Toxic: 20 ఏళ్ల క్రితమే టాక్సిక్ డైరెక్టర్ గీతూతో నటించిన నయనతార- మెగాస్టార్ హీరో- సూపర్ హిట్ అయిన ఆ సినిమా ఏంటో తెలుసా?
Nayanthara Toxic Director Geetu Mohandas Movie: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకకు లేడీ సూపర్ స్టార్ నయనతార హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వేదికపై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో తనకున్న 20 ఏళ్ల అనుబంధాన్ని, సినిమాలో నటించేందుకు మొదట్లో తాను ఎందుకు భయపడిందో చెప్పారు.
Nayanthara Toxic Director Geetu Mohandas Movie: సొంత సినిమాల ప్రమోషన్లకు కూడా దూరంగా ఉండే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, ఇటీవల బెంగళూరులో జరిగిన రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' (Toxic) మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

గీతూ మోహన్ దాస్‌పై నయనతార కామెంట్స్
సాధారణంగా బహిరంగ సభలకు, ఈవెంట్లకు దూరంగా ఉండే నయన్.. యశ్‌పై ఉన్న అభిమానంతో పాటు ఈ టాక్సిక్ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వేదికపై గీతూ మోహన్‌దాస్ గురించి నయనతార మాట్లాడిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
"మల్టీస్టారర్ అనగానే భయపడ్డాను.. కానీ!"
గీతూ మోహన్‌దాస్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ నయనతార ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మా ఇద్దరి మధ్య దాదాపు 20 ఏళ్ల నాటి సుదీర్ఘమైన, ఎంతో అందమైన స్నేహం ఉంది. మేము ఇద్దరం కలిసి చాలా ఏళ్ల క్రితం ఒకే సినిమాలో నటించాం. అప్పటి గీతూ వేరు, ఇప్పటి గీతూ వేరు" అని నయనతార అన్నారు.
"అయితే 'టాక్సిక్' కథ పట్టుకుని ఆమె (గీతూ మోహన్ దాస్) నన్ను సంప్రదించినప్పుడు నేను కాస్త సంకోచించాను. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది పెద్ద నటీనటులు ఉన్నారు. సాధారణంగా ఎక్కువ మంది నటులు ఉన్న మల్టీస్టారర్ కథలను ఎంచుకునేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను" అని నయనతార చెప్పారు.
ఈ సినిమా చేయలేనని మొదట్లో చెప్పేసినా, గీతూ వదలకుండా వచ్చి కథ వివరించారని నయన్ తెలిపారు. "ఆమె నాకు లైన్ చెప్పిన మరుక్షణమే.. 'ఎవరీ మహిళ? ఇప్పటివరకు మనం చూడని ఒక కొత్త దర్శకురాలిని గీతూలో చూస్తున్నానా?' అని నాకే ఆశ్చర్యం వేసింది" అని గీతూని నయనతార ప్రశంసించారు.
కష్టకాలంలో చేయి పట్టుకునే వ్యక్తిత్వం
ఓ మహిళా దర్శకురాలిగా గీతూ పనితీరును, సెట్స్‌లో ఆమె నటీనటులను చూసుకునే విధానాన్ని నయన్ ఎంతగానో కొనియాడారు. "దర్శకురాలిగా మీ విజన్, ప్రతిభ గురించి అందరూ చెప్పారు. కానీ, ఒక మహిళగా సెట్స్‌లో ప్రతీ నటీనటుడిని మీరు చూసుకున్న తీరు, చూపించిన ప్రేమ నిజంగా ప్రశంసనీయం" అని నయన్ చెప్పుకొచ్చారు.
"నటీనటులకు కష్టమైన లేదా భావోద్వేగ సమయాలు ఎదురైనప్పుడు మీరు వారి చేయి పట్టుకుని తోడుగా నిలిచారు. ఆ గుణమే మిమ్మల్ని అందరూ ప్రేమించేలా చేసింది. యూ ఆర్ జస్ట్ అమేజింగ్ గీతూ" అని నయనతార ఎమోషనల్ అయ్యారు.
20 ఏళ్ల క్రితం ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమా ఏంటీ?
నయనతార మాటలు విన్న తర్వాత, అసలు గీతూ మోహన్‌దాస్-నయనతార కలిసి నటించిన ఆ పాత సినిమా ఏంటని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. అది 2005లో విడుదలైన సూపర్ హిట్ మలయాళ చిత్రం 'రాప్పకల్' (Rappakal).
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరో నటించిన ఈ కుటుంబ కథా చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, టాక్సిక్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ మరొక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఒక అనాథ సేవకుడు కుటుంబానికి ఎలా జీవనాధారంగా మారాడనే పవిత్రమైన బంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


