గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: విగ్గుతో రోహిణి వీడియో కాల్- విద్య డబ్బింగ్- మనోజ్, కల్పన కొడుకే చింటు అన్న మీనా
Gunde Ninda Gudi Gantalu Serial July 2nd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 2వ ఎపిసోడ్‌లో చింటును మనోజ్ కారులో డ్రాప్ చేయడం బాలు, మీనా చూస్తారు. సుగుణతో చింటు తల్లి గురించి మాట్లాడితే తప్పించుకుంటుంది. విగ్గు, స్పెక్ట్స్, మాస్కుతో చింటు పేరెంట్స్ మీటింగ్‌కు హాజరవుతుంది రోహిణి.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చింటు, సుగుణను స్కూల్‌కి మనోజ్ తన కారులో తీసుకెళ్తాడు. స్కూల్‌లో సత్యంతో బాలు, మీనా మాట్లాడుతారు. ఇవాళ పిల్లలు ఎందులో చేరాలో తల్లిదండ్రులతో మాట్లాడుతారు. అందులో హెల్ప్ చేయమని అడిగారని సత్యం చెబుతాడు.

మీ పనులెందుకు ఆపుకుంటారు
మేము గుడికి వెళ్లి ఇటే వస్తాం. కలిసి వెళ్దామని బాలు, మీనా అంటారు. నాకోసం మీ పనులెందుకు ఆపుకుంటారు. నేను వస్తానని సత్యం అంటాడు. మనోజ్ కారులో చింటు, సుగుణ రావడం బాలు, మీనా చూస్తారు. బాలు, మీనాలను చూసిన చింటు పరుగెత్తుకుంటూ వెళ్లి పలకరిస్తాడు. సుగుణతో దత్తత ఇష్టం లేక మాతో మాట్లాడట్లేదని అర్థమైందని మీనా అంటుంది.
తర్వాత మనోజ్ కారులో రావడం గురించి అడిగితే.. జరిగింది చెబుతుంది సుగుణ. ఇవాళ పేరెంట్స్ మీటింగ్ కదా చింటు వాళ్ల అమ్మ రాలేదా అని బాలు అడుగుతాడు. చింటును క్లాస్‌కి వెళ్లమంటుంది సుగుణ. చింటు తల్లి విదేశాల్లోనే ఉందని, చింటును స్కూల్‌లో చేర్పించి వెళ్లిపోయిందని, ఇవాళ వీడియో కాల్ ద్వారా మీటింగ్‌కి హాజరవుతుందని సుగుణ చెబుతుంది.
తర్వాత టీచర్స్ త్వరగా రమ్మన్నారని చెప్పి వెళ్లిపోతుంది సుగుణ. ఏదో తప్పించుకునేందుకు చూస్తున్నారని మీనా అంటుంది. వీళ్లు ప్రతిసారి ఏదోటి చెబుతున్నారు. మనోజ్ గాడు డ్రాప్ చేశాడు. వీళ్లకు మనోజ్ గాడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నా అని బాలు అంటాడు. తర్వాత బాలు, మీనా గుడికి వెళ్తారు.
విగ్గు ఉంటే గుర్తుపడతారు
మరోవైపు రోహిణి హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తుంది. విద్య వచ్చి అడిగితే.. స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ ఉందని, మావయ్య సత్యం అక్కడే ఉంటారని చెప్పి ఇలా ఉంటే గుర్తు పడతారా అని అడుగుతుంది రోహిణి. విగ్గు ఒక్కటే ఉంటే గుర్తు పడతారని విద్య అంటుంది. దాంతో బ్లాక్ స్పెక్ట్స్ కూడా పెట్టుకుంటుంది రోహిణి. తర్వాత మాస్క్ కూడా పెట్టుకుంటుంది రోహిణి.
గొంతు గుర్తుపడతారుగా అని విద్య అంటే.. దానికి నువ్వున్నావుగా. నేను అది ఇది ఆడిస్తాను. నువ్వు మాట్లాడాలని రోహిణి అంటుంది. అంటే నీకు నేను డబ్బింగ్ చెప్పాలా నా వల్ల కాదని విద్య అంటుంది. రోహిణి బతిమిలాడుతుంది. విద్య ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తుంది రోహిణి. దాంతో విద్య సరేనంటుంది. మరోవైపు పిల్లల డీటేల్స్ తీసుకుంటాడు సత్యం.
సుగుణ వస్తుంది. మీరేం టెన్షన్ పడకండని, కూర్చోమంటాడు సత్యం. తర్వాత టీచర్ వచ్చి చింటు తల్లి కాసేపట్లో వీడియో కాల్‌లో కనెక్ట్ అవుతుందని చెబుతుంది. రోహిణి వీడియో కాల్ చేస్తుంది. విగ్గు, స్పెక్ట్స్, మాస్క్‌తో వీడియో కాల్‌లో రోహిణి ఉంటుంది. సత్యం చూస్తాడు. ఈరోజు అమ్మ అమ్మలా లేదేంటి అని చింటు అంటాడు. ఏం మాట్లడకని సుగుణ అంటుంది.
కంపెనీలో స్ట్రిక్ట్ రూల్స్
వీడియో కాల్‌లో కూడా మాస్క్ ఎందుకని టీచర్ అడిగితే.. మా కంపెనీలో స్ట్రిక్ట్ రూల్స్. జాబ్ మధ్యలో ఉన్నానని విద్య వాయిస్ ఇస్తుంది. చింటుకు మంచి మార్క్స్ వస్తున్నాయని, స్పోర్ట్స్‌లో చేర్పిస్తే మరింత బాగుంటుందని టీచర్ అంటే.. సరేనంటుంది విద్య. ఇంతలో దగ్గుతుంది విద్య. ఏమైందని టీచర్ అడుగుతుంది. అలా దగ్గు వచ్చిందని చెబుతుంది రోహిణి.
ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్‌కి రండి. నేరుగా అయితే మరిన్ని విషయాలు మాట్లాడొచ్చని టీచర్ అంటుంది. ఇంతలో విద్య తుమ్ముతుంది. కాసేపటికి తుమ్మినట్లు రోహిణి నటిస్తుంది. దానికి విద్య తెగ నవ్వుతుంది. మేడమ్ మీ హెల్త్ బాలేనట్టుంది. నెక్ట్స్ టైమ్ మరింత మాట్లాడుకుందామని టీచర్ అంటుంది. సరేనని విద్య అంటుంది.
తర్వాత తెగ నవ్వుతుంది విద్య. నీ యాక్టింగ్ బాగుందే అని విద్య అంటే.. నీ డబ్బింగ్ వల్ల గండం గట్టెక్కిందని రోహిణి అంటుంది. ఇద్దరు నవ్వుకుంటారు. గుడికి వెళ్లి మళ్లీ స్కూల్‌కు వస్తారు బాలు, మీనా. చింటు వాళ్లు వెళ్లిపోతుంటారు. చింటు పలకరిస్తాడు. మీ అమ్మ వీడియో కాల్ చేసిందా అని బాలు అడిగితే.. చేసింది. కానీ, మా అమ్మలా అనిపించలేదు. జుట్టు కట్ చేసుకుంది. మాస్క్ పెట్టుకుంటుంది అని చింటు చెబుతాడు.
చింటు తండ్రి మనోజే
వాళ్ల అమ్మకు హెల్త్ సరిగా లేదని, అందుకే మాస్క్ పెట్టుకుందని సుగుణ అంటుంది. కలిసి తిందామని బాలు అడిగితే.. చింటు సరేనంటుంది. సుగుణ మాత్రం వద్దంటుంది. డ్రాప్ చేస్తానని బాలు అంటే.. లేదని, ఆటో ఉందని సుగుణ చెప్పి చింటును బలవంతంగా తీసుకెళ్తుంది. దాంతో బాలు, మీనాలకు డౌట్ వస్తుంది.
చింటు తండ్రి మీ అన్నయ్య మనోజ్ అయి ఉంటాడండి అని మీనా అంటుంది. చింటు తల్లి కల్పన అయి ఉంటుందని మీనా అంటుంది. చింటుకు ఏడేళ్లు. వాళ్లకు పరిచయం అయి రెండేళ్లు అవుతుందని, అలా ఎలా అవుతుందని బాలు అంటాడు. మనకు అబద్ధం చెప్పి ఉంటారని మీనా చెబుతుంది. వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. నిజాలు కనుక్కోవాలని బాలు అంటాడు.
మరోవైపు ఫోన్ చూస్తూ ప్రభావతిని గుద్దుకుని ఎగిరి తిరిగి కుర్చీలో పడుతుంది శ్రుతి. అందరూ వచ్చి అడిగితే.. గుద్దుకుని నాలుగు రౌండ్లు తిరిగి పడ్డానని శ్రుతి అంటుంది. ఫోన్ గురించి మాట్లాడుతూ.. చింటు తల్లి వీడియో కాల్ గురించి చెబుతాడు సత్యం. మాస్క్ వల్ల అస్సలు గుర్తు పట్టలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకుందో అర్థం కాలేదని సత్యం అంటాడు.
ఎధవ సోది ఆపండి..
బాలు, మీనాలు అడిగే ప్రశ్నలకు మనోజ్ సమాధానాలు చెబుతాడు. దాంతో మరింత అనుమానిస్తారు బాలు, మీనా. వాళ్లది దరిద్రపుగొట్టు ఫ్యామిలీ అని ప్రభావతి తిడుతుంది. ఊరుకో అమ్మ మనకేం తెలియకుండా ఇష్టమొచ్చినట్లు ఊహించుకోకూడదు. ఇప్పుడు రోహిణియే చింటు వాళ్ల అమ్మ అనుకో.. అని మనోజ్ అంటాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది.
ఆహా.. అనుకుందాం. మాస్క్ పెట్టుకోకుండా బయటకు రావొద్దనే రూల్ ఉంటే పెట్టుకుంటావ్ కదా అని మనోజ్ అడుగుతాడు. నన్నెందుకు లాగుతున్నావ్ అని రోహిణి అంటుంది. ఇప్పుడు మనోజ్ గాడే తండ్రి అనుకో అని బాలు అంటే.. ఆ ఊహ ఎంత బాగుందని మనోజ్ అంటాడు. కలిసి వచ్చే కాలాని నడిచి వచ్చే కొడుకు అని బాలు అంటే.. ఎహే.. ఎధవ సోది. అందరు వెళ్లండని ప్రభావతి తిడుతుంది.
అంతా వెళ్లిపోతారు. మనోజ్ గాడి మాటలు చూస్తే చింటు తండ్రి వాడే అనిపిస్తుందిగా అని బాలు డౌట్ పడతాడు. రాత్రి మీనాకు బాలు పాలు తీసుకొస్తాడు. మనోజ్, కల్పన గురించి మాట్లాడుతుంది మీనా. నాకు అయితే చింటు తల్లి కల్పన అనిపిస్తుందని, అది బయటకు రాకుండా సుగుణ, మనోజ్, కల్పన దాస్తున్నారు. ఈ విషయం దాచిపెట్టి డబ్బుల విషయం బయటపెట్టారు. అప్పుడు ఏ అనుమానం రాదుగా అని మీనా అంటుంది.
మనోజ్, కల్పనల కొడుకే చింటు
చింటు కచ్చితందా మనోజ్, కల్పనకు పుట్టిన అబ్బాయే. పార్లర్‌లో కూడా పట్టుకుంది ఇది బయటకు రాకుండా ఉండేందుకే. రోహిణి ముందు మనోజ్ నాటకం ఆడి ఉంటాడు. రోహిణికి మీ అన్నయ్య అన్యాయం చేస్తున్నాడు. ఈ విషయం తేల్చాలి అని మీనా అంటుంది. మనకు ఏ ఆధారాలు లేవు. ఓపికగా ఉండాలని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


