Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని కాపాడిన మనోజ్.. గదిలో వేసి తాళం వేసిన బాలు.. ప్రభావతి ఊసరవెల్లన్న శృతి
Gunde Ninda Gudi Gantalu Serial August 23rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 23 ఎపిసోడ్ లో తన భార్య రోహిణిని మనోజ్ కాపాడతాడు. అయితే రవి, శృతిలకు బాలు, మీనా నిజం చెప్పేస్తారు. మరోవైపు రోహిణి, మనోజ్ లను అందరూ కలిసి గదిలో వేసి తాళం వేస్తారు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి బారి నుంచి తృటితో తప్పించుకుంటుంది రోహిణి. మనోజ్ నిజం దాచడంతో బాలు, మీనా షాక్ తింటారు. అయితే చివరికి ప్రభావతి లేని సమయంలో మనోజ్, రోహిణిని కలిపే పని మొదలు పెడతారు బాలు, మీనా, రవి, శృతి.

షాపులో తలదించుకున్న రోహిణి
షాపులో రోహిణి చేసిన మోసం గురించి మనోజ్ కు బాలు, మీనా చెప్పే సీన్ తో సీరియల్ ఆదివారం (ఆగస్ట్ 23) ఎపిసోడ్ మొదలైంది. నువ్వు ఫ్రాడా అని రాజుని మనోజ్ అడుగుతాడు. నీ భార్య ఫ్రాడ్.. ఈ డీల్ ఓ నకిలీది.. ఇదో స్కామ్.. సొంత భర్తనే మోసం చేసిన నీకంటే నేనే నయం అని మనోజ్, రోహిణిని తిట్టి రాజు వెళ్లిపోతాడు.
అతడు వెళ్లిన తర్వాత రోహిణిని మీనా నిలదీస్తుంది. నువ్వు మారవా రోహిణి.. ఏం చేస్తున్నావ్.. అసలు నీకు మనస్సాక్షి లేదా అని తిడుతుంది. అటు బాలు కూడా వీడు అమాయకుడని తెలిసి ఇంకెన్నిసార్లు మోసం చేస్తావ్ అని అంటాడు.
మనోజ్‌కు దగ్గర కావాలనుకున్నానన్న రోహిణి
మనోజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మరోసారి మోసపోయానన్న ఫీలింగ్ తో అలా ఉండిపోతాడు. బాలు, మీనా తిడుతుంటే రోహిణి తలదించుకొని నిల్చుంటుంది. మనోజ్ కు దగ్గర కావాలనే ఇలా చేశానని అంటుంది. ఇంట్లో అత్తయ్య మాట్లాడనివ్వడం లేదు.. మనోజ్ ఆమెకు భయపడి నన్ను దూరం పెడుతున్నాడు.. అందుకే ఈ నాటకం ఆడానని అనడంతో మనోజ్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.
అటు బాలు కూడా ఇక లాభం లేదు.. నిన్ను ఇలాగే వదిలేస్తే వాడిని మోసం చేస్తూనే ఉంటావ్.. మొదట అమ్మకు చెబుతాను.. తర్వాత పోలీసులకు చెబుతాను.. ఆ తర్వాత ముసుగేసి మీడియా ముందు నిలబెడతాను అని వార్నింగ్ ఇస్తాడు. కానీ మీనా మాత్రం అతన్ని తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత రోహిణిని కొట్టబోయిన మనోజ్.. గెటౌట్ అంటూ ఆమెను వెళ్లగొడతాడు.
మనోజ్ డీల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ప్రభావతి
ఇటు ఇంట్లో మనోజ్ కోసం ప్రభావతి ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. చెక్కు తీసుకొస్తాడా, క్యాష్ తీసుకొస్తాడా అని ఆలోచిస్తుంటుంది. ఇంతలో బాలు, మీనా రావడంతో ముఖం మాడ్చుకుంటుంది. నా కొడుకు వచ్చాడేమో అనుకున్నా అంటుంది. నేనూ నీ కొడుకునే అని బాలు అనడంతో.. మనోజ్ నా పేరు నిలబెట్టే కొడుకు అని ప్రభావతి గర్వంగా చెప్పుకుంటుంది.
ఇంకాసేపట్లో ఎవరు పరువు నిలబెడతారో తెలుస్తుందని బాలు అంటాడు. నిజం చెప్పబోతే మీనా అడ్డుకుంటుంది. వాడు తెచ్చే డీల్ చూసి కుళ్లుకుంటావ్ అని ప్రభావతి అంటుంది. ఏం జరుగుతుందో నువ్వూ చూస్తావ్ కదా అని బాలు అంటాడు.
రోహిణి గురించి నిజం దాచిన మనోజ్
అదే సమయంలో ఇంట్లో అందరూ వస్తారు. చివరికి రోహిణిని తీసుకొని మనోజ్ కూడా వస్తాడు. మనోజ్ ను చూడగానే చెక్కు ఏది.. డబ్బు ఏది అని ప్రభావతి ఆశగా అడుగుతుంది. డీల్ క్యాన్సిల్ అయిందని మనోజ్ అంటాడు. ఇప్పుడు మనోజ్ నిజం చెప్పేస్తాడు.. అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది అని రోహిణి భయపడుతుంది. కానీ మనోజ్ మాత్రం డీల్ బాగా లేదని, దానివల్ల పెద్దగా మిగిలేదేమీ ఉండదని, అందుకే తానే క్యాన్సిల్ చేసుకున్నానని అబద్దం చెప్పి రోహిణిని కాపాడతాడు.
ప్రభావతి ఊసరవెల్లి అన్న శృతి.. షాక్‌లో బాలు
మనోజ్ ఆ మాట అనగానే బాలు, మీనా షాక్ తింటారు. అటు ప్రభావతి కూడా మాట మారుస్తుంది. ఈ దరిద్రపుగొట్టుది డీల్ తెచ్చినప్పుడే అనుకున్నాను.. ఇలాంటిదేదో జరుగుతుందని అని అంటుంది. దీంతో శృతి చప్పట్లు కొడుతుంది. ఎంత వేగంగా మాట మారుస్తున్నారాంటీ.. ఊసరవెల్లి కూడా ఇంత వేగంగా మార్చదు.. రోహిణి వల్లే డీల్ వచ్చిందంటే సాగనంపారు.. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేసరికి దరిద్రపుగొట్టుది అని తిడుతున్నారు అని అత్తను నానా మాటలంటుంది. అది విని సత్యం కూడా మంచి మాటే చెప్పావని మెచ్చుకుంటాడు.
రూమ్‌లోకి తీసుకెళ్లి క్లాస్ పీకిన మనోజ్
ఇటు రోహిణిని గదిలోకి తీసుకెళ్లిన మనోజ్.. ఆమెకు క్లాస్ పీకుతాడు. ఆ బాలుగాడు, మీనా ముందు నా పరువు తీశావ్.. ఎందుకిలా చేస్తున్నావ్.. నిన్ను నమ్మిన ప్రతిసారీ నన్ను మోసం చేస్తూనే ఉన్నావని రోహిణిని తిడతాడు. అత్తయ్య బారి నుంచి కాపాడినందుకు రోహిణి థ్యాంక్స్ చెబుతుంది. నీకు దగ్గరవడానికే ఈ పని చేశానని రోహిణి అంటుంది. అలా అయితే ఆ ఇన్సూరెన్స్, పూజలు కూడా నాటకమేనా అని మనోజ్ అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ రోహిణి మాత్రం తన నటనను పండిస్తుంది.
రవి, శృతిలకు నిజం చెప్పిన బాలు, మీనా
మరోవైపు రవి, శృతిలను తీసుకెళ్లి బాలు, మీనా అసలు నిజం చెప్పేస్తారు. షాపులో ఏం జరిగిందో చెప్పడంతో వాళ్లూ ఆశ్చర్యపోతారు. అయినా అమ్మ దగ్గర మనోజ్ నిజం దాచడమే ఆశ్చర్యం కలిగిస్తోందని రవి అంటాడు. అటు మీనా కూడా అదే అంటుంది. అయినా రోహిణి తనకు ఓ మిస్టీరియస్ పర్సన్ లా అనిపిస్తోందని, ఇంకా చాలా నిజాలే దాచుతోందని శృతి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆమె ఇలా చేయడానికి ఒకందుకు మనమూ కారణమేనని మీనా అంటుంది. నువ్వు మరీ అంత ఫీలవ్వాల్సిన అవసరం లేదు.. ఆమె చేసిన మోసాలనే మనం బయటపెట్టింది అని బాలు అంటాడు. అయినా సరే మనోజ్ పై ఉన్న ప్రేమతోనే రోహిణి ఇలా చేస్తోందని మీనా అంటుంది.
మనోజ్‌కు రోహిణిని దూరం చేసిన ప్రభావతి
ఇటు మరుసటి రోజు ఉదయం మనోజ్ కు కాఫీ తీసుకెళ్లడానికి వెళ్తుంది రోహిణి. కానీ వాడి గదిలో కాలు పెట్టడానికి వీల్లేదంటూ ఆ కాఫీని మనోజ్ కు తీసుకెళ్లి ఇస్తుంది ప్రభావతి. రోహిణికి దూరంగా ఉండాలని మనోజ్ కు కూడా చెబుతుంది. అయినా తానో జీనియస్ అని, తనను పదేపదే ఎవరూ మోసం చేయలేరని మనోజ్ అనుకుంటాడు.
తాను బయటకు వెళ్తున్నానని, తిరిగి వచ్చే వరకు వాడి గదిలోకి వెళ్లొద్దని రోహిణికి వార్నింగ్ ఇచ్చి ప్రభావతి వెళ్లిపోతుంది. అయితే అప్పుడే బాలు, మీనా, రవి, శృతి ప్లాన్ చేసి మనోజ్ తో రోహిణిని కలపాలని అనుకుంటారు. మనోజ్ పిలుస్తున్నాడని రోహిణిని గదిలోకి పంపిస్తారు. తర్వాత బయటి నుంచి బాలు తాళం వేస్తాడు. రోహిణిని మనోజ్ తిట్టబోతే ఆమె అతన్ని గట్టిగా వాటేసుకుంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


