Fake Movies: అన్నీ ఫేక్ సినిమాలే.. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.. సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కామెంట్స్

Nawazuddin Siddiqui On Bollywood Films: బాలీవుడ్‌లో వస్తున్న ప్రస్తుత సినిమాలపై సైంధవ్ మూవీ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవాలను వదిలేసి అబద్ధపు కథనాలతో, నకిలీ సినిమాలను రూపొందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ‘తుంబాడ్ 2’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు.

Mar 15, 2026, 21:12:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ విలక్షణ నటుడు, సైంధవ్ మూవీ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి నిక్కచ్చిగా మాట్లాడే తత్వంతో ఇండస్ట్రీలో చర్చకు తెరలేపారు. హిందీ సినిమాల్లో నిజాయితీ తగ్గిపోయిందని, అంతా ‘నకిలీ’ మయం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ చర్చా వేదికపై నవాజుద్దీన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

అన్నీ ఫేక్ సినిమాలే.. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.. సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కామెంట్స్
అన్నీ ఫేక్ సినిమాలే.. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.. సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కామెంట్స్

సమాజాన్ని తప్పుదోవ పట్టించకండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. సమాజాన్ని చైతన్యపరచడంలో సినిమాల పాత్రపై నవాజుద్దీన్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ, కథల్లో నిజాయితీ ఉండటం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు.

తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు

"సమాజాన్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు. నిజం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం వస్తున్న సినిమాల వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, చాలామంది ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు" అని నవాజుద్దీన్ సిద్దిఖీ పేర్కొన్నారు.

అన్నీ ‘ఫేక్’ సినిమాలే!

ప్రస్తుతం నడుస్తున్న కథనాల (Narratives) గురించి ప్రస్తావిస్తూ నవాజుద్దీన్ సిద్ధిఖీ మరింత ఘాటుగా స్పందించారు. "మన దగ్గర అన్నీ అబద్ధపు సినిమాలే తయారవుతున్నాయి. నకిలీ సినిమాలు తీస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోంది, అసలు నిజం ఏంటి అనేది అందరికీ తెలుసు. ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఏ రకమైన కథనాలను ప్రజలపై రుద్దుతున్నారు అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది" అని నవాజుద్దీన్ సిద్ధిఖీ విమర్శించారు.

ఆ రెండు సినిమాలనేనా

నవాజుద్దీన్ ఏ సినిమా పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ‘ది కేరళ స్టోరీ’, ‘ధురంధర్’ వంటి సినిమాలను ఉద్దేశించే ఆయన ఈ ‘ప్రచార చిత్రాల’ (Propaganda films) వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చర్చిస్తున్నారు.

‘తుంబాడ్ 2’లో నవాజ్ మాస్ ఎంట్రీ!

ఇక సినిమాల విషయానికి వస్తే, నవాజుద్దీన్ సిద్ధిఖీ అభిమానులకు ఒక తీపి కబురు చెప్పారు. 2018లో సంచలనం సృష్టించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘తుంబాడ్’ సీక్వెల్‌లో నవాజుద్దీన్ నటించబోతున్నారు. సోహమ్ షా నిర్మిస్తున్న ఈ ‘తుంబాడ్ 2’లో నవాజుద్దీన్ ఒక సంక్లిష్టమైన, కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

టాలీవుడ్ ఎంట్రీ

ఒరిజినల్ సినిమాలోని మేకింగ్ స్టైల్ తనకు ఎంతో ఇష్టమని, ఈ సీక్వెల్‌లో భాగమవ్వడం ఉత్సాహంగా ఉందని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే, విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సైంధవ్ మూవీలో విలన్‌గా నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More