Yash Rishab Shetty: రావణుడిగా యశ్ నటన చూసి కళ్లు తేలేశాను.. మాటలు రావడం లేదు.. కన్నడిగుల గర్వకారణం యశ్: రిషబ్ శెట్టి
Yash Rishab Shetty: రామాయణ మూవీ ట్రైలర్ లో రావణుడిగా యశ్ నటనను చూసి మరో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఫుల్ ఫిదా అయిపోయాడు. ఓ కన్నడిగుడిగా యశ్ తమకు ఓ గర్వకారణమని అన్నాడు. అతడు స్క్రీన్ పై ఉన్నంతసేపూ కళ్లు పెద్దవి చేసి చూసినట్లు తెలిపాడు.
Yash Rishab Shetty: నేషనల్ అవార్డ్ విన్నర్, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి రాకింగ్ స్టార్ యశ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఎపిక్ విజువల్ వండర్ 'రామాయణం' (Ramayana) ట్రైలర్ ఈరోజు (జులై 30) తెల్లవారుజామున 4:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో విడుదలవుతూనే డిజిటల్ ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ట్రైలర్‌లో రావణాసురుడిగా యశ్ చూపించిన రాయల్ అవతార్ చూసి రిషబ్ శెట్టి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

మనోహరమైన విజువల్స్, అద్భుతమైన నటీనటుల ప్రదర్శనతో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
ఇతిహాసాలను నమ్మించడమంటే సామాన్యమైన విషయం కాదు
రిషబ్ శెట్టి తన ఎక్స్ ఖాతాలో రాస్తూ, "మన ఇతిహాసాలు, పౌరాణిక పాత్రలతో ప్రజలను మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. చిన్నప్పటి నుంచి ఈ కథలను వింటూ పెరిగిన మనందరికీ మన మనస్సుల్లో కొన్ని ప్రత్యేకమైన ఊహలు ఉంటాయి. అలాంటిది ప్రతి ఒక్కరినీ నమ్మించేలా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన డైరెక్టర్ నితీష్ తివారీ, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రాలకు నా హాట్సాఫ్" అని కొనియాడారు.
ఇంతటి ప్రతిష్టాత్మక ఇతిహాసంలో పాత్రలు పోషించేటప్పుడు నటీనటులపై ఎంత భారం, ఒత్తిడి ఉంటుందో ఒక యాక్టర్‌గా తాను అర్థం చేసుకోగలనని రిషబ్ పేర్కొన్నారు. సినిమాలో నటించిన రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్ తమ పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారని అభినందించారు.
"యశ్ ప్రతీ షాట్‌లో నా కళ్లు పెద్దవయ్యాయి!"
రాకింగ్ స్టార్ యశ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేటప్పుడు రిషబ్ శెట్టి తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. "రణ్‌బీర్ కపూర్, బ్రదర్.. శ్రీరాముడి దివ్యత్వం, ఆరాను నువ్వు తెరపై అద్భుతంగా పండించావు. ఇక యశ్ సర్.. ట్రైలర్‌లో మీ ప్రతీ షాట్ వస్తున్నప్పుడు నా కళ్లు పెద్దవి చేస్తూ అలా చూస్తుండిపోయాను. రావణాసురుడి పాత్రకి మీ కంటే మెరుగ్గా ఎవరూ న్యాయం చేయలేరు. మీ నటన గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. ఒక కన్నడిగుడిగా మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం" అని రిషబ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యశ్, ఈ సినిమాలో లంకేశ్వరుడిగా కనిపిస్తున్న తీరు నెక్స్ట్ లెవెల్‌లో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆస్కార్ రేంజ్ మ్యూజిక్ - విజువల్ వండర్!
ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని ప్రతీ ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసిందని రిషబ్ తెలిపారు. ప్రతీ ఎమోషన్‌ను తమ సంగీతంతో వారు అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. డీఎన్ఈజీ (DNEG) ప్రొడక్షన్ హౌస్ అందించిన వీఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి.
రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం 'రామాయణం: పార్ట్ 1' ఈ ఏడాది నవంబర్ 8న దివాళీ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. రెండో భాగం 2027లో విడుదల కాబోతోంది. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్, సీతగా సాయి పల్లవి కనిపిస్తున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


