Sreeleela: అసలు లేడీ సూపర్ స్టార్ ఆమెనే.. నాకు ఇంకా చాలా టైమ్ ఉంది.. చెన్నై బాయ్స్ చాలా స్వీట్: శ్రీలీల కామెంట్స్
Sreeleela: శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. చెన్నైలోని అమృత ఏవియేషన్ కాలేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరైన ఆమె.. రియల్ లేడీ సూపర్ స్టార్ నయనతారే అని స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్, విద్యార్థుల భవిష్యత్తుపైనా మాట్లాడింది.
Sreeleela: దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువ నటి శ్రీలీల.. తాజాగా చెన్నైలో జరిగిన అమృత ఏవియేషన్ కాలేజ్ ప్రెస్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు. ఆ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. విద్యార్థులతో ముచ్చటిస్తూ తన జీవిత పాఠాలను పంచుకున్నారు. ఒక పక్క నటిగా, మరోపక్క మెడిసిన్ చదువుతున్న విద్యార్థిగా ఆమె పడుతున్న శ్రమను, ఆమె ఆలోచనా దృక్పథాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా లేడీ సూపర్ స్టార్ అని తనను పిలవడాన్ని సున్నితంగా తిరస్కరించారు.

నయనతార అక్కే లేడీ సూపర్ స్టార్
సాధారణంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారను అందరూ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. కానీ ఈ ఈవెంట్ లో హోస్ట్.. శ్రీలీలను లేడీ సూపర్ స్టార్ అని, సౌత్ సూపర్ స్టార్ అని పిలిచారు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. అసలు లేడీ సూపర్ స్టార్ నయనతారే అని ఆమె స్పష్టం చేసింది. ఆమె తనకు రోల్ మోడల్ అని, తాను ఆ స్థాయికి ఎదగడానికి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పింది. ఈ సందర్భంగా చెన్నై బాయ్స్ చాలా స్వీట్ అని కూడా ఆమె అనడం విశేషం.
ఓటమిని రుచి చూడాల్సిందే..
ఇక విజయం గురించి కూడా శ్రీలీల తనదైన శైలిలో స్పందించింది. "సక్సెస్ అనేది గమ్యం కాదు, అది ఒక ప్రయాణం" అని స్పష్టం చేసింది. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవద్దని విద్యార్థులకు సూచించారు.
"మనం ప్రయత్నించడానికి భయపడాలి తప్ప, ఓడిపోవడానికి కాదు. ఓటమి నుంచి వచ్చే పాఠమే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది. అపజయాన్ని రుచి చూడకపోతే, గెలుపు విలువ ఏంటో మనకు తెలియదు" అని ఆమె తెలిపారు. సినిమా రంగంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా ఒడిదొడుకులు సహజమని, వాటిని అధిగమించి ముందుకు సాగడమే జీవితమని ఆమె పేర్కొన్నారు.
ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం
ఈ మధ్యే ఎంబీబీఎస్ డిగ్రీ అందుకున్న శ్రీలీల.. చదువు పట్ల తనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేవలం పరీక్షల్లో మార్కుల కోసం చదవవద్దని, జ్ఞానాన్ని సంపాదించడానికి చదవాలని ఆమె పిలుపునిచ్చారు.
"నేను మెడిసిన్ చదివేటప్పుడు కూడా ఒక పేషెంట్ నా ముందు ఉంటే నేను ఎలా స్పందించాలి? అనే ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తాను. ఇక్కడ ఏవియేషన్ విద్యార్థులకు కూడా అదే అవసరం. విమానంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైతే ఎలా డీల్ చేయాలనే ప్రాక్టికల్ అవగాహన ఉంటేనే వృత్తిలో రాణించగలరు" అని వివరించారు.
ఈ కాలేజీలో ఉన్న కాక్‌పిట్, బోర్డింగ్ ఏరియా వంటి సౌకర్యాలు విద్యార్థులకు సినిమా సెట్‌లాంటి అనుభూతిని ఇస్తాయని, వారు చాలా అదృష్టవంతులని ఆమె ప్రశంసించారు.
అమ్మే నా బలం
ఈవెంట్ సందర్భంగా తన తల్లిపై ఉన్న ప్రేమాభిమానాలను శ్రీలీల చాటుకున్నారు. "నేను ఎక్కడికి వెళ్లినా నా తల్లి నా వెంటే ఉంటుంది. మా ఇద్దరిది 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' లాంటి బంధం. నా ప్రతి అడుగులో ఆమె నాకు మద్దతుగా నిలుస్తుంది" అని చెబుతూ, అక్కడ ఉన్న తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షూటింగ్స్, ఇంటర్న్‌షిప్స్ అంటూ బిజీగా ఉన్నా తన తల్లి ఇచ్చే ప్రోత్సాహమే తనను ముందుకు నడిపిస్తోందని ఆమె ఉద్వేగంగా చెప్పారు.
శ్రీలీల సినిమా కబుర్లు..
తమిళ ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, భాషా సరిహద్దులు దాటి మంచి కథలను ఎంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. అలాగే సూపర్ స్టార్ వంటి బిరుదుల గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదని, ప్రేక్షకులను గర్వపడేలా చేసే సినిమాలు చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని శ్రీలీల పేర్కొన్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


