Sidharth Kiara Advani: టాక్సిక్ ట్రైలర్‌లో కియారా అద్వానీ అవతారంపై భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కామెంట్స్.. ఏం చెప్పాడంటే?
Siddharth Malhotra On Kiara Advani In Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ అవతారంపై ఆమె భర్త, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Siddharth Malhotra On Kiara Advani In Toxic Trailer: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్'. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ ట్రైలర్‌ను శనివారం (ఆగస్ట్ 8) విడుదల చేయగా, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

టాక్సిక్‌లో టాప్ హీరోయిన్లు
టాక్సిక్ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషీ వంటి టాప్ హీరోయిన్లు ఉన్నప్పటికీ, కియారా అద్వానీ లుక్, ఆమె నటనపైనే అందరి దృష్టి నిలిచింది. పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో కియారా టాక్సిక్ ట్రైలర్‌లో సీన్ మొత్తాన్ని దోచేసిందంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
కియారా అద్వానీపై భర్త పోస్ట్
టాక్సిక్ ట్రైలర్ వైరల్ అయిన వెంటనే కియారా అద్వానీ భర్త, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఈ సినిమా కియారా కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా: సిద్ధార్థ్ మల్హోత్రా
"నువ్వు పడ్డ కష్టం, చూపించిన తపన అంతా వెండితెరపై స్పష్టంగా కనిపిస్తోంది. నీ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది కియారా. డైరెక్టర్ గీతు మోహన్‌దాస్, యశ్, నువ్వు అండ్ మీ టీమ్ అంతా కలిసి చేసిన ఈ మ్యాజిక్ చూడటానికి ఆగలేకపోతున్నా" అని సిద్ధార్థ్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.
'టాక్సిక్' కంటే ముందు, 'టాక్సిక్' తర్వాత!
టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో "ఈ సినిమాలో నాది 'నాదియా' అనే పాత్ర. నటిగా నాలో ఉన్న భయం లేని కోణాన్ని నేను గుర్తించడానికంటే ముందే దర్శకురాలు గీతు, యశ్ నమ్మారు. నా సినీ ప్రయాణంలో కియారా 'టాక్సిక్ ముందు', 'టాక్సిక్ తర్వాత' అని చెప్పుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు" అని కియారా అద్వానీ ఎమోషనల్ అయ్యారు.
డెలివరీ తర్వాత
ప్రసూతి విరామం (Maternity Break) తర్వాత కియారా బిగ్ స్క్రీన్‌పైకి పునరాగమనం చేస్తున్న చిత్రం ఇది. గతేడాది (2025) సిద్ధార్థ్, కియారా దంపతులకు కుమార్తె సారా బాబు (Saraayah) జన్మించిన సంగతి తెలిసిందే. తల్లి అయిన తర్వాత కియారా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల!
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేసి ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
యశ్ మాస్ ఇమేజ్‌కు, గీతు మోహన్‌దాస్ టేకింగ్ తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'టాక్సిక్' సినిమాలో హీరో ఎవరు, దర్శకత్వం ఎవరు వహించారు?
కెజియఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత గీతు మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
2. 'టాక్సిక్' చిత్రంలో నటించిన ప్రధాన నటీనటులు ఎవరు?
యశ్, కియారా అద్వానీలతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
3. 'టాక్సిక్' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
ఈ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


