Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను కిడ్నాప్ చేసిన గుణ.. పరీక్షకు ముందే.. బాలు ప్లాన్ ఫెయిల్.. రోహిణి శాపం
Gunde Ninda Gudi Gantalu Serial August 24th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్ లో శివను గుణ కిడ్నాప్ చేశాడని బాలు, మీనా తెలుసుకుంటారు. అటు బాలు ప్లాన్ ఫెయిలై రోహిణి, మనోజ్ లను ప్రభావతి మళ్లీ విడదీస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో తనను తన భర్త నుంచి మళ్లీ వేరు చేసిన అత్త ప్రభావతిని రోహిణి శపిస్తుంది. వాళ్లను కలపడానికి బాలు వేసిన ప్లాన్ ఫెయిలవుతుంది. అయితే చివర్లో పరీక్ష రాయాల్సిన శివను గుణ కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది.

రోహిణి, మనోజ్ కోసం బాలు, మీనా ప్లాన్
మనోజ్ గదిలోకి రోహిణి వెళ్లకూడదని ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రభావతి వెళ్లిపోయే సీన్ తో సీరియల్ సోమవారం (ఆగస్ట్ 24) ఎపిసోడ్ మొదలైంది. అయితే ఆమె వెళ్లగానే రోహిణి, మనోజ్ లను కలపడానికి బాలు ప్లాన్ వేస్తాడు. మీనాను తీసుకొని రవి, శృతి గదిలోకి వెళ్తాడు. తర్వాత నలుగురూ కలిసి మాట్లాడుకుంటారు. వాళ్లిద్దరినీ గదిలో పెట్టి తాళం వేద్దాం అని బాలు చెబుతాడు. సరే అంటూ అందరూ ఆ ప్లాన్ కు తలూపుతారు.
మనోజ్ గదిలోకి రోహిణి.. తాళం వేసిన బాలు
తర్వాత మీనా రోహిణి దగ్గరికి వెళ్లి మనోజ్ కు కాఫీ కావాలట పిలుస్తున్నాడు అని చెబుతుంది. ఇందాకే అత్తయ్య ఇచ్చి వెళ్లింది కదా అని రోహిణి అంటే.. ఏమో ఆమె లేదు కదా అని నీతో మాట్లాడటానికి పిలుస్తున్నాడేమో అని మీనా అంటుంది. దీంతో రోహిణి పరుగెత్తుకుంటూ మనోజ్ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఫోన్ చూస్తూ రోహిణి వచ్చింది కూడా మనోజ్ పట్టించుకోడు. ఇంతలో బాలు, మీనా, రవి, శృతి కూడా వెంటనే వెళ్లి మనోజ్ గది డోరు మూసి తాళం వేస్తారు.
మనోజ్‌ను గట్టిగా వాటేసుకున్న రోహిణి.. మనోజ్ కూడా..
రోహిణిని చూడగానే మనోజ్ మండి పడతాడు. ఎందుకొచ్చావని అడుగుతాడు. నువ్వు పిలిచావని మీనా చెప్పిందని అంటుంది. కానీ మనోజ్ నమ్మడు. మలేషియా స్టోరీలు చెప్పినట్లు చెప్పి ప్రతీసారి మోసం చేయాలని చూస్తే మోసపోను.. నేను జీనియస్ ను అని మనోజ్ అంటాడు. ఆమె ఏం చెప్పినా వినడు.
దీంతో రోహిణి అతన్ని గట్టిగా వాటేసుకుంటుంది. మనోజ్ ఎంత ప్రయత్నించినా వదలదు. చివరికి మనోజ్ కూడా ఆమె మోహంలో పడిపోయి రోహిణిని గట్టిగా పట్టుకుంటాడు. వదులు అని మనోజ్ అంటే.. నువ్వే నన్ను పట్టుకున్నావని రోహిణి అంటుంది. దీంతో అతడు దూరం జరుగుతాడు.
మనోజ్‌ను దబాయించిన రోహిణి..
రోహిణి చేసిన మోసాల గురించి మనోజ్ చెబుతుంటే.. ఆమె మాత్రం అతన్ని దబాయిస్తుంది. నువ్వు మోసాలు చేయలేదా.. అబద్ధాలు చెప్పలేదా అంటుంది. కల్పన గురించి ఎందుకు చెప్పలేదు.. ఆమె నీకోసం తన సర్వస్వం ఇచ్చానని పోలీస్ స్టేషన్ లోనూ చెప్పింది.. అది ఎందుకు చెప్పలేదు.. అయినా గుడి ముందు అడుక్కునే నీకు షాపు పెట్టించాను అని రోహిణి అంటుంది. అవేమైనా నీ బాబు డబ్బులా.. నా బాబు డబ్బు అని మనోజ్ అంటాడు. అయినా సరే షాపు పెట్టించి గుడి ముందు అడుక్కోవాల్సిన నిన్ను కుర్చీలో కూర్చోబెట్టానని రోహిణి అంటుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.
ఇంటికి వచ్చేసిన ప్రభావతి.. అందరిలోనూ కంగారు
ఇటు కింద బాలు, మీనా, రవి, శృతి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లను విడదీసిన పాపం తమకు వద్దనే మళ్లీ కలపడానికి ఈ పాట్లు అని బాలు, మీనా అంటారు. ఈ విషయం తెలిస్తే అమ్మ ఎంత గొడవ చేస్తుందో అని రవి అంటాడు. ఇంతలో ప్రభావతి వస్తుంది.
దీంతో అందరూ బిజీగా ఉన్నట్లు నటిస్తారు. శృతికి ఏం చేయాలో తెలియక అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడుతుంటుంది. ఆమెను చూసి ఏమైందని ప్రభావతి అడుగుతుంది. బాలు కూడా పేపర్ ను తలకిందులుగా పట్టుకొని చదువుతుండటం చూసి ప్రభావతిలో అనుమానం వస్తుంది. ఆ మోసగత్తె, వగలాడి ఎక్కడ అని మీనాను అడుగుతుంది. నాకు తెలియదని ఆమె చెబుతుంది.
అత్తను తిట్టిన రోహిణి.. తాళం చూసి ప్రభావతి షాక్.. మళ్లీ విడదీసి..
ఇంతలో పైన గదిలో రోహిణి, మనోజ్ వాదులాడుకోవడం వినిపిస్తుంది. మా అమ్మ వస్తే నీ సంగతి చూస్తుందని మనోజ్ అంటే.. రోహిణి ఆమెను తిడుతుంది. అది ప్రభావతి చెవిన పడటంతో ఆమె ఆవేశంతో పైకి వెళ్తుంది. అందరూ కంగారు పడుతుండటంతో ఏం చేశారని సత్యం అడుగుతాడు. బాలు జరిగింది చెబుతాడు. అందరూ పైకి వెళ్లే సరికి.. గదికి తాళం ఉండటం చూసి ప్రభావతి డోరు కొడుతూ మనోజ్ ను పిలుస్తూ ఉంటుంది.
తాళం వేసింది నువ్వేనా అంటూ బాలును అడుగుతుంది. లోపల నుంచి మనోజ్ కూడా దీనితో నేను ఉండలేను.. తలుపు తీయమ్మా అని బతిమాలుతుంటాడు. మొదట తాళం చెవి లేదన్న బాలు.. ప్రభావతి గట్టిగా అడగడంతో తీసి ఇస్తాడు. మనోజ్ బయటకు రాగానే ప్రభావతి మరోసారి వాళ్లను విడదీసి మనోజ్ ను తీసుకెళ్లిపోతుంది. దీంతో బాలు ప్లాన్ ఫెయిలవుతుంది. తనను మనోజ్ తో విడదీసిన నువ్వు ఇంతకింత అనుభవిస్తావ్ అత్త అని రోహిణి శపిస్తుంది.
బాలు, మీనా ముచ్చట్లు.. కళ్ల డాక్టర్‌గా మారి..
ఆ తర్వాత బాలు బయట కూర్చొని ఫోన్ చూస్తుంటాడు. ఇంతలో మీనా వచ్చి ఫోన్ ఎక్కువగా చూస్తే ఏం జరుగుతుందో చెబుతుంటుంది. కళ్లు సేఫ్ గా ఉండాలంటే ఎలాంటి కంటి వ్యాయామాలు చేయాలో బాలుకి వివరిస్తుంది. కొంతసేపు కంటి డాక్టర్ గా మారుతుంది. అప్పుడే శివ గురించి మీనా గుర్తు చేస్తుంది. ఇవాళ వాడికి డిగ్రీ పరీక్ష అని బాలుతో చెబుతుంది.
శివ కిడ్నాప్.. బాలు, మీనా కంగారు
అయితే పరీక్ష రాయడానికి వెళ్లాల్సిన శివ కనిపించకుండా పోతాడు. అతని కోసం బాలు, రాజేష్ వెతుకుతుంటారు. ఇంతలో మీనా అక్కడికి వస్తుంది. ఏమైందని అడిగితే.. శివ కనిపించడం లేదు.. గుణ కిడ్నాప్ చేసినట్లున్నాడని బాలు చెబుతాడు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల ఫీడ్ చూస్తే గుణనే కిడ్నాప్ చేసినట్లు తేలుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


