Rukmini Vasanth Bikini: బికినీలో కాంతార హీరోయిన్, రుక్మిణి వసంత్ ఫైర్- లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్!

Rukmini Vasanth About Bikini Photos: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన బికినీ ఫొటోలపై కాంతార చాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణి వసంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలను వైరల్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు.

Published on: May 23, 2026, 14:26:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rukmini Vasanth On Bikini Photos Deepfake: సెలబ్రిటీలను వేధిస్తున్న డీప్‌ఫేక్ మహమ్మారి రోజురోజుకూ ముదురుతోంది. గతంలో రష్మిక మందన్నా, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ ఏఐ మార్ఫింగ్ బారిన పడగా.. తాజాగా కన్నడ బ్యూటీ, కాంతార చాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు కూడా డీప్‌ఫేక్ సెగ తగిలింది.

బికినీలో కాంతార హీరోయిన్, రుక్మిణి వసంత్ ఫైర్- లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్!
బికినీలో కాంతార హీరోయిన్, రుక్మిణి వసంత్ ఫైర్- లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్!

రుక్మిణి వసంత్ ఫేక్ బికినీ ఫొటోలు

'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంతో దగ్గరైన ఈ కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫేక్ బికినీ ఫొటోలను కొందరు ఆన్‌లైన్‌లో వైరల్ చేశారు. తన డీప్‌ఫేక్ బికినీ ఫొటోలు, వీడియోలపై రుక్మిణి వసంత్ తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న సైబర్ ముఠాలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

నెట్టింట ఫేక్ ఫొటోల హంగామా.. రుక్మిణి ఆగ్రహం

శనివారం (మే 23) తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా రుక్మిణి వసంత్ ఒక సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన మార్ఫింగ్ ఫోటోల వెనుక ఉన్న నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

"నా పేరిట కొన్ని ఏఐ సృష్టించిన ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్లు మా టీమ్ గుర్తించింది. ఇవి పూర్తిగా కల్పిత చిత్రాలు. ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించడం, షేర్ చేయడం బాధ్యతారాహిత్యం. ఇది నా వ్యక్తిగత ప్రైవసీని తీవ్రంగా దెబ్బతీయడమే" అని రుక్మిణి వసంత్ తన నోట్‌లో రాసుకొచ్చారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

ఈ వ్యవహారాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, నకిలీ ఫోటోలను తయారు చేసిన వారిపై, వాటిని సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. అభిమానులు, నెటిజన్లు ఎవరూ కూడా ఆ ఫోటోలను షేర్ చేయవద్దని, వాటికి దూరంగా ఉండాలని రుక్మిణి విజ్ఞప్తి చేశారు.

గతంలోనూ సైబర్ వేధింపులు

రుక్మిణి వసంత్ ఇలా సైబర్ నేరగాళ్ల బారిన పడటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె పేరుతో నకిలీ ఫోన్ నెంబర్ క్రియేట్ చేసి ఇండస్ట్రీలోని పలువురిని మోసం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనూ రుక్మిణి వెంటనే అలర్ట్ అయ్యారు. సదరు ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ ఫోన్ నెంబర్ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు ఎవరూ రెస్పాండ్ అవ్వద్దని, అది సైబర్ నేరమని హెచ్చరిస్తూ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌పై కన్ను

ప్రస్తుతం రుక్మిణి వసంత్ కెరీర్ జోరుగా సాగుతోంది. గతేడాది తమిళంలో 'ఏస్', 'మద్రాసి' చిత్రాలతో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవల కన్నడ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 'కాంతార చాప్టర్ 1' చిత్రంలో హీరోయిన్‌గా నటించి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రాకింగ్ స్టార్ యశ్ సరసన 'టాక్సిక్' (Toxic) చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

ఎన్టీఆర్ డ్రాగన్‌లో రుక్మిణి

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్.. జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా డ్రాగన్‌లోనూ రుక్మిణి హీరోయిన్‌గా చేసింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన డ్రాగన్ గ్లింప్స్‌లో రుక్మిణి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కెరీర్ పరంగా ఇంతటి క్రేజీ లైనప్‌తో దూసుకుపోతున్న తరుణంలో రుక్మిణికి ఈ డీప్‌ఫేక్ వివాదం తలెత్తడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో ఎందుకు హెచ్చరిక జారీ చేశారు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి కొందరు తన నకిలీ, మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో రుక్మిణి తీవ్రంగా స్పందిస్తూ ఈ హెచ్చరిక జారీ చేశారు.

2. నకిలీ ఫోటోల వివాదంపై రుక్మిణి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

ఈ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించిన వారిపై, వాటిని ఇంటర్నెట్‌లో వ్యాప్తి చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

3. గతంలో రుక్మిణి ఎలాంటి సైబర్ మోసాన్ని ఎదుర్కొన్నారు?

గతంలో ఒక అపరిచిత వ్యక్తి రుక్మిణి వసంత్ పేరుతో నకిలీ ఫోన్ నంబర్ ఉపయోగించి పరిశ్రమకు చెందిన పలువురిని మోసం చేయడానికి ప్రయత్నించగా, ఆమె ఆ నంబర్‌ను బహిర్గతం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

4. జూనియర్ ఎన్టీఆర్‌తో రుక్మిణి చేయబోయే సినిమా ఏది?

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న క్రేజీ తెలుగు ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More