Pavan Sadineni Arrest: నటికి లైంగిక వేధింపులు- దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్- రిమాండ్!
Pavan Sadineni Arrest Actress Complaint: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ దర్శకుడు పవన్ సాధినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో సినిమా చేస్తుండగా ఈ ఘటన జరగడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Pavan Sadineni Arrest Actress Complaint: తెలుగు చిత్రసీమలో ఓ యంగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అతనే డైరెక్టర్ పవన్ సాధినేని. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న పవన్ సాధినేని వివాదాస్పద రీతిలో పోలీసులకు చిక్కారు. వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తనను మోసం చేశాడంటూ ఓ నటి పోలీసులను ఆశ్రయించింది.

రిమాండ్ విధించిన కోర్టు
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, పవన్ సాధినేనిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా లైంగిక వేధింపుల కేసు కూడా పవన్ సాధినేనిపై నమోదు అయినట్లు సమాచారం. విభిన్నమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రతిభావంతమైన దర్శకుడు ఈ విధంగా అరెస్ట్ కావడం ఫిలింనగర్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
యూట్యూబ్ నుంచి టాలీవుడ్ దాకా..
పవన్ సాధినేని కెరీర్ ప్రారంభం నుంచి ఎంతో ఆసక్తికరంగా సాగింది. చాలామంది ఉత్సాహవంతులైన యువకుల మాదిరిగానే ఆయన మొదట యూట్యూబ్ వేదికగా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 'ఇంటర్వ్యూ', 'లవ్ ఫార్ములా 31', 'బేవార్స్' వంటి షార్ట్ ఫిల్మ్స్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
దాదాపు 10 షార్ట్ ఫిల్మ్స్‌కు దర్శకత్వం వహించిన అనుభవంతో 2013లో 'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు పవన్ సాధినేని. హర్షవర్ధన్ రాణే, శ్రీవిష్ణు, హరీశ్ వర్మ, రీతూ వర్మ, శ్రీముఖి, వితికా షెరు వంటి మంచి తారగణంతో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆ తర్వాత నారా రోహిత్‌తో 'సావిత్రి' సినిమా తీశారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో పవన్ తెరకెక్కించిన 'సేనాపతి' చిత్రం విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ మాధ్యమంలోనూ తన ముద్ర వేశారు పవన్ సాధినేని.
ఓటీటీ సిరీసులు, దుల్కర్ సల్మాన్ సినిమా మధ్యలోనే ట్విస్ట్
'పిల్', 'ఈ-ఆఫీస్‌లో', 'కమిట్‌మెంటల్', జేడీ చక్రవర్తితో తీసిన 'దయా' వంటి వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ప్రస్తుతం పవన్ సాధినేని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా 'ఆకాశంలో ఒక తార' అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పూజా హెగ్డే, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా
ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రుతి హాసన్, సాత్విక వీరవల్లి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఆకాశంలో ఒక తార సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి.
ఇలా కెరీర్ పరంగా ఎంతో కీలకమైన దశలో ఉన్న సమయంలో పవన్ సాధినేని అరెస్ట్ కావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసుపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేశారు.
ఆ నటి ఎవరంటే?
రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నటి పేరు జి.జి. (G.G) అని గ్రోక్ బయటపెట్టింది. నటి పేరు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


