Sidharth Malhotra Pookie: తలకు క్లిప్పుతో సిద్ధార్థ్ మల్హోత్రా- స్టార్ హీరోను పూకీ అంటున్న నెటిజన్స్- కారణం ఇదే!
Sidharth Malhotra Pookie: బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తన గర్ల్ డాడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కూతురు సరాయా మల్హోత్రాతో ముడిపడిన ఒక ముచ్చటైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాకుండా సిద్ధార్థ్ మల్హోత్రాను నెటిజన్స్ పూకీ అని పిలవడం ఆసక్తిగా మారింది.
Sidharth Malhotra Pookie: వెండితెరపై యాక్షన్ హీరోగా మెప్పించే సిద్దార్థ్ మల్హోత్రా, నిజ జీవితంలో మాత్రం తన ముద్దుల కూతురి దగ్గర సాఫ్ట్ డాడ్‌గా మారిపోయారు. గతేడాది భార్య కియారా అద్వానీతో కలిసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సిద్దార్థ్ 'గర్ల్ డాడ్' ఎరాకు సంబంధించిన ఒక క్యూట్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తలకి క్లిప్పుతో ముద్దుగా సిద్దార్థ్
బుధవారం (ఏప్రిల్ 15) ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఒక ఫోటో షేర్ చేశారు. అందులో సిద్ధార్థ్ తెల్లటి టీషర్ట్ ధరించి కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆయన తలకి పెట్టుకున్న చిన్న తెల్లటి 'బౌ' (Bow) క్లిప్పు.
"నేను ఒక గర్ల్ డాడ్ అని చెప్పకుండానే.. నేను ఒక గర్ల్ డాడ్ అని చెప్పండి" అంటూ ఈ ఫోటోకు సిద్ధార్థ్ మల్హోత్రా క్యాప్షన్ ఇచ్చారు. అంటే తన చిన్నారి కూతురు సరాయా తన తండ్రికి చేసిన మేకప్ ఇదని అర్థం. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆ అనుబంధాన్ని ఈ ఒక్క ఫోటోతో ఆయన చాటిచెప్పారు.
అభిమానుల సందడి
ఈ ఫోటో చూసిన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మా పూకీ మల్హోత్రా" అని కొందరు, "ప్రపంచంలోనే అత్యంత అందమైన తండ్రి" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. "ఈ స్టైలింగ్ క్రెడిట్స్ కచ్చితంగా సరాయా మల్హోత్రాకే దక్కుతాయి" అంటూ నెటిజన్లు మురిసిపోతున్నారు. సిద్దార్థ్ తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తండ్రిగా తన అనుభూతుల గురించి పోస్ట్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్లో సూపర్ స్టార్ ఆమే!
ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దార్థ్ మల్హోత్రా తన పితృత్వం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ప్రతిరోజూ ఉదయం నా కూతురికి మసాజ్ చేయడం ఇప్పుడు నా దినచర్యలో భాగమైంది. నా జీవితం ఆమె వచ్చిన తర్వాత ఎంతో అందంగా మారిపోయింది. మాట్లాడటం కూడా రాని ఒక చిన్నారి ముందు నేను ఇన్ని వాదనలు ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మా ఇంట్లో నేను హీరోను కాదు, మా పాప సరాయానే అసలైన సూపర్ స్టార్" అని సిద్ధార్థ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు.
కాగా.. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ 2023లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో అట్టహాసంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 'షేర్షా' సినిమా సమయంలో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం, గతేడాది జూలై 15న సరాయా రాకతో మరింత మధురంగా మారింది. ప్రస్తుతం ఈ జంట తమ కూతురి గోప్యతను కాపాడుతూనే, ఇలాంటి చిన్న చిన్న మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


