Sapthami Gowda: ఒకే మాటపై హీరోయిన్లు.. బాడీ పార్ట్స్ ను జూమ్ చేసి ఫొటోలు తీయొద్దన్న సప్తమి.. సపోర్ట్ గా ఆషికా, రుక్మిణి

Sapthami Gowda: హీరోయిన్లు ఒకే మాటపై నిలబడుతున్నారు. తమను అనుచితమైన యాంగిల్స్ లో, బాడీ పార్ట్స్ జూమ్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీయొద్దని గళం ఎత్తుతున్నారు. ఫస్ట్ ఈ కామెంట్లు చేసిన కన్నడ హీరోయిన్ సప్తమి గౌడకు ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్ సపోర్ట్ చేస్తున్నారు. 

Published on: Mar 4, 2026, 05:55:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ సంచలన కామెంట్లకు మద్దతు పెరుగుతోంది. హీరోయిన్లను బ్యాక్ సైడ్ నుంచి జూమ్ చేస్తూ బాడీ పార్ట్స్ పై ఫోకస్ పెట్టేలా ఫొటోలు, వీడియోలు తీయొద్దని సప్తమి గౌడ్ రిక్వెస్ట్ చేసింది. ఇలా ఇబ్బంది పెట్టే యాంగిల్స్ లో ఫొటోలు తీయడాన్ని ఖండించింది. ఇప్పుడు సప్తమి గౌడకు హీరోయిన్లు ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్, దివ్య సపోర్ట్ గా నిలిచారు.

సప్తమికి సపోర్ట్ గా హీరోయిన్లు
సప్తమికి సపోర్ట్ గా హీరోయిన్లు

హీరోయిన్ల సపోర్ట్

సప్తమి గౌడ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఆషికా రంగనాథ్, రుక్మిణి వసంత్, దివ్య తమ మద్దతు తెలిపారు. సప్తమి పోస్టును తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేశారు. ‘‘రెస్పెక్ట్ అనేది ఉండాలి. కావాలని తీసే జూమ్ ఇన్ ఫొటోలు, అనుచితమైన యాంగిల్స్ అగౌరవాన్ని కలిగిస్తాయి. ఇవి ఆమోదయోగ్యం కాదు’’ అని ఆషికా రంగనాథ్ పేర్కొంది.

హీరోయిన్ల ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు
హీరోయిన్ల ఇన్ స్టాగ్రామ్ స్టోరీలు

సప్తమి గౌడ పోస్ట్

మహిళా సెలబ్రిటీల వెనుక నుండి ఫోటోలు తీయడంపై సప్తమి గౌడ ఫైర్ అయింది. బయట ఈవెంట్లలో హీరోయిన్లను ఇలా అగౌరవపరిచేలా వీడియోలు, ఫొటోలు తీయడాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సప్తమి తీవ్రంగా ఖండించింది. అలాంటి కంటెంట్ ను సహించకూడదని పేర్కొంది.

"సినిమా ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులుగా మేం ఎప్పుడూ రిపీట్ అవుతున్న సమస్యను పరిష్కరించడానికి కలిసి నిలబడతాం. బయట ఈవెంట్లలో హీరోయిన్లను అనుచిత యాంగిల్స్ నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. మేం చేసే పనిపై ఫోకస్ చేయకుండా మా బాడీ పార్ట్స్ పై దృష్టి పెడుతూ జూమ్ చేసి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు’’ అని సప్తమి తన పోస్టులో పేర్కొంది.

సినిమా కోసం

‘‘కొద్దిమంది వ్యక్తులు ఇలా ప్రవర్తించడం సరికాదు. ఇది అగౌరవపరిచినట్లే. దీన్ని సహించేది లేదు. ఇది ఆమోదయోగ్యం కాదు. మేం యాక్టింగ్ చేయడం కోసమే ఇక్కడున్నాం. మేం సినిమా కోసమే పని చేస్తున్నాం. కావాలని జూమ్ చేసి ఫొటోలు తీయడాన్ని, అనుచితమైన యాంగిల్స్ లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈవెంట్ కు వచ్చే ఫొటోగ్రాఫర్లు తమ మర్యాదను పాటించాలని ఆశిస్తున్నాం’’ అని సప్తమి ఫైర్ అయింది.

సపోర్ట్ చేయాలని

‘‘లేడీస్ ను అసభ్యంగా క్యాప్చర్ చేసి, ప్రొజెక్ట్ చేసే విషయంలో క్రూరంగా వ్యవహరించే కొంతమందికి వ్యతిరేకంగా నిలవాలి. మాకు మీడియా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి. ఇది సరైన పద్ధతి కాదు. హీరోయిన్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అనుచితంగా ఫొటోలు తీసేవాళ్లను అడ్డుకోవాలి’’ అని సప్తమి గౌడ్ తన ఇన్ స్టా పోస్టులో పేర్కొంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More