Kiara Advani Pregnant: 7 నెలల గర్భవతిగా కియారా అద్వానీ, ఫ్యాన్ చేసిన పనికి అంతా షాక్- రహస్య నిజాలు బయటపెట్టిన బాడీగార్డ్
Kiara Advani Shocking Fan Moment During Pregnancy: బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల బాడీగార్డ్ జీషన్ ఖురేషీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. కియారా ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురైన ఒక భయంకరమైన సంఘటనతో పాటు, వీరి రహస్య వివాహం గురించి సంచలన నిజాలు బయటపెట్టారు.
Kiara Advani Shocking Fan Moment During Pregnancy: సినీ తారలకు ఉండే క్రేజ్ ఒక్కోసారి వారికి శాపంగా మారుతుంటుంది. బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ కియారా అద్వానీ విషయంలో కూడా సరిగ్గా ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. కియరా అద్వానీ ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఒక బ్రాండ్ షూట్ కోసం వెళ్లగా, అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది.

కియారాను కౌగిలించుకునేందుకు
రిలయన్స్ కార్పొరేట్ టీమ్‌కు చెందిన ఒక వ్యక్తి, కియారా అద్వానీ తన వానిటీ వ్యాన్ నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా ఆమె దగ్గరకు వెళ్లి కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, వ్యాన్ వద్ద కాపలా ఉన్న బాడీగార్డ్ జీషన్ ఖురేషీ తక్షణమే స్పందించి అతడిని అడ్డుకున్నారు. సూట్ ధరించి, ఎంతో పద్ధతిగా ఉన్న ఆ వ్యక్తి అలా ప్రవర్తించడంతో భద్రతా సిబ్బంది విస్తుపోయారు.
ఈ క్రమంలో అక్కడ పెద్ద వాగ్వాదం జరగగా, చివరికి ఆకాష్ అంబానీ మేనేజర్‌కు ఫోన్ చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందని జీషన్ వివరించారు. "ఎంత చదువుకున్న వారైనా, హోదాలో ఉన్నవారైనా సెలబ్రిటీలను చూడగానే తమ నియంత్రణ కోల్పోతుంటారు" అని బాడీగార్డ్ జీషన్ ఖురేషీ తెలిపారు.
సిద్ధార్థ్ మల్హోత్రా ఆందోళన
భార్య భద్రత విషయంలో సిద్ధార్థ్ మల్హోత్రా ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కియారా ప్రెగ్నెంట్ కావడంతో ఆమెను షూటింగ్‌కు పంపడానికి ఆయన మొదట భయపడ్డారని జీషన్ వెల్లడించారు. తన భార్యకు అప్పటికే సెక్యూరిటీ ఉన్నప్పటికీ, సిద్ధార్థ్ వ్యక్తిగతంగా జీషన్‌ను పిలిచి ఆమె వెంటే ఉండాలని కోరారు. గర్భవతి కాబట్టి సాధారణ సమయం కంటే రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
జైసల్మేర్ పెళ్లి వెనుక 'సీక్రెట్ ఆపరేషన్'
ఇదిలా ఉంటే, 2023 ఫిబ్రవరిలో జరిగిన కియారా, సిద్ధార్థ్ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకను మీడియా కంట పడకుండా నిర్వహించడం వెనుక నాలుగు నెలల సుదీర్ఘ కసరత్తు ఉందని జీషన్ తెలిపారు. వివాహానికి ముందే జైసల్మేర్‌కు పలుమార్లు వెళ్లి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
డ్రోన్ల ద్వారా నిఘా ఉంచడమే కాకుండా, మీడియా కంట పడకుండా సిద్ధార్థ్ మల్హోత్రా స్వయంగా ప్రతి విషయాన్ని పర్యవేక్షించారని ఆయన చెప్పారు. "అనుకున్న వెంటనే ఫోన్ చేసి బుక్ చేసుకుని పెళ్లి చేసుకోలేదు, దీని వెనుక పక్కా ప్లానింగ్ ఉంది" అని జీషన్ స్పష్టం చేశారు. ఇలా కియారా అద్వానీ ప్రెగ్నెన్సీ సమయంలో జరిగిన షాకింగ్ ఘటనతోపాటు పెళ్లి వెనుక ఉన్న రహస్య నిజాలను బయటపెట్టారు బాడీగార్డ్ జీషన్ ఖురేషీ.
షెర్షా సెట్స్‌లో మొదలైన ప్రేమ
2021లో వచ్చిన 'షేర్షా' సినిమా సమయంలో సిద్ధార్థ్, కియారాల మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2023లో కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. గతేడాది జూలైలో వీరికి 'సరాయా' అనే కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


