గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు సారీ చెప్పిన ప్రభావతి- మీనాకు మరదలి దెయ్యం- నిప్పులు ఆర్డర్ పెట్టిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial June 22nd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 22వ ఎపిసోడ్ అదిరిపోయింది. మీనాకు ప్రభావతి సారీ చెబుతుంది. సత్యం అపార్థం చేసుకుంటాడు. మనోజ్‌పై కుక్కలు దాడి చేస్తాయి. సుందరి వచ్చి బావ అంటూ గోల చేస్తుంది. మీనా అసూయ పడుతుంది. బాలు నిప్పులు ఆర్డర్ పెడతాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి పాపం తగులుతుందంటే.. తల్లిగా ఏం చేయనిది గుర్తు చేసి తగలవని బాలు అంటాడు. సత్యం వెళ్లిపోతాడు. మీనా భోజనం తీసుకెళ్లి ఇస్తుంది.

భార్య ఆకలి చూసుకోవాలిగా
భార్య ఎలాంటిది అయినా పస్తులు ఉంటే ఎలాగమ్మా తినేది. తన ఆకలి సంగతి నేనే కదా చూసుకోవాల్సింది అని సత్యం దిగాలుగా అంటాడు. ఇంతేనా మావయ్య మమ్మల్ని అర్థం చేసుకుంది. నేను ఏ పని చేయట్లేదని అన్న అత్తయ్య నోటితోనే ఆ మాట తప్పు అనిపించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. వేసిన శిక్ష ఇది. అదంతా తల్లికొడుకుల పంతం అని మీనా అంటుంది.
నేను ఈ ఇంటి కోడలిని నా బాధ్యత నేను ఎప్పటికీ మర్చిపోను. ఎలాంటి సంకోచం లేకుండా తిని ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకోండి అని మీనా అంటుంది. నేను ఎంత తప్పుగా ఆలోచించాను. క్షణం పాటు నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను అని సత్యం ఫీల్ అవుతాడు. మీనా భోజనం ఇవ్వడంతో తీసుకుని తింటాడు సత్యం. ప్రభావతి బ్యాచ్ ఆకలితో అలమటిస్తుంటే బాలు పాటలు పాడతాడు.
ఇక నీళ్లతో ఆకలి చల్లారేలా లేదని రోహిణి అంటుంది. దేవుడు వేసిన ఆకలి శిక్ష ఇది అని బాలు అంటాడు. రోహిణియే తట్టుకోవట్లేదు పాపం ఆ ముసలమ్మా ఏం తట్టుకుంటుంది అని శ్రుతి అంటుంది. ముసలమ్మా ఎవరని ప్రభావతి అంటే.. మీరే అని శ్రుతి అంటుంది. ఇంతలో మనోజ్ చిరిగిన బట్టలు, ఒంటినిండా దెబ్బలు, గాయాలతో వచ్చి అమ్మా అని పిలుస్తాడు.
కుక్కలు బట్టలు చింపినోడా
మనకే దిక్కులేదనుకుంటే వీడెవడు. వీడెవడ్రా మరి ఇంత నికృష్టుడిలా ఉన్నాడని ప్రభావతి తిడుతుంది. లోపలికి కోపంగా మనోజ్ వచ్చి నేను అని అంటాడు. మనోజ్‌ను చూసి అంతా షాక్ అయిపోతారు. బిజినెస్ మ్యాన్‌లా వెళ్లి బెగ్గర్‌లా వచ్చావేంట్రా. నీమీద సాముహికంగా అని బాలు అంటుంటే.. మనోజ్ ఆపి కుక్కలు దాడి చేశాయని అంటాడు.
దాంతో మీనా, శ్రుతి, రవి, బాలు నవ్వుతారు. పైకి మాత్రం అయ్యయ్యో అంటారు. బిర్యానీ వాసనకు వీధి కుక్కలు నా మీద ఎగబడ్డాయి, రక్కాయని మనోజ్ అంటాడు. దాంతో బాలు వచ్చి చెప్పుతో దెబ్బ కొడతాడు. ఏంట్రా ఇది అని మనోజ్ అంటే.. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అని బాలు అంటాడు. రక్కాయి అన్నా కరవలేదు అని మనోజ్ అంటాడు.
కుక్కలు బట్టలు చింపినోడా.. రేయ్ కొత్త తిట్టు దొరికిందిరా అని బాలు అంటాడు. సూపర్ అన్నయ్య అన్నిటికంటే ఇదే హైలెట్ అవుతుందని రవి అంటాడు. ఇంతలో సత్యం వచ్చి ఏంట్రా ఈ అడుక్కుతునే అవతారం అని సత్యం అంటాడు. జరిగింది చెబుతాడు. బిర్యానీ వదిలేస్తే కవర్ చింపేవి నిన్ను కాదని మీనా, శ్రుతి అంటారు.
మీనాకు ప్రభావతి సారీ
మీనా పనిచేయట్లేదని అనవసరంగా వాగావు. అది తప్పు అని ఒప్పుకో అని సత్యం అంటాడు. అంతేకాదు మనోజ్, ప్రభావతి, రోహిణి సారీ చెప్పాలని బాలు డిమాండ్ చేస్తాడు. ఎన్ని జన్మలు ఎత్తిన సారీ చెప్పనని ప్రభావతి అంటే.. అయితే వంట చేయదని బాలు అంటాడు. తర్వాత మనోజ్, రోహిణి ఇద్దరు సారీ చెబుతారు. మరి నీ సంగతి అని బాలు అంటాడు.
రేయ్ వదిలేయిరా. ఏంట్రా ఈ పంతం అని ప్రభావతి అంటుంది. ఆయన వదిలేసినా నేను వదలను. నన్ను డెకరేషన్‌కు వెళ్లకుండా చేసినందుకు ఎంత పని చేసినా చేయలేదని అన్నందుకు హర్ట్ అయ్యానని మీనా అంటుంది. ఇక చేసేది లేక మీనా ఇంటి పని వంట పని అన్ని చేస్తుంది. నేనే అనవసరంగా అన్నాను. డెకరేషన్‌కు వెళ్లకుండా ఆపినందుకు అన్నింటికి కలిపి సారీ అని ప్రభావతి చెబుతుంది.
దాన్ని వీడియో తీస్తాడు బాలు. రేయ్ అన్నం ఎలారా అని మనోజ్ అంటాడు. వంటగది మూసివేయబడినది అన్నాం కానీ వంట చేయలేదని అనలేదు. మీరు సరిగా చూడలేదు. అన్ని అక్కడే ఉన్నాయని మీనా అంటుంది. దాంతో కిచెన్‌లోకి మనోజ్ పరుగెత్తుతాడు. ఆ తర్వాత ప్రభావతి, రోహిణి కూడా వెళ్తారు. అక్కడే వంటలు ఉంటాయి. ఆబరాగా ముగ్గురు తింటారు.
సుందరి సందడి, సెటైర్లు
మీనాకు సారీ చెప్పిన ప్రభావతి, హెడ్‌లైన్ ఎలా ఉందని బాలు అంటాడు. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో సారీ అని చెప్పిన క్లిప్ పెడతాడు బాలు. మరుసటి రోజు ఉదయం ఇది వంట చేస్తుందా లేదా. అనవసరంగా సారీ చెప్పానా అని అనుమానంగా చూస్తుంది. మీనా వంట చేస్తుంటుంది. సత్యం వచ్చి ఏంటీ సౌండ్ లేదు. రోజు మౌనవ్రతం పాటించడానికి నెలకు ఎంత తీసుకుంటావని సత్యం అడుగుతాడు.
హా మీ పెన్షన్ అంతా తీసుకుంటానని ప్రభావతి అంటుంది. ఇంతలో బావ అంటూ సుందరి వస్తుంది. మనోజ్ ముక్కు చూసి గుర్తుపట్టానని, రవిని పొట్టి బుడంకాయ్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌లా అయ్యావేంట్రా అంటుంది సుందరి. నువ్వేనా మా బాలు బావను చేసుకుంది. పర్లేదు బాగున్నావ్. నువ్వు చాలా లక్కీ అని సుందరి అంటుంది.
నువ్వేవరు అని మీనా అంటే.. బాలు బావను పెళ్లి చేసుకునేందుకు మిస్ అయినదాన్నని అంటుంది. రంగారావు తమ్ముడు కూతురు అని సత్యం చెబుతాడు. సుందరి వాగుతూనే ఉంటుంది. ముగ్గురికి ముగ్గురు పెళ్లిల్లు చేసుకున్నారు. ఒక్కరు కూడా పిలవలేదేంటని అడుగుతుంది. అందరిపై సెటైర్లు వేసి బాలు బావ అంటూ గట్టిగా పిలుస్తుంది సుందరి.
మీనా అసూయ
బాలు సుందూ.. వచ్చావా సుందూ అంటూ రొమాంటిక్‌గా వస్తాడు. మీనా ఉడుక్కుంటుంది. కావాలని మరింత ఓవర్ చేస్తాడు బాలు. సుందరితో మరింత చనువుగా ఉంటాడు బాలు. ఇప్పుడెందుకు ఇదీ ఊడిపడిందని మీనా అంటుంది. పెళ్లి చేయాలి కదా అని సత్యం అంటాడు. సరే నన్నుఇంటర్వ్యూకి తీసుకెళ్లవా అని సుందరి అంటే.. బాలు తీసుకెళ్తాడు.
మీనా కంగారుపడుతుంది. భయపడుతుంది. అది చూసి అంతా నవ్వుకుంటారు. కారులో మీనా అసూయ గురించి చెబుతూ కావాలనే ఉడికించానని చెబుతుంది సుందరి. మీనా మనసు స్వచ్ఛంగా ఉంటుందని గొప్పగా చెబుతాడు బాలు. ఇంటర్వ్యూ అయిపోయేదాకా ఉంటాను అని బాలు అంటాడు. సుందరి ఎంత చెప్పిన బాలు వినడు.
సరేనని లోపలికి వెళ్తుంది సుందరి. సుందరి లవర్ వచ్చి ఇక్కడికెందుకు వచ్చావని అడుగుతాడు. వెంటనే పెళ్లి చేసుకుంటావా లేదా. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని సుందరి అంటుంది. నాకు మా మావయ్యే అన్ని మటన్ కొట్టు మాణిక్యం. ఆయనే సంబంధాలు చూస్తున్నారని పెద్ద ట్విస్ట్ ఇస్తాడు సుందరి లవర్. అప్పుడే అక్కడికి మాణిక్యం బైక్ మీద వస్తాడు.
సుందరి లవర్ మేనమామే మేక మామ
కారులో బాలు ఉంటాడు. కారు పక్కనే బైక్ పార్క్ చేసి సుందరి లవర్ కిశోర్‌కు మేక మామ మాణిక్యం కాల్ చేసి మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. మీ అత్తయ్య నీకోసం చింతచిగురు మటన్ వండింది వచ్చి తీసుకో అని చెబుతాడు. కిశోర్ సరేనంటాడు. ఇద్దరు విడిగా బయటకు వస్తారు. మటన్ కొట్టు మాణిక్యంను చూస్తుంది సుందరి. కారులో సుందరి కూర్చుని ఇంటర్వ్యూ పోస్‌పోన్ చేశారని చెబుతుంది.
ఇంతలో కిశోర్‌ను బాలు చూసి వీడేంటి ఇక్కడ ఉన్నాడని అడుగుతాడు బాలు. మీ హాస్టల్ దగ్గర వీడిని చూశాను, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా. నీకోసం వచ్చాడేమో అని డౌట్ వచ్చి అడిగానంటాడు బాలు. అమ్మో బాలు బావ మాములోడు కాదని మనసులో అనుకుని యాధృచ్చికంగా జరిగి ఉంటుందేమో అని సుందరి అంటుంది. కిశోర్ పెళ్లి గురించి మాణిక్యం మాట్లాడుతాడు.
మాణిక్యంను చూడకుండానే బాలు వెళ్లిపోతాడు. బాలును బావ అంటూ అచ్చం సుందరిలాగే ప్రవర్తిస్తుంది మీనా. అయ్యో మీనాకు మరదలి దెయ్యం పట్టిందని బాలు అంటుంది. మరదలు దెయ్య ఎందుకు అవుతుంది. ఊహ సుందరి అవుతుంది. తనతో ఎంతెంత దగ్గరిగా ఆడావు బావ. నీ పని బాగుంది బావ ఇంట్లో ఇల్లాలు కారులో ప్రియురాలు అని మీనా అంటుంది.
డ్రైవర్ మొగుడా
మీనా నీకు బాగా మండినట్లు తెలుస్తుంది. నా హృదయం ఎంత స్వచ్ఛమైనదో తెలుసుగా అని బాలు అంటుంది. మీనా బావ అంటూ తెగ సెటైర్లు వేస్తుంది. పెళ్లాం ఎక్కడైనా బావ అని పిలుస్తుందా అని బాలు అంటే.. మొగుడా.. మొండి మొగుడా.. బండ మొగుడా, ఆకతాయి మొగుడా, మీనమ్మ మొగుడా, డ్రైవర్ మొగుడా అని అంటుంది మీనా.
బాలును బావ అంటూ తెగ ఆడుకుంటుంది మీనా. ఒక్కసారిగా మీనాను హగ్ చేసుకుంటాడు బాలు. తర్వాత ఏడిపించడం ఆపిన మీనా డెకరెషన్ డబ్బులు హుండీలో వేశారా అని అడుగుతుంది. ఏదో దాంట్లో వేశానని బాలు చెబుతాడు. మరుసటి రోజు బాలు అటు ఇటు తిరుగుతుంటాడు. ఎవరికోసమో ఎదురుచూస్తుంటాడు. మనోజ్ వచ్చి అడిగితే.. బాలు గిచ్చుతాడు.
సత్యం, ప్రభావతికి కాఫీ ఇస్తుంది మీనా. మనోజ్‌కి ఇవ్వాలని తెలియదా అని ప్రభావతి అంటే.. మీరు ఇప్పుడే మలేషియా నుంచి వచ్చారా, రోహిణి వెళ్లిపోయిందా. తన భార్య లేదా. నేను పెట్టిస్తాను. వచ్చి ఇవ్వమనండి అని మీనా అంటుంది. దాంతో రోహిణిని ప్రభావతి పిలుస్తుంది. పొద్దున్నే నీ మొడుగికి టీ ఇవ్వాలని తెలియదా అని ప్రభావతి అంటుంది.
నిప్పులు ఆర్డర్ పెట్టిన బాలు
మీనా ఇవ్వొచ్చుగా. అప్పుడే అంత లెవెల్ పెరిగిపోయిందా అని రోహిణి అంటే.. మనోజ్‌ను బాలు గిచ్చుతాడు. నీ భార్యను కంట్రోల్‌లో పెట్టుకోమంటాడు బాలు. ఎందుకురా అటు ఇటు తిరుగుతున్నావని సత్యం అడుగుతాడు. 3 ప్లేట్ల నిప్పులు ఆర్డర్ పెట్టాను నాన్న. ఈ ముగ్గురు కళ్లలో నిప్పులు పోసుకునే టైమ్ వచ్చింది. వాళ్లకెందుకు శ్రమ అని నేనే తెప్పిస్తున్నా అని బాలు అంటాడు.
వాడేదే వాగుతున్నాడని అన్న ప్రభావతి మీనాను టీ పెట్టమంటుంది. పెట్టనుగా. నాకు లెవెల్ పెరిగిపోయిందని అందిగా. తను ఆడది కాదా, మొగుడికి టీ పెట్టదా అని మీనా అంటుంది. ఇంతలో శ్రుతి వచ్చి టీ ఇస్తావా. బిజీగా ఉన్నావా అని అంటుంది. సంస్కారం అంటే ఇది అని సత్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


