AI Heroine: ఇక హీరోయిన్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా? ప్రపంచంలోనే తొలిసారి AI హీరోయిన్ మూవీ-వణికిస్తున్న మిస్అలైన్డ్
AI Heroine: భవిష్యత్తులో నటీనటుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీప్లేస్ చేస్తుందా? అనే చర్చ నిజం కాబోతోంది. 2025లో సంచలనం సృష్టించిన వర్చువల్ నటి ‘టిల్లీ నార్వుడ్’ ఇప్పుడు ‘మిస్అలైన్డ్’ అనే పూర్తి నిడివి హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్‌లో నటిస్తోంది. ఈ సరికొత్త ప్రయోగం వెనుక ఉన్న అసలు కథేంటి?
AI Heroine: సినిమా రంగంలో సాంకేతికత ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. కానీ, ఈసారి ఏకంగా మనుషుల ఉనికినే ప్రశ్నించేలా సరికొత్త విప్లవానికి తెరలేపింది హాలీవుడ్. ప్రముఖ డిజిటల్ ఏఐ నటి టిల్లీ నార్వూడ్ (Tilly Norwood AI actress) ఇప్పుడు ఒక పూర్తి స్థాయి వెండితెర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఏఐ హీరోయిన్ సంచలనం
సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కామన్. మూవీస్ లో హీరోయిన్ కావాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ ఇప్పుడా హీరోయిన్ల రోల్స్ కే ముప్పు తెచ్చేలా ఏఐ హీరోయిన్ టిల్లీ నార్వూడ్ రెడీ అయింది.
‘పార్టికల్ 6’ అనే ఏఐ-ఫోకస్డ్ స్టూడియో నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా 'మిస్అలైన్డ్' (Misaligned) సినిమాలో టిల్లీ నార్వూడ్ హీరోయిన్. ఇప్పుడు ఈ సినిమా సంచలనంగా మారింది.
ఏంటి ఈ ‘మిస్అలైన్డ్’ సినిమా కథ?
ఇది క్లౌడ్‌లో ఉండే ఒక డిజిటల్ ప్రపంచం ‘టిల్లీవర్స్’ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్నమైన కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా.
- స్టోరీ: నిజమైన శరీరం, బాల్యం లేదా ఎలాంటి సొంత జీవిత అనుభవాలు లేని ఒక ఏఐ జీవి (టిల్లీ) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇంటర్నెట్‌లోని డేటా ఆధారంగానే ఆమె ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంది.
- ట్విస్ట్: డార్క్ వెబ్‌కు చెందిన ఒక మోసపూరితమైన రోగ్ బాట్ ఆమె డిజిటల్ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. దాని మాటలు విని టిల్లీ తనకున్న నిబంధనలను బ్రేక్ చేసి, మనుషుల లాగా కోరికలు, ఎమోషన్స్‌ను పెంచుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఒక ఏఐ రూపం హ్యూమన్‌గా మారే క్రమంలో ఎదురయ్యే గందరగోళమే ఈ సినిమా.
హాలీవుడ్ యూనియన్ల ఆగ్రహం
2025 చివర్లో టిల్లీ నార్వుడ్‌ను ఒక ప్రముఖ యాక్టింగ్ ఏజెన్సీ సైన్ చేయబోతోందని తెలిసినప్పుడు హాలీవుడ్ నటీనటులు, రైటర్ల అసోసియేషన్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశాయి. గ్రాఫిక్స్, డబ్బింగ్ దాటి ఏకంగా నటుల స్థానాలనే ఏఐ మింగేస్తే జూనియర్ ఆర్టిస్టులు, స్టార్ల పరిస్థితి ఏంటనే భయం మొదలైంది.
టాలీవుడ్‌కు ముప్పు ఉందా?
ప్రస్తుతం ఈ ట్రెండ్ హాలీవుడ్‌లోనే ఉన్నా.. రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా, ముఖ్యంగా భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లోనూ కాస్ట్ కటింగ్ కోసం ఇలాంటి ఏఐ నటీనటులను వాడే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు హీరో, హీరోయిన్ల కెరీర్ కు ముప్పు తప్పదనే చెప్పొచ్చు.
ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ఏఐ హీరోయిన్ టిల్లీ మూవీ ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక ఏఐ నటి థియేటర్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


