Avika Gor TV: సినిమాల్లో షో పీస్‌లా ఉండలేను, మళ్లీ టీవీ సీరియళ్లలోకి రీ ఎంట్రీ.. తెలుగు హీరోయిన్ అవికా గోర్ కామెంట్స్
Avika Gor On TV Serials Re Entry: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌గా మారిన అవికా గోర్ సినిమాల్లో పాత్రల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం తెరపై కనిపించడం కోసం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని స్పష్టం చేసింది.
Avika Gor On TV Serials Re Entry: బుల్లితెరపై 'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన నటి అవికా గోర్. ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి వరస విజయాలు సాధించింది.

చిన్నారి పెళ్లి కూతురు కామెంట్స్
అయితే, గత కొంతకాలంగా పాత్రల ఎంపిక విషయంలో ఈ భామ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా తన కెరీర్, సినిమాల్లో నటించే పాత్రల గురించి బ్యూటిఫుల్ హీరోయిన్ అవికా గోర్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
సినిమాలో ఫర్నిచర్‌లా మారే ఉద్దేశం లేదు!
చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అవికా గోర్ తెలిపింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా తనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టులకే ఓటు వేస్తున్నట్లు పేర్కొంది.
నా సామర్థ్యాన్ని చూపించేలా
"ప్రేక్షకులు నా నుంచి ఎప్పుడూ మంచి నటనను ఆశిస్తారు. అందుకే సినిమాలో కేవలం ఒక 'ఫర్నిచర్'లా లేదా షోపీస్‌లా మిగిలిపోయే పాత్రలను నేను చేయలేను. ఒక నటిగా నా సామర్థ్యాన్ని చూపించేలా, కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటాను. కథల ఎంపిక విషయంలో ఇకపై కూడా చాలా కఠినంగా ఉంటాను" అని అవికా గోర్ స్పష్టం చేసింది.
మన తెలుగు చిత్రసీమలోనూ హీరోయిన్లకు కేవలం పాటలకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితిపై గతంలో అనేక చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అవికా గోర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
'ఖత్రోన్ కే ఖిలాడీ 15'లో సందడి
ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సాహసాల ఓటీటీ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' ద్వారా అవికా గోర్ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. గతంలో 2019లో వచ్చిన సీజన్ 9లో పాల్గొన్న ఆమె, ఈసారి అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.
ఈ ఓటీటీ షో మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టమైనప్పటికీ, సీజన్ 9తో పోలిస్తే ఈసారి ఎదుర్కొంటున్న స్టంట్లు తనకు పెద్దగా భయం కలిగించలేదని ఆమె చెప్పింది. భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ, ఆగస్టు 7న విడుదల కానున్న ఒక పంజాబీ మ్యూజిక్ వీడియోలో తాను నటించినట్లు వెల్లడించింది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
దీనితో పాటు మళ్లీ టీవీ సీరియళ్లలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది అవికా గోర్. సరైన సమయం వచ్చినప్పుడు ఆ వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపింది. ప్రస్తుతం 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' కలర్స్ టీవీతో పాటు జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
టీవీ సీరియళ్లలోకి రీ ఎంట్రీ
అలాగే, ఇటీవల అగ్లీ స్టోరీ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది అవికా గోర్. ఇందులో హీరోగా నందు చేశాడు. తెలుగు సైకలాజికల్ బోల్డ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అగ్లీ స్టోరీ సినిమాకు 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ వచ్చింది. అగ్లీ స్టోరీ సినిమా కూడా జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. సినిమాలతో అలరించిన అవికా గోర్ ఇప్పుడు మళ్లీ టీవీ సీరియళ్లలోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


