Rukmini Vasanth: టాక్సిక్ హీరోయిన్ రుక్మిణి వసంత్ బికినీ కేసు- ముగ్గురు నిందితులు అరెస్ట్- చెప్పినట్లే చేసిన బ్యూటీ!

Rukmini Vasanth Bikini Video Case Update: కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ బికినీ, డీప్‌ఫేక్ వీడియోలను నెట్‌లో వైరల్ చేసిన ముగ్గురు కేటుగాళ్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నటి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Published on: Jun 20, 2026, 14:16:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rukmini Vasanth Bikini Video Case Update: వెండితెర, బుల్లితెర ప్రముఖులను వేధిస్తున్న డీప్‌ఫేక్ ముఠాలపై బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కన్నడ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ ఫొటోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

టాక్సిక్ హీరోయిన్ రుక్మిణి వసంత్ బికినీ కేసు- ముగ్గురు నిందితులు అరెస్ట్- చెప్పినట్లే చేసిన బ్యూటీ!
టాక్సిక్ హీరోయిన్ రుక్మిణి వసంత్ బికినీ కేసు- ముగ్గురు నిందితులు అరెస్ట్- చెప్పినట్లే చేసిన బ్యూటీ!

డీప్ ఫేక్ వీడియోలు

అయితే, రుక్మిణి వసంత్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో అశ్లీల చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించిన వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ అనుమతి లేకుండా ఆమె రూపాన్ని అసభ్యకరంగా మార్చేసి సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేయడంతో రుక్మిణి పోలీసులను ఆశ్రయించారు.

సినీ తారల వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు డిజిటల్ యుగంలో ఎలాంటి ముప్పు పొంచి ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. గతంలో రష్మిక మందన్నా, ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్లు సైతం ఇలాంటి సైబర్ దాడుల బారిన పడిన సంగతి తెలిసిందే.

రూమ్ ప్లాన్ వేసి దొరికిపోయిన కేటుగాళ్లు

తాజాగా ఎన్టీఆర్, యశ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రుక్మిణి వసంత్ ఈ దారుణానికి బలికావడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ విభాగం పక్కా సమాచారంతో పట్టుకుంది. నిందితులను బాగల్‌కోట్ జిల్లాకు చెందిన రవికుమార్ (24), శివమొగ్గకు చెందిన చంద్రకాంత్ (33), బెంగళూరు నివాసి రంజిత్ (25)లుగా పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టించడానికి, వాటిని వివిధ గ్రూపుల్లో షేర్ చేయడానికి వాడిన మూడు హై-ఎండ్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. భారతీయ న్యాయ సంహిత (BNS), సమాచార సాంకేతిక చట్టం (IT Act) లోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ దందా వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు.

బికినీ ఫొటోలతో దుష్ప్రచారం.. రుక్మిణి హెచ్చరిక

'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం హృదయాలకు దగ్గరైన రుక్మిణి వసంత్, కాంతార చాప్టర్-1'తో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం రుక్మిణి ఒక సినిమా షూటింగ్‌లో బికినీ ధరించినట్లు కొన్ని మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఇది పూర్తిగా ఏఐ సృష్టించిన నకిలీ కంటెంట్ అని గ్రహించిన రుక్మిణి, గత నెల మే 23న ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

"నా బృందం పరిశీలనలో నా పేరుతో కొన్ని ఏఐ సృష్టించిన నకిలీ ఫొటోలు సర్క్యులేట్ అవుతున్నట్లు తెలిసింది. ఆ ఫొటోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అవి పూర్తిగా అబద్ధం" అని రుక్మిణి స్పష్టం చేశారు. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె అప్పట్లోనే హెచ్చరించారు. చెప్పినట్లుగానే సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ ముగ్గురు కేటుగాళ్లు బుక్కయ్యారు.

పరిశ్రమను వేధిస్తోన్న డీప్‌ఫేక్ భూతం..

సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతుందో, దాన్ని క్రిమినల్స్ అంతకంటే దారుణంగా వాడుకుంటున్నారు. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడటానికి కోర్టులు ప్రత్యేక ఆదేశాలు ఇస్తున్నా ఇలాంటి మార్ఫింగ్ రాయుళ్లు ఆగడం లేదు. కేవలం వ్యూస్ కోసం, డబ్బుల కోసం హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నారు.

రుక్మిణి క్రేజీ ప్రాజెక్ట్స్

ఇక కెరీర్ విషయానికొస్తే, రుక్మిణి వసంత్ చేతిలో ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రాకింగ్ స్టార్ యశ్ సరసన మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్'లో రుక్మిణి నటిస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా 'డ్రాగన్'లోనూ ఈమెనే హీరోయిన్‌గా చేస్తోంది.

వీటితో పాటు కోలీవుడ్ స్టార్ ధనుష్ 56వ సినిమాలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది రుక్మిణి వసంత్. ఇంతటి క్రేజ్ ఉన్న రుక్మిణి వసంత్‌పై ఇలాంటి సైబర్ అటాక్ జరగడం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More