయితే, ఇంట్లో జరిగేవి అన్ని చెబుతాడు బాలు. మీనా ఆపి వంటి గురించి అని అంటుంది.

ప్రభావతి తినడం గురించి బాలు చెబుతాడు. నేను డైట్ చేయించి 20 ఏళ్లు చిన్నదానిలా కనిపించేలా చేస్తాను అని సునీత అంటుంది. దాంతో బాలు సెటైర్లు వేస్తాడు. తను ఫేమస్ డైటిషియన్ అని నాకు మంచి టిప్స్ చెప్పిందని మనోజ్ అంటాడు. నాకు గ్రాసరీస్‌తో కలుపుకుని వారానికి రూ. 8 వేలు ఇవ్వాలని సున్నిత చెబుతుంది.

సన్నగా మారిన ప్రభావతి

మిమ్మల్ని తీసుకొచ్చిన టిప్పుల మనోజ్ ఇస్తాడని బాలు అంటాడు. ప్రభావతిని ఫొటో తీసుకుంటుంది సునీత. ఆ ఫొటోలో చాలా సన్నగా ఉండటం చూసి ఇది నేనేనా అని షాక్ అవుతుంది ప్రభావతి. నా ఫీజ్ ఇస్తే వెళ్లిపోతాను. గ్రాసరీస్, డైట్ షీట్ అందులో ఉందని సునీత చెబుతుంది. మేము కూడా ఇవి వాడొచ్చా అని మనోజ్ అంటే వాడొచ్చని చెబుతుంది సునీత.

మీ సైడ్ నుంచి మీరు చేసి పెడితే వాళ్లకి ఎంతిస్తారని మీనా అడుగితే.. రోజుకు 300 అని సునీత చెప్పి వెళ్లిపోతుంది. డబ్బు గురించి ఎందుకు అడిగావే అని ప్రభావతి అంటే.. మీకంటే చేసి పెడతా.. మిగతావాళ్లకి కొవ్వు కరగడానికి చేయాలంటే మనిషికి 300 వసూలు చేస్తా. ఇస్తేనే చేస్తా. లేదంటే లేదు అని మీనా అంటుంది. ఆహా ఎంత కమర్షియల్ అయ్యావ్ మీనా శ్రుతి అంటుంది.

మనవాళ్లకి డిస్కౌంట్‌తో 500 తీసుకో అని బాలు అంటాడు. త్వరలోనే నేను మారిపోతానన్నమాట అని ప్రభావతి మురిసిపోతుంది. మరోవైపు డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ తన చిరిగిన షర్ట్ చూసి కోపంతో ఊగిపోతాడు. మర్చిపోనురా బాలు. ఇది గుర్తు పెట్టుకుంటాను అనుకుంటాడు అరుణ్. ఇంతలో సుమతీ వచ్చి శ్రావణ శుక్రవారం అని చెప్పి పూలు ఇస్తుంది.

బాలుపై కోపంతో అరుణ్

అరుణ్ డబ్బులుస్తాడు. తర్వాత బాలు గురించి చెబుతాడు అరుణ్. ఓ రౌడీ వెధవ మావాడితో ప్రతిరోజు గొడవ పడుతున్నాడని, షర్ట్ పట్టుకున్నాడని అరుణ్ తల్లి చెబుతుంది. వాన్ని విడిచిపెట్టను అని అరుణ్ అంటాడు. నీ డ్యూటీ చూసుకో అని తల్లి, సుమతి అంటారు. సుమతి వెళ్లిపోతుంది.

మరోవైపు చింతామణి, స్టూడెంట్స్ అందరూ డ్యాన్స్ చేస్తారు. చింతామణి డ్యాన్సుకు కామాక్షి వంకలు పెడుతుంది. నేను చెబుతాను అని ప్రభావతి అంటే.. నా డ్యాన్సుకే వంకలు పెడతారా అని కోప్పడుతుంది. మరి మీరు చేయండి. ఒక గురువును నమ్మినప్పుడు చెప్పింది చేయాలని ప్రభావతి రివర్స్ అవుతుంది. తర్వాత ప్రభావతి డైట్, మీనా చేస్తానని చెప్పడం గురించి ప్రభావతి చెబుతుంది.

మీనాపై ప్రభావతికి ఉన్న కోపం గురించి కామాక్షి చెబుతుంది. అయితే మీనా జీవితంపై దెబ్బ కొడతాను అని చింతామణి అనుకుంటుంది. ఏడ్చావులే. అది నీ తరం కాదు అని ఫోన్‌లో కామాక్షి చీటి డబ్బుల గురించి అంటుంది. మరోవైపు మీనా క్యారియర్ తీసుకొస్తుంది. ప్రభావతితో చింతామణిని మీనా చూసి షాక్ అవుతుంది. డేకరేషన్‌కు వెళ్లకుండా చేసింది చింతామణితో చెప్పడం వింటుంది మీనా.

అత్త, చింతామణికి ఇచ్చిపడేసిన మీనా

కామాక్షి వచ్చి రా మీనా అంటుంది. మీనాను చూసి చింతామణి కంగారుపడుతుంది. చింతామణి గురించి కామాక్షి చెబితే తెలుసు అని మీనా అంటుంది. నా శిష్యురాలి గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదని చింతామణి అంటుంది. హో గురుశిష్యుల సంబంధమా. ఇక్కడ ఎవరికి ఎవరు ఏం నేర్పిస్తున్నారు. పిన్నీ నువ్వు జాగ్రత్త. చెదలు పుట్టలుపెట్టిపోతే పాములు వచ్చి ఉంటాయట అని మీనా అంటుంది.

ఎవరిని పాములు అంటుంది అని చింతామణి అంటే.. మీ ఇద్దరిని అంటున్నాను. అయినా పాములను పూజిస్తాం మనం. వాటితో మిమ్మల్ని పూజించడం ఏంటీ. వానపాములు అంటే సరిపోతుందేమో అని మీనా అంటుంది. నటరాజ నిలయంలోకి ఆడగాడిదలు, అడ్డ గాడిదలు వస్తున్నాయి. వాటికి నాట్యం నేర్పించాలనుకుంటే ఏదో ఒకరోజు కాలితో తన్నిపోతాయని మీనా అంటుంది.

ఎంత పొగరు అని చింతామణి అంటుంది. కష్టాన్ని నమ్ముకున్నాదాన్ని. నీలా అడ్డదారులు తొక్కేదాన్ని కాదు. అందుకే పొగరు ఎక్కువే ఉంటుంది. మా అత్తకు ఏ రోగమొచ్చిన, ఏ చేయి పడిపోయిన, నువ్వు ఏ నొప్పి తెచ్చిపెట్టినా. నా భర్త నాకు తోడుగా ఉన్నంతవరకు నేను నా రంగంలో దూసుకుపోతూనే ఉంటాను అని మీనా ఇచ్చి పడేస్తుంది.

ఆవిడను పరిగెత్తిస్తాను

ఆవిడ నా అత్తగారు. నా భర్తను ఇచ్చిన ఆవిడ. అందుకే అణగిమనిగి ఉంటాను లేకుంటే నిన్ను పరిగెత్తించినట్లే ఆవిడను పరిగెత్తిస్తాను అని మీనా అంటుంది. ఇద్దరు షాక్ అవుతారు. ఈవిడ నాట్యం మీద ఇష్టంతో రాలేదు. మిమ్మల్ని అడ్డుపెట్టుకుని నన్ను దిగజార్చాలని చూస్తుంది. అదే మీకు కావాల్సింది అయితే సావాసం చేయండి. నా ఇంట్లోనే నాకు శత్రువు ఉంటే నేను మరింత జాగ్రత్తగా ఉంటానని మీనా అంటుంది.

క్యారియర్ పక్కన పెట్టి నేను వండింది తినండి. ఆవిడ పెట్టేది తినకండి. ఆవిడ పెట్టేది మనుషులు తినేది కాదు అని మీనా అంటుంది. వెళ్తూ ఆగి నాట్యం నేర్చుకోండి. నేను డెకరేషన్‌లో మిమ్మల్ని పక్కరాష్ట్రాలకు పరిగెత్తిస్తే నాట్యం చెబుతూ బతికేయొచ్చు అని లాస్ట్ పంచ్‌తో అదిరిపోయే డైలాగ్ చెప్పి వెళ్తుంది మీనా. దాంతో కామాక్షి చప్పట్లు కొడుతుంది. మీ ఇద్దరికి ముందుందు ముసళ్లపండగ అని కామాక్షి అంటుంది.

మరోవైపు మీనా జరిగింది ఆలోచిస్తూ ఉంటుంది. శ్రుతి వచ్చి అడుగుతుంది. ప్రభావతి, చింతామణి గురించి చెబుతుంది మీనా. ఏదో ఒకటి చేసి ఆవిడకు బుద్ధి వచ్చేలా చేయాలని శ్రుతి అంటుంది. తనే ఏదో రోజు తెలుసుకుంటుంది. ఇది ఆయనతో చెబితే గొడవ పడతారు. అందుకే చెప్పలేదు. నువ్వు కూడా చెప్పకని మీనా అంటుంది.

అత్తకు బుద్ధి చెబుతాను

నేను అంతగా వదిలేసే రకం కాదు. ఆంటీ చేసినదానికి సరైనా బుద్ది చెప్పకుండా వదలను అని శ్రుతి అనుకుంటుంది. మరోవైపు మీనాకు కూడా తెలియకుండా చిట్టీ కడుతున్నట్లు రాజేష్‌కు చెబుతాడు. ఇంట్లో ఏ అవసరం ఉన్నా ఆ డబ్బు తీసి ఖర్చు పెడుతుంది. తన మనసు అలాంటిది అందుకే చెప్పలేదని, తనకు తాళి చేపిద్దామనుకున్న ప్రతిసారి ఖర్చు అయిపోతుందని బాలు అంటాడు.

ఈసారి ఎలాగైనా, ఏం జరిగిన తాళి చేయించాలని బాలు అంటాడు. ఇప్పటికే లక్ష 20 వేలు కట్టాను. ఇంకొంత కడితే సరిపోతుంది. ఈసారి ఆ డబ్బు ముట్టుకోను అని బాలు అని వెళ్లిపోతాడు. మరోవైపు నా డైట్ ఫుడ్ ఏదని ప్రభావతి అడిగితే.. 500 ఏవి అని మీనా అంటుంది. నా దగ్గర కూడా తీసుకుంటావా అని అత్త అంటే.. అతనివి ఎవరిస్తారు అని మీనా అంటుంది.

3 వందలేగా అని మనోజ్ అంటే.. మీనా వెయ్యి, 1500 ఇలా పెంచుకుంటూ పోతుంది. అప్పుడే శ్రుతి వస్తుంది. వేలంపాటలా పెంచుకుంటూ పోతున్నావేంటని ప్రభావతి అంటుంది. కిచెన్‌లోకి వెళ్లిన శ్రుతి ప్రభావతి డైట్ పుడ్‌లో ఆముదం కలుపుతుంది. తర్వాత మనోజ్ 500 ఇస్తాడు. అవి తీసుకుని కిచెన్‌లోకి వెళ్తుంది మీనా. డైట్ ఫుడ్ తీసుకుని వచ్చి ప్రభావతి, మనోజ్‌కు పెడుతుంది.

డైట్ ఫుడ్‌లో ఆముదం

వడ్డించమని ప్రభావతి అంటే.. వెయ్యి అడుగుతుంది. దాంతో మేమే వడ్డించుకుంటామని వడ్డించుకుంటారు తల్లీకొడుకులు. ఇంతలో పిజ్జా తీసుకొస్తాడు రవి. టేస్ట్ ఏంటీ అదోలా ఉందని మనోజ్ అంటే.. 8 వేలు పెట్టి డైట్ చేయించుకుంటున్నాం. ఇలాగే ఉంటుందని ప్రభావతి అంటుంది.

ఇద్దరు తింటారు. రాత్రిపూట మనోజ్ కడుపులో నుంచి సౌండ్స్ వస్తాయి. దాంతో రోహిణి లేస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More