The Kerala Story 2: ది కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్.. సింగిల్ జడ్జి స్టేను కొట్టేసిన కేరళ హైకోర్టు బెంచ్
ది కేరళ స్టోరీ 2 (The Kerala Story 2) మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది కేరళ హైకోర్టు. మూవీ రిలీజ్ పై ఉన్న స్టేను ఎత్తేసింది. సింగిల్ జడ్జి విధించిన స్టేను కోర్టు డివిజన్ బెంచ్ ఎత్తేయడం గమనార్హం. దీంతో సినిమా రిలీజ్ కు లైన్ క్లియరైంది.
వివాదాస్పద మూవీ ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన 15 రోజుల స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ సినిమాకు చట్టపరమైన చిక్కులు తొలగిపోయినట్లే. జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ పి.వి. బాలకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ది కేరళ స్టోరీ 2 వివాదం, నేపథ్యం ఇదీ..
ముందుగా ది కేరళ స్టోరీ 2 సినిమాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ (సింగిల్ బెంచ్).. సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా సెన్సార్ బోర్డు (CBFC) ఛైర్మన్ రెండు వారాల్లోగా ఈ ఫిర్యాదులను పరిశీలించాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నిర్మాత విపుల్ షా వెంటనే డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాడు.
కోర్టులో జరిగిన వాదనలు
ఈ అప్పీల్‌పై గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి 7:30 గంటలకు హైకోర్టు ప్రత్యేకంగా అత్యవసర విచారణ చేపట్టింది. నిర్మాత తరపున సీనియర్ న్యాయవాదులు ఎల్విన్ పీటర్, నీరజ్ కిషన్ కౌల్ తమ వాదనలు వినిపించారు. సమాజంలోని దురాచారాలను ఎత్తిచూపే హక్కు కథకుడికి ఉంటుందని, గతంలో ఇతర మతాల విషయంలోనూ కోర్టులు ఇదే తరహాలో జోక్యం చేసుకోలేదని వారు గుర్తు చేశారు.
మరోవైపు సినిమా విడుదల కాకపోతే తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని విపుల్ షా కోర్టుకు విన్నవించారు. దేశవ్యాప్తంగా 1500 థియేటర్లలో, విదేశాల్లో 300 స్క్రీన్లలో ఫిబ్రవరి 27న సినిమాను ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ సినిమా ఏ రాష్ట్రానికి లేదా ఏ మతానికి వ్యతిరేకం కాదని, కేవలం సామాజిక సమస్యను మాత్రమే ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ సినిమా విడుదలకు అనుమతినిచ్చింది. పూర్తి స్థాయి తీర్పు ప్రతి త్వరలోనే వెలువడనుంది.
ది కేరళ స్టోరీ 2 సినిమా గురించి..
కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ 2’లో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓఝా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమ పేరుతో హిందూ యువతులను ట్రాప్ చేసే అంశాలను ఈ చిత్ర ట్రైలర్‌లో చూపించడంతో ఇది రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎట్టకేలకు న్యాయస్థానం క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


