Toxic: కియారా అద్వానీ ఇంటిమేట్ సీన్స్ వివాదం- రోతగా ఉంది, ఆరోజు సమాధానం గట్టిగా ఉంటుంది- టాక్సిక్ మరో హీరోయిన్ కామెంట్స్
Huma Qureshi On Kiara Advani Intimate Scenes: యశ్ టాక్సిక్ తబాహీలో కియారా అద్వానీ ఇంటిమేట్ సీన్లపై వస్తున్న ట్రోలింగ్‌పై బాలీవుడ్ నటి, మరో హీరోయిన్ హుమా ఖురేషి స్పందించారు. రోత పుట్టిస్తోందని, ఆరోజే సమాధానం చాలా గట్టిగా ఉంటుందని హుమా ఖురేషి కామెంట్స్ చేశారు. హుమా ఖురేషి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Huma Qureshi On Kiara Advani Intimate Scenes: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్'. కేజీఎఫ్ సిరీస్ విజయాల తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో టాక్సిక్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కియారా అద్వానీ ఇంటిమేట్ సీన్స్
ఈ క్రమంలో ఇటీవల టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన 'తబాహీ' పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఈ పాటలో హీరో యశ్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య ఉన్న కొన్ని ఇంటిమేట్ సీన్స్ (Intimate Scenes) ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి.
పెళ్లయిన నటిపైనే నిందలా? నెటిజన్ల ద్వంద్వ వైఖరి
'తబాహీ' పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో కియారా అద్వానీని లక్ష్యంగా చేసుకుని దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. వివాహమై, తల్లి అయిన తర్వాత కూడా ఇలాంటి దృశ్యాల్లో నటించడం ఏంటంటూ కొందరు కియారాను విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా ఆమె భర్త, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్లి అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు. ఒక నటిగా ఆమె ఎంచుకున్న పాత్రను వదిలేసి, ఆమె వ్యక్తిగత జీవితాన్ని, వైవాహిక బంధాన్ని ప్రశ్నించే స్థాయికి ఈ వేధింపులు చేరాయి.
వేరు వేరు న్యాయం
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ పాటలో నటించిన హీరో యశ్‌కు కూడా పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ ఆయనను ఎవరూ ప్రశ్నించకపోగా, ప్రశంసలు కురిపిస్తున్నారు. పురుషుడికి ఒక న్యాయం, మహిళకు మరో న్యాయం అమలు చేయడంపై చిత్ర పరిశ్రమ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ నటి హుమా ఖురేషి ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు.
రోతగా ఉంది.. సినిమానే సమాధానం చెబుతుంది!
"మహిళలను మాత్రమే ఇలా వేధించడం చాలా అసహ్యకరంగా ఉంది. రోత పుట్టిస్తోంది. సమాధానాలు చెప్పుకుంటూ పోవడం వల్ల జనుల మానసిక ధోరణి మారదు. ఈ సినిమాలో నటించిన నటీమణులు, దర్శక నిర్మాతలే చివరికి గెలుస్తారు. మా మాటల కంటే ఈ సినిమా వచ్చే ఆగస్టు 26న థియేటర్లలో ఇచ్చే సమాధానమే గట్టిగా ఉంటుంది" అని టాక్సిక్ మరో హీరోయిన్ హుమా ఖురేషి స్పష్టం చేశారు.
అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మరో నటుడు సాకిబ్ సలీమ్ కూడా స్పందిస్తూ.. "అసలు వీళ్లంతా ఎవరు? బయటి ప్రపంచం ఎంతో దయతో ఉంటే, ఈ సోషల్ మీడియా ప్రపంచం మాత్రం అత్యంత దారుణంగా మారింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశీ నటుడి ఘాటు వ్యాఖ్యలు
ఈ వివాదంపై బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా స్పందించారు. నటుల పని కేవలం పాత్రల్లో జీవించడమేనని గుర్తుచేశారు. "యశ్‌కు పెళ్లై పిల్లలు ఉన్నారు. అతనికి రాని అభ్యంతరం కియారాకు మాత్రమే ఎందుకు ఎదురవుతోంది? పురుషుడికి చప్పట్లు, స్త్రీకి తిట్లు దక్కడం మన సమాజంలోని వికృత ఆలోచనా విధానానికి నిదర్శనం. వారు నటులు, తెరపై ప్రేమను పండించడం వారి వృత్తి బాధ్యత" అని బెనెడిక్ట్ హితవు పలికారు.
టాక్సిక్ హీరోయిన్స్
'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రంలో నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, కియారా అద్వానీ వంటి ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


