Rukmini Vasanth: సైబర్ క్రైమ్ పోలీసులకు డ్రాగన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిర్యాదు- సాధారణ అమ్మాయిలకూ ముప్పేనంటూ!
Rukmini Vasanth Files Complaint To Cybercrime Police: జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన బికినీ డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో రుక్మిణి ఫిర్యాదు చేశారు. ఓ ఈవెంట్‌లో పాల్గొని రుక్మిణి వసంత్ ఘాటు కామెంట్స్ చేశారు.
Rukmini Vasanth Files Complaint To Cybercrime Police: సినిమా రంగంలో సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే స్థాయిలో సెలబ్రిటీల భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతున్న డీప్‌ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలానికి మరో యంగ్ హీరోయిన్ బలయ్యారు.

సైబర్ నేరగాళ్ల బారిన
'సప్తా సాగరదాచే ఎల్లో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కాంతార చాప్టర్ 1తో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. అయితే, తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు రుక్మిణి వసంత్.
ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఏఐ సాంకేతికతను ఉపయోగించి రుక్మిణి వసంత్ బికీనీలో ఉన్నట్లు కొన్ని అసభ్యకర ఫోటోలు, వీడియోలను సృష్టించారు. ఒక సినిమా షూటింగ్‌కి సంబంధించినవంటూ ఈ ఫేక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై రుక్మిణి వసంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాధారణ అమ్మాయిలకూ ముప్పే!
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఖండించడమే కాకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు రుక్మిణి వసంత్. బెంగళూరులోని అవంత్రా శారీ కలెక్షన్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న రుక్మిణిని మీడియా ప్రతినిధులు ఈ వివాదంపై ప్రశ్నించారు. అప్పుడు ఆమె స్పందిస్తూ..
"నేను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. మన సైబర్ క్రైమ్ విభాగం దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందనే నమ్మకం నాకుంది. ఇలాంటి దారుణాలు కేవలం నటీమణులకే కాదు, చాలా మంది సాధారణ అమ్మాయిలకూ ఎదురవుతున్నాయి. ఇది ఎంతమాత్రం చేయకూడని పని. ఏఐ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ దాన్ని మంచి పనుల కోసం మాత్రమే వాడాలి. ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదు" అని రుక్మిణి వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులకు ఎలాంటి శిక్ష పడాలనేది చట్టం, సైబర్ క్రైమ్ అధికారులు నిర్ణయిస్తారని, తాను బాధితురాలిగా తన బాధ్యతను పూర్తి చేసి ఫిర్యాదు ఇచ్చానని రుక్మిణి వసంత్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఘాటు ప్రకటన
దీనికి ముందు రుక్మిణి వసంత్ తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలలో ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆ ఫోటోలలో ఉన్నది తాను కాదని, అవన్నీ పూర్తిగా కృత్రిమంగా సృష్టించిన ఫేక్ ఫొటోలని స్పష్టం చేశారు. ఒకరి ప్రైవసీకి భంగం కలిగిస్తూ, ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు.
తన లీగల్ టీమ్ ఇప్పటికే సైబర్ క్రైమ్ యాక్షన్ ప్రారంభించిందని, దయచేసి ఎవరూ ఆ తప్పుడు ఫోటోలను షేర్ చేయవద్దని నెటిజన్లను కోరారు. గతంలో రష్మిక మందన్నా, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్, యశ్ సినిమాలతో బిజీ
ప్రస్తుతం రుక్మిణి వసంత్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారుతున్నారు. ఈ ఈవెంట్‌లో ఆమె తన రాబోయే చిత్రాల గురించి కూడా అప్‌డేట్స్ ఇచ్చారు. శాండల్‌వుడ్ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్' (Toxic) సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార వంటి భారీ తారాగణం ఉంది. దీనితో పాటు, తెలుగులో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న భారీ బడ్జెట్ చిత్రం 'డ్రాగన్' (Dragon) లోనూ రుక్మిణి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


