Gunde Ninda Gudi Gantalu Today Episode: గుణను చితకబాదిన బాలు.. మురళీ ప్రేమకు విద్య ఓకే.. రోహిణి ఎత్తుగడకు లొంగని మనోజ్
Gunde Ninda Gudi Gantalu Serial August 15th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 15 ఎపిసోడ్ లో గుణకు బాలు మరోసారి మాస్ వార్నింగ్ ఇస్తాడు. అటు మురళీ ప్రేమను విద్య అంగీకరిస్తుంది. ఇటు రోహిణి ఇన్సూరెన్స్ ఎత్తుగడలకి మనోజ్ లొంగకుండా ఆమెను దూరం పెడతాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఒకే ఎపిసోడ్ లో బాలు, గుణ వైరంతోపాటు విద్య, మురళీ లవ్ ట్రాక్, అటు మనోజ్, రోహిణి విభేదాలను కూడా చూపించడం విశేషం. మొత్తానికి రోహిణిని మనోజ్ కు పూర్తిగా దూరం చేయడానికి ప్రభావతి కంకణం కట్టుకున్నట్లు ఈ ఎపిసోడ్ లో తేలిపోయింది.

హెల్త్ ఇన్సూరెన్స్‌తో మనోజ్‌ను బుట్టలో వేసుకున్న రోహిణి
మనోజ్ కోసం రోహిణి వేసిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 15) ఎపిసోడ్ మొదలైంది. మనోజ్ దగ్గరికి తన మనిషిని పంపించిన రోహిణి.. తన గురించి గొప్పగా చెప్పించుకుంటుంది. అసలు అలాంటి భార్య దొరకడం మీ అదృష్టం.. తనకు ఏమైనా ఫర్వాలేదు తన భర్తకు ఏమీ కాకూడదని కేవలం మీ కోసమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంది.. ఫస్ట్ ప్రీమియం ఆమెనే కట్టేసింది అని ఆ వ్యక్తి చెబుతాడు.
అది విని మనోజ్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చి రోహిణికి ఫోన్ చేసి మీరు చెప్పమన్నట్లే చెప్పానంటాడు. తన గెస్ నిజమైతే సాయంత్రం ఇంటికి వచ్చి మీ కాళ్లు పట్టుకుంటాడని అతడు చెప్పడంతో రోహిణి మురిసిపోతుంది.
రోడ్డుపై విద్యను నిలదీసిన మీనా
పూలు ఇవ్వడానికి బయటకు వెళ్లిన మీనాను విద్య కలుస్తుంది. ఆమెను చూడగానే మీనా చిరాకు పడుతుంది. మాట్లాడకుండా వెళ్లిపోవాలని చూస్తుంది. కానీ విద్య అడ్డుకొని తానేం తప్పు చేశానని అడుగుతుంది. మీ ఫ్రెండ్ కు సపోర్ట్ చేస్తూ.. అన్ని నిజాలు తెలిసినా దాచడం తప్పు కాదా అని నిలదీస్తుంది.
ఇప్పుడామె వల్లే ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేకుండా పోయిందని మీనా అంటుంది. తను నా ఫ్రెండ్.. నన్ను నమ్మి నాకు అలాంటి నిజాలు చెప్పినప్పుడు నేనెలా మరొకరికి అవి చెప్పగలను అని విద్య అంటుంది. ఎలాగోలా మీనాకు సర్ది చెబుతుంది. దీంతో ఆమె కరిగిపోతుంది. ఇద్దరూ మళ్లీ ఫ్రెండ్స్ అవుతారు.
మురళీ గురించి నిర్ణయం తీసుకోవాలన్న విద్య
అప్పుడే మురళీ గురించి చెబుతుంది విద్య. అతని గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ వచ్చిందని అంటుంది. ఏం జరిగిందని అడిగితే.. మురళీ ఆడిన యాక్సిడెంట్ నాటకం, తాను అతన్ని కొట్టిన విషయం చెబుతుంది. అలా అయితే నువ్వు కూడా అతన్ని ప్రేమిస్తున్నావా అని మీనా అడుగుతుంది.
తాము నిజంగా ప్రేమిస్తున్న వాళ్ల గురించే ఎవరైనా అంతగా ఆందోళన చెందుతారు అని చెబుతుంది. విద్య కూడా తనకూ అదే అనిపిస్తుందని అంటుంది. ఈ విషయం త్వరలోనే అతనికి చెప్పేస్తానని చెప్పి వెళ్లిపోతుంది.
శివను బలవంతంగా తీసుకొచ్చిన గుణ
మరోవైపు శివను గుణ తన మనుషులను పంపించి బలవంతంగా తన దగ్గరికి తీసుకొస్తాడు. శివ ఎదురు తిరిగినా గుణ వినడు. తన దగ్గర తిరిగి చేరాలని, డబ్బు ఇస్తానని అంటాడు. తాను మారిపోయానని, ఇక నుంచి ఇలాంటి పనులు చేయనని, తనకు పరీక్షలు ఉన్నాయి.. వదిలేయమని అడుగుతాడు. కానీ గుణ వినడు. శివను వెళ్లకుండా అడ్డుకుంటాడు. నువ్వెలా వెళ్తావో నేనూ చూస్తాను.. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష రాయనివ్వను అని తేల్చి చెబుతాడు.
గుణ మనుషులతో బాలు గొడవ
అటు బాలు కారులో గుణ మనుషులు ఎక్కుతారు. కారులోనే వాళ్లు బీర్లు తాగుతుంటారు. అది చూసి బాలు ఆవేశంతో రగిలిపోతాడు. వాళ్లను కారు నుంచి దించి సీసాలు నేలకేసి కొడతాడు. వాళ్లు ఎదురు తిరగడంతో ఇద్దరినీ బాలు చితకబాదుతారు. దీంతో ఇది ఎవరి ఏరియానో తెలుసా అంటూ వాళ్లు అడుగుతారు.
ఎవరి ఏరియా అని బాలు అడగడంతో ఇది ఫైనాన్షియర్ గుణ ఏరియా.. ఇదే అతని బిల్డింగ్.. ఇక్కడికి వచ్చి అతని మనుషులనే కొడతావా అని అనడంతో బాలు నటన మొదలు పెడతాడు. గుణ సార్ ఏరియా అని తెలియక చేశానని, ఎలాగైనా ఆయనను కలవాలని అనుకుంటున్నానని, దయచేసి అతనితో కలవనీయండని భయపడుతున్నట్లుగా నటిస్తాడు. దీంతో వాళ్లు బాలుని తీసుకెళ్తారు.
గుణకు బాలు మాస్ వార్నింగ్
గుణ మనుషులు అతనికి వడ్డీ డబ్బులు ఇచ్చిన తర్వాత నీకోసం నీ అభిమాని వచ్చాడని చెబుతారు. ఎవరతను అని అడగ్గానే బాలు ఎంట్రీ ఇస్తాడు. నువ్వా అని గుణ షాకవుతాడు. నేనేరా అంటూ గుణ ముందే అతని మనుషులను మరోసారి బాలు చితకబాదుతాడు. నువ్వేమైనా పెద్ద రౌడీ అనుకుంటున్నావా రా.. నీ పేరు చెబితే భయపడలా.. వడ్డీ డబ్బుల కోసం ఏ పనైనా చేసే నీకే అంత ఉంటే.. నిజాయతీగా సంపాదించే తనలాంటి వాడికి ఇంకెంత ఉంటుందని గుణతో బాలు అంటాడు.
శివను తీసుకెళ్లిన బాలు
అదే సమయంలో బావ అంటూ శివ వస్తాడు. అతన్ని చూసి బాలు షాక్ తింటాడు. నువ్వేంటి ఇక్కడ.. మళ్లీ వీడితో కలిసిపోయావా అంటూ అతన్ని కూడా కొట్టడానికి వెళ్తాడు. కానీ గుణనే తనను బలవంతంగా తీసుకొచ్చాడని, తనను పరీక్ష రాయకుండా అడ్డుకుంటానని సవాలు కూడా చేశాడని బాలుతో చెబుతాడు గుణ.
దీంతో గుణకు బాలు మాస్ వార్నింగ్ ఇస్తాడు. అక్కడే ఉన్న సీసాను పగలగొట్టి గుణ కంటిలో పొడవబోతాడు. నువ్వేంటి రా వాడి పరీక్షను అడ్డుకునేది.. వాడు కచ్చితంగా పరీక్ష రాస్తాడు.. పెద్ద ఉద్యోగం చేస్తాడు.. ఎవడు అడ్డుకుంటాడో చూస్తాను అని గుణకు వార్నింగ్ ఇచ్చి శివను తీసుకొని వెళ్లిపోతాడు.
కేకుతో విద్యకు మురళీ లవ్ ప్రపోజల్.. ఓకే చెప్పిన విద్య
అటు విద్య ఇంటికి వెళ్తాడు మురళీ. తనతోపాటు కేకు తీసుకొని వెళ్తాడు. తన బర్త్ డే అని చెప్పడంతో విద్య అతనికి విషెస్ చెబుతుంది. తర్వాత కేకు బయటకు తీస్తాడు. దానిపై ఐ లవ్యూ విద్య అని రాసి ఉంటుంది. అది చూసి ఆమె షాక్ తింటుంది. బర్త్ డే అన్నావ్.. ఇదేంటని అడుగుతుంది.
ఇక ఆలస్యం చేయకుండా మురళీ.. విద్యపై తనకున్న ప్రేమ గురించి చెబుతాడు. తాను వెంట తెచ్చిన పువ్వు ఇస్తూ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అది చూసి విద్య మురిసిపోతుంది. నువ్వు కేకుతో నాపై ప్రేమను చెప్పావు.. నేనెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంటుంది. అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నట్టేనా అని మురళీ అడుగుతాడు. అలాగే అనిపిస్తోందని విద్య అనడంతో మురళీ ఎగిరి గంతేస్తాడు. డ్యాన్స్ చేస్తాడు.
రోహిణికి మనోజ్ మరింత దూరం
ఇటు తన ప్లాన్ వర్కౌట్ అవడంతో మనోజ్ తనకు దగ్గరవుతాడని రోహిణి అనుకుంటుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనోజ్ తన గదిలో కాకుండా బయట పడుకోవడానికి వెళ్తాడు. అతనికి ప్రభావతి మరింత నూరిపోస్తుంది. దీంతో రోహిణి షాక్ తింటుంది. ఆమెను మనోజ్ కు పూర్తిగా దూరం చేసేలా ప్రభావతి ప్లాన్ చేస్తుంది. చివరికి రోహిణి కోసం శృతి ఓ మేకప్ కాంట్రాక్ట్ తీసుకొచ్చినా ప్రభావతి వెళ్లనీయదు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


