Shruti Haasan Home: కొత్త ఇల్లు కొన్న శ్రుతి హాసన్- తల్లిదండ్రులు లేకుండానే గృహప్రవేశం- సాంప్రదాయబద్ధంగా హీరోయిన్ ఫొటోలు
Shruti Haasan Grihapravesh In New Home: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కొత్త ఇల్లు కొనుక్కున్నారు. సొంతూరు చెన్నైలో ఆమె ఒక సరికొత్త నివాసాన్ని కొనుగోలు చేసి, సోమవారం సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో గృహప్రవేశం చేశారు. అయితే, ఈ పూజలో శ్రుతి హాసన్ తల్లిదండ్రులు హాజరు కాకపోవడం గమనార్హం.
Shruti Haasan Grihapravesh In New Home: వైవిధ్యమైన నటనతోనే కాకుండా సింగర్‌గా, మ్యుజీషియన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, తన స్వయంకృషితోనే స్టార్ హోదాను దక్కించుకున్నారు.

సొంతూరులో సొంతిల్లు
కెరీర్ పరంగా ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా చెన్నై నగరంలో సరికొత్త సొంతింటి కలని నిజం చేసుకున్నారు. తన సొంత ఊరు, కుటుంబానికి మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే శ్రుతి హాసన్ సరికొత్తగా ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది. సోమవారం (జూలై 13) జరిగిన శ్రుతి హాసన్ నూతన గృహప్రవేశ వేడుకకు సంబంధించిన కొన్ని ప్రత్యేక క్షణాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.
చెన్నైలో సాంప్రదాయ పూజలతో కొత్త అధ్యాయం
కొత్త ఇంట్లో శ్రుతి హాసన్ నేలపై కూర్చుని ఎంతో భక్తిశ్రద్ధలతో గృహప్రవేశ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజకు సిద్ధం చేసిన నోరూరించే మిఠాయిలు, కొత్త ఇంటి తాళంచెవుల ఫోటోలను అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి.
"శ్రుతి హాసన్ తన జీవితంలో ఒక అద్భుతమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలోని తన సరికొత్త ఇంట్లో ఆత్మీయుల ప్రేమ, ఆశీర్వాదాల మధ్య సాంప్రదాయబద్ధంగా గృహప్రవేశ పూజలు నిర్వహించారు" అని సదరు ఫోటోల కింద పాపరాజీ పేజీలు క్యాప్షన్లు పెడుతూ అభినందనలు కురిపించాయి. అయితే, ఈ గృహ ప్రవేశానికి శ్రుతి తల్లిదండ్రులు ఎవరు లేకపోవడం గమనార్హం.
ముంబై 'గోథిక్' హోమ్‌కు భిన్నంగా..
ఈ కొత్త ఇల్లు ఇలా సాంప్రదాయబద్ధంగా ఉంటే.. ముంబైలోని శ్రుతి హాసన్ పాత నివాసం మాత్రం పూర్తిగా భిన్నమైన వెస్ట్రన్ శైలిలో ఉంటుంది. గత ఏడాది ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ ముంబైలోని శ్రుతి ఇంటిని సందర్శించినప్పుడు ఆ విశేషాలను ఒక వీడియో ద్వారా పంచుకున్నారు.
గోథిక్, రస్టిక్ థీమ్‌తో ఉండే ఆ ఇల్లు శ్రుతి మ్యూజిక్ టేస్ట్‌ను, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మూడు భాగాలుగా విడిపోయిన ఆ లివింగ్ రూమ్‌లో మ్యూజిక్ రూమ్, సిట్టింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ ఉన్నాయి. రంగులు వేయని రాతి గోడలు, ఎత్తైన పైకప్పులు, సహజసిద్ధమైన వెలుతురు వచ్చేలా పెద్ద కిటికీలు ఆ ఇంటి ప్రత్యేకత.
వింత వస్తువులు
ముంబై ఇంట్లో శ్రుతి తన ప్రపంచ పర్యటనల్లో సేకరించిన వింత వస్తువులను దాచుకున్నారు. వాటిలో తన తండ్రి కమల్ హాసన్ బహుమతిగా ఇచ్చిన ఒక విలక్షణమైన చాకు (కత్తి), వివిధ దేశాల నుంచి తెచ్చిన బాతుల బొమ్మలు, యానిమే ఫిగర్స్, డిస్కో బాల్స్ ఉన్నాయి.
శృతి హాసన్ మ్యూజిక్ స్పేస్‌లో గ్యాస్ మాస్క్‌తో అలంకరించిన గిటార్, పియానో ఉన్నాయి. ఆ విశాలమైన వంటగదిలో వంట చేయడం, లివింగ్ రూమ్‌లో మ్యూజిక్ కంపోజ్ చేయడం శ్రుతికి ఎంతో ఇష్టమని తెలిపారు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా శృతి హాసన్
కెరీర్ విషయానికి వస్తే శ్రుతి హాసన్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. 2025లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన రజనీకాంత్ చిత్రం 'కూలీ'లో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఈ ఏడాది బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ నటించిన 'ఆకాశంలో ఒక తార', 'ట్రైన్' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
కమల్ హాసన్ సినిమాలు
మరోవైపు ఆమె తండ్రి కమల్ హాసన్ గతేడాది మణిరత్నం 'థగ్ లైఫ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు రజనీకాంత్-నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చెన్నైలో కొత్త ఇల్లు కొనుగోలు చేయడంతో శ్రుతి హాసన్ తన షూటింగులను, వ్యక్తిగత జీవితాన్ని మరింత సులువుగా ప్లాన్ చేసుకోనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


