గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మనోజ్‌కు జీఎస్టీ గండం- 3 లక్షలకు 3 గంటల గడువు- స్కూల్‌లో బాలు కంటపడిన చింటు, సుగుణ

Gunde Ninda Gudi Gantalu Serial June 23rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 23వ ఎపిసోడ్‌లో మీనాకు కరెంట్ అకౌంట్ ఓపెని చేయించి చెక్ బుక్ వచ్చేలా చేస్తాడు బాలు. మనోజ్‌కు జీఎస్టీ అధికారులు నోటీసులు పంపిస్తారు. వచ్చి షాప్ సీల్ చేస్తామని 3 గంటల్లో 3 లక్షలు కట్టాలని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు.

Published on: Jun 23, 2026, 07:49:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు నిప్పులు ఆర్డర్ పెట్టానని అటు అటు తిరుగుతుంటాడు. ఇంతలో ఒకతను వస్తాడు. మీరు అన్ని కాగితాలు తెచ్చారా. మీరు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టమంటే మా ఆవిడ అక్కడక్కడ పెడుతుందని బాలు అంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 23 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 23 ఎపిసోడ్

ఇల్లు అమ్ముతున్నాను

ఏం చేస్తున్నావురా అని ప్రభావతి అడిగితే ఆ.. ఈ ఇల్లు అమ్ముతున్నాను అని బాలు అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. మీనా పేరు మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు. మీనా ఫ్లవర్స్ అండ్ మర్చంట్స్ పేరుతో కంపెనీ రిజిస్టర్ అయింది. ఆ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక నుంచి మీనా గారు చెక్కులు కూడా ఇవ్వొచ్చు అని అతను అంటాడు.

బిజినెస్‌కు మంచి ఐడియా అది అని శ్రుతి, రవి అంటారు. నాకెందుకండి ఇవ్వన్ని అని మీనా అంటుంది. నువ్వు అంచలంచెలుగా ఎదిగి అందరి కళ్లల్లో నిప్పులు పోయాలని బాలు అంటాడు. బ్యాంక్ అతని చెప్పడంతో మీనా సంతకం పెడుతుంది. చెక్కు ఇస్తాడు. మీనా నువ్వు నిన్న నీకు వచ్చిన డెకరేషన్ డబ్బు లక్ష రూపాయలతోనే ఈ అకౌంట్ ఓపెన్ చేయించాను. ఇప్పుడు ఇందులో నీ సంపాదన లక్ష రూపాయలు ఉన్నాయని బాలు అంటాడు.

మీకు భవిష్యత్తులో బిజినెస్ కోసం లోన్ కావాలంటే ఫ్రీగా ఇప్పస్తానని అతను చెప్పి వెళ్లిపోతాడు. ఇక జీఎస్టీ నెంబర్ కూడా తీసుకోవాలని బాలు అంటాడు. దాంతో మీనా సంతోషంతో ఆనందబాష్పాలు పెట్టుకుంటుంది. ఏంటిది మీనా అని శ్రుతి అంటే.. భార్య ఎదగడానికి భర్త చేసే పని చూసి వస్తున్నాయి ఆ కన్నీళ్లు అని సత్యం అంటాడు.

చెక్కుతో బాలు సెల్ఫీ

మనోజ్ ఎగతాళి చేస్తే చెవి మెళిపెడతాడు బాలు. రవి, శ్రుతి అడగ్గానే రూ. 40 వేలు ఇచ్చారు. మొదటి చెక్కు వాళ్లకే ఇస్తాను అని మీనా అంటుంది. మాకు అవసరం లేదు. ఆ డబ్బు నీ అసరం కోసం వాడుకో, అప్పుగా ఇవ్వలేదని శ్రుతి, రవి అంటారు. మనోజ్, రోహిణి తాము అడిగితే ఇవ్వలేదని అసూయ పడతారు. మీనా అవసరం ఉందంటే వేలు కాదు లక్ష్లలు అయిన ఇస్తాను అని శ్రుతి అంటుంది.

మీనా చెక్ రాస్తుంది. దాంతో బాలు సెల్ఫీ తీసుకుంటాడు. షాప్‌కు మనోజ్, రోహిణి వెళ్తారు. మనోజ్ డల్‌గా ఉంటాడు. మీనా బిజినెస్ గురించి మాట్లాడుతాడు. వాళ్ల పని వాళ్లు చూసుకుంటున్నారు. నువ్వెందుకు కుళ్లుకుంటున్నావ్. ముందు మనది సరైన లెక్క లతో నడవాలి అని రోహిణి అంటుంది. తర్వాత జీఎస్టీ నోటీస్ చూసిన రోహిణి ఇది ఎప్పుడు వచ్చిందని కంగారుగా అడుగుతుంది.

పది రోజులు అవుతుందని మనోజ్ అంటాడు. నాకు ఎందుకు చెప్పలేదు అని రోహిణి అంటే.. 30 లక్షల టెన్షన్‌లో మర్చిపోయాను అని మనోజ్ అంటాడు. ఇది హోమ్ వర్క్ కాదు. లేట్ అయిందని చెప్పడానికి. నోటీస్ వచ్చినరోజే కట్టేయాలి. ఇప్పుడు వాళ్లకు ఇంట్లోకి, షాప్‌కి వస్తే అని రోహిణి అంటుంది. ఇంతలోనే జీఎస్టీ అధికారులు వస్తారు.

3 లక్షలు, 3 గంటల గడువు

లాస్ట్ మంత్ జీఎస్టీ కట్టలేదు. దానికి సంబంధించిన నోటీసు పంపించాం. దానికి సమాధానం రాలేదని వాళ్లు అంటారు. నోటీస్ వస్తే స్పందించాలని తెలియదా. మేము షాప్ సీల్ చేయడానికి వచ్చామని అధికారులు అంటారు. మేము 30 లక్షలు మోసపోయాం. ఆ టెన్షన్‌లో మర్చిపోయామని, గడువు ఇవ్వవమని రోహిణి అంటుంది. సరే ఇప్పుడు 3 లక్షలు చెల్లించమని వాళ్లు అంటారు.

రేపటి వరకు టైమ్ ఇవ్వండని రోహిణి బతిమిలాడుకుంటుంది. 3 గంటల టైమ్ ఇస్తాం. ఆలోపు కట్టకుంటే షాప్‌కు సీల్ వేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు జీఎస్టీ అధికారులు. మనోజ్‌పై ఇప్పుడేం చేద్దాం చెప్పు అని తిడుతుంది రోహిణి. మీ మలేషియా మావయ్యను అడుగు. ఈసారికి కాపాడు అని బతిమిలాడుకుంటాడు మనోజ్.

సరే ట్రై చేస్తాను అని రోహిణి అంటే.. నువ్వే దిక్కు నాకు అని మనోజ్ అంటాడు. ఇక ఏ నోటీసు వచ్చిన ముందుగా నాకు చూపించు అని వెళ్లిపోతుంది రోహిణి. 3 గంటలు, 3 లక్షలు అని భయపడిపోతాడు బాలు. మరోవైపు స్కూల్‌కి సత్యం వెళ్తాడు. బాలు డ్రాప్ చేస్తాడు. లంచ్ బాక్స్ మర్చిపోతే పిలిచి ఇస్తాడు. బుధవారమేగా వచ్చేది. ఇవాళ ఎందుకు వచ్చావని బాలు అంటాడు.

స్కూల్‌లో చింటు సుగుణను చూసిన బాలు

ఇవాళ ఏదో ముఖ్యమైన పోగ్రామ్ ఉందన్నారని సత్యం అంటాడు. తర్వాత సత్యం వెళ్లిపోతాడు. ఇంతలో చింటు, సుగుణ కనిపిస్తారు. ఈ చింటు వెళ్లి మాట్లాడుతాడు. ఈ స్కూల్‌లోనే చేర్పించారా, ఎందుకు దూరంగా ఉంటున్నారు, నా మీద ఏమైనా కోపమా అని బాలు అడుగుతాడు. ఇక్కడే చేర్పించాం. మా పరిస్థితులు బాలేవు అంతే అని సుగుణ చెబుతుంది.

ఇంతలో రోహిణి కాల్ చేస్తుంది. చింటుకు చాక్లెట్స్ ఇప్పిస్తానని తీసుకెళ్తాడు బాలు. చింటు కూడా వెళ్తాడు. పక్కకు వెళ్లి రోహిణితో సుగుణ మాట్లాడి బాలు చూసిన విషయం చెబుతుంది. అతనికేమైనా అనుమానం వచ్చిందా అని రోహిణి అడిగితే..లేదు. ఇంకో ఐదు నిమిషాలు ఉంటే తెలుస్తుందని, బాలుతో చింటు వెళ్లాడు అని చెబుతుంది సుగుణ.

చింటు ఏం చెబుతాడో అని రోహిణి భయపడుతుంది. ఇప్పుడు ఇది ఇంకో సమస్య అని అనుకుంటుంది. సరే ఇంటికెళ్లి నా నగలు తీసుకుని విద్య ఇంటికి రా అని రోహిణి చెబుతుంది. సరేనని సుగుణ అంటుంది. బాలు, చింటు వస్తారు. మిమ్మల్ని మీనా బాగా అడుగుతుంది. మాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు. పరిస్థితులు చెప్పరు. ఈసారి మీనాను తీసుకొస్తాను తప్పించుకోకండి అని బాలు అంటాడు.

మురళి ఫోన్ తీసుకున్న విద్య

సరేనని సుగుణ చింటును తీసుకెళ్తుంది. ఏదో దాస్తున్నారు అని బాలు వెళ్లిపోతాడు. మరోవైపు విద్యను మురళి కలుస్తాడు. బిర్యాని ఇస్తాడు. ఎవరెవరో వచ్చి ఇస్తే తీసుకోను. పదే పదే మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అని విద్య అంటుంది. నాకు మీరంటే చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తే అనిపించినట్లు నాకు ఎవరిని అనిపించట్లేదు. ఒకరోజు నేను కూడా మీకు నచ్చుతాను. ఒక అవకాశం ఇవ్వండి అని మురళి అంటాడు.

అయితే, మీ గురించి తెలుసుకోవాలి. దానికి ఒకరోజు మీ ఫోన్ నా దగ్గర ఉంచుకుంటాను అని విద్య అడగ్గానే వెంటనే మురళి తీసి ఇస్తాడు. విద్య ఆశ్చర్యపోతుంది. తర్వాత ఫోన్ పాస్‌వర్డ్ చెప్పి, బిర్యానీ ఇచ్చి వెళ్లిపోతాడు మురళి. మీనాకు చెబుదామని కాల్ చేసి మీనా ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని, అడిగిన వెంటనే ఇచ్చేశాడు అని, అడిగితే ప్రాణాలు అయిన ఇచ్చేస్తానంటున్నాడు అని విద్య చెబుతుంది.

ఒక్కరోజు కాదు నెలరోజులు అయిన ఉంచుకోమన్నాడు. పరీక్షలు ఇప్పుడే మొదలయ్యాయని విద్య అంటుంది. ఫోన్‌లో చాలా మంది రహస్యాలు ఉంటాయి. అడిగిన వెంటనే ఇచ్చేశాడు అంటే.. అతనికి రహస్యాలు లేవు. లేదా నిన్ను చాలా ఇష్టపడుతున్నాడేమో. ఇప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, కోపం ఎప్పడు వస్తుంది. ఇతరులతో ఎలా మాట్లాడుతాడు వంటివి తెలుసుకోవాలని మీనా చెబుతుంది.

సలహదారుగా మీనా

ఫోన్ తిరిగి ఇచ్చేటప్పుడు నీ నెంబర్ ఇవ్వు. అప్పుడు మాటల్లో నిజం తెలుస్తుంది. నీతోనే అమయాకంగా మాట్లాడుతున్నాడా. నిజంగా మంచోడా అనేది తెలుసుకోవాలని మీనా అంటుంది. సరే నీ సలహా పాటిస్తాను. నువ్వే నా సలహదారువి అని చెప్పి విద్య కాల్ కట్ చేస్తుంది. తర్వాత విద్య ఇంటికి సుగుణ వస్తుంది. స్కూల్ దగ్గర బాలు కనిపించాడని జరిగింది చెబుతుంది.

ఏదోలా మాట్లాడి తప్పించుకున్నాం. పాపం ఆ అబ్బాయి చాలా ఆప్యాయంగా ఉన్నాడు అని అంటుంది సుగుణ. ఇంతలో రోహిణి వచ్చి తీసుకొచ్చావా అని అడుగుతుంది. చింటు కోసం దాచిన నగలు చూపిస్తుంది సుగుణ. దేనికి అని విద్య అడిగితే మనోజ్ చేసింది చెబుతుంది రోహిణి. షో రూమ్ మూస్తానని అన్నారు అని రోహిణి అంటుంది.

నేను తీసుకొచ్చాను కానీ నాకు నచ్చలేదు. చింటు కోసం చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెంగా దాస్తూ వచ్చాను. వాడి భవిష్యత్తు కోసం. ఇప్పుడు బ్యాగ్ తీసుకొస్తుంటే నా చేతులు వణికాయాని సుగుణ అంటుంది. నాకు కూడా బాధే. ఇప్పుడు షో రూమ్ పోతే మళ్లీ నా బతుకు రోడ్డు మీదకు వస్తుంది. ఈ నగలు తాకట్టుపెట్టాలి. నీ అకౌంట్ మీద అని విద్యతో అంటుంది రోహిణి.

రోహిణి నగలు తాకట్టు

బాలు గురించి భయంగా ఉంది. ఇంటికి మీనాను కూడా తీసుకొస్తానని అన్నాడు సుగుణ చెబుతుంది. ముందు షో రూమ్ సంగతి చూద్దాం. ఒక సమస్య అనుకుంటే ఇంకో సమస్య ఎదురవుతుంది అని రోహిణి అంటుంది. టైమ్ లేదని నగలు తాకట్టు పెట్టేందుకు ముగ్గురు వెళ్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More