Satendra Soni: రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామని బెదిరింపులు, నడిరోడ్డుపై భార్యతో కలిసి దర్శకుడి దాడి:యువ నటుడి కన్నీళ్లు

Actor Satendra Soni Attacked By Director: సూపర్ హిట్ సినిమా లాపతా లేడీస్ ఫేమ్ సతేంద్ర సోని మధ్యప్రదేశ్‌లో షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఘోర అవమానాన్ని వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. రెమ్యునరేషన్ అడిగినందుకు సినిమా దర్శకుడు, ఆయన భార్య తనను నడిరోడ్డుపై వెంటాడి కొట్టారని ఆరోపించారు.

Published on: Jun 28, 2026, 16:47:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actor Satendra Soni Attacked By Director: భారతదేశం తరఫున ఆస్కార్ రేసుకు వెళ్లిన ‘లాపతా లేడీస్’ చిత్రంలో నటించిన యువ నటుడు సతేంద్ర సోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామని బెదిరింపులు, నడిరోడ్డుపై భార్యతో కలిసి దర్శకుడి దాడి:యువ నటుడి కన్నీళ్లు
రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామని బెదిరింపులు, నడిరోడ్డుపై భార్యతో కలిసి దర్శకుడి దాడి:యువ నటుడి కన్నీళ్లు

రెమ్యునరేషన్ ఇవ్వకుండా

మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ సతేంజ్ర సోని ఇన్‌స్టాగ్రామ్‌లో కన్నీరు పెట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తనపై నడిరోడ్డుపై భౌతిక దాడికి దిగారని ఆయన ఆరోపించారు. కష్టపడి పని చేసినందుకు రెమ్యునరేషన్ అడిగితే ఇంతలా చిత్రహింసలు పెడతారా అంటూ సతేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామన్నారు!

మధ్యప్రదేశ్‌లోని మైహర్ ప్రాంతంలో ‘పేడ్ పాల్కి’ అనే సినిమా షూటింగ్ కోసం సతేంద్ర సోని వెళ్లారు. ఈ చిత్రానికి ‘అజ్మీర్ 92’ ఫేమ్ పుష్పేంద్ర సింగ్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్‌కు వచ్చే ముందు సతేంద్రకు 50 వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని షూటింగ్ సమయంలో ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.

మొత్తం 10 రోజుల షూటింగ్ షెడ్యూల్‌లో భాగంగా సతేంద్ర 8 రోజుల పాటు నటించారు. అయితే, తన బకాయిల గురించి దర్శకుడిని అడగడంతో వివాదం మొదలైంది. డబ్బులు ఇవ్వకపోగా, వెంటనే సామాన్లు సర్దుకుని 10 నిమిషాల్లో హోటల్ ఖాళీ చేసి వెళ్లాలని, లేదంటే చంపేస్తామని దర్శకుడు పుష్పేంద్ర సింగ్ తీవ్రంగా బెదిరించారు.

నడిరోడ్డుపై వెంటాడి కొట్టారు

ఆ సమయంలో అక్కడే ఉన్న పుష్పేంద్ర భార్య, ఆ సినిమా హీరోయిన్ ప్రగతి చౌహాన్ కూడా సతేంద్రను అసభ్య పదజాలంతో దూషించారు. దర్శకుడి బెదిరింపులకు భయపడిన సతేంద్ర సోని, తోటి నటులు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మతో కలిసి హోటల్ నుంచి బయటకు వచ్చారు.

వారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, దర్శకుడు పుష్పేంద్ర సింగ్, ఆయన భార్య ప్రగతి చౌహాన్ కారులో వారిని వెంటాడారు. నడిరోడ్డుపై సతేంద్రను అడ్డగించి తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. "నన్ను కాపాడేందుకు ముందుకు వచ్చిన సహ నటుడు శ్రీధర్ దూబేపై కూడా వారు దాడి చేశారు" అని సతేంద్ర సోని ఆరోపించారు.

సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని

పేడ్ పాల్కి షూటింగ్ యూనిట్‌లో ఎవరికీ సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదని సతేంద్ర తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలో చిన్న నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సామాజిక దోపిడీకి, అభద్రతాభావానికి ఈ ఘటనే అద్దం పడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముంబై చేరుకున్న నటుడు.. పోలీసులకు కృతజ్ఞతలు

ఈ భయానక సంఘటన నుంచి ఎలాగోలా తప్పించుకున్న సతేంద్ర సోని ప్రస్తుతం ముంబై చేరుకున్నారు. ముంబై రైల్వే స్టేషన్ నుంచి ఆయన మరొక వీడియోను షేర్ చేస్తూ తాము సురక్షితంగా ఉన్నామని ప్రకటించారు. తమకు సకాలంలో సహాయం అందించి ముంబై చేరేలా చూసిన మధ్యప్రదేశ్ పోలీసులకు, ఇతర మిత్రులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వీడియో చూసిన బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు సతేంద్రకు మద్దతుగా నిలుస్తున్నారు. బాధ్యులైన దర్శకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సతేంద్ర సోని బాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో చిన్నవైనా గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించారు.

సతేంద్ర సోని సినీ ప్రస్థానం

ఆయుష్మాన్ ఖురానా ‘డాక్టర్ జి’, వరుణ్ ధావన్ ‘బవాల్’, నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘రాత్ అకేలీ హై’ చిత్రాలతో పాటు ‘హలో బచ్చోన్’ అనే టెలివిజన్ షోలో మెరిశారు. కిరణ్ రావు దర్శకత్వంలో, అమీర్ ఖాన్ నిర్మాణంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.

త్వరలోనే విడుదల కానున్న ఫర్హాన్ అఖ్తర్ నిర్మాణంలోని మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘మీర్జాపూర్: ది మూవీ’లో కూడా సతేంద్ర ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More