Shruti Haasan: పబ్లిక్ లో ‘మమ్మా’ అని పిలిచిన ఫొటోగ్రాఫర్.. నేను మీ అమ్మనా? అంటూ శ్రుతి హాసన్ ఫైర్ .. వీడియో వైరల్
Shruti Haasan: శ్రుతి హాసన్ ఫైర్ అయింది. ఫొటోగ్రాఫర్ పై విరుచుకుపడింది. హీరోయిన్ ను అతను ‘మమ్మా’ అని పిలవడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Shruti Haasan: ముంబైలోని ఒక రెస్టారెంట్ నుంచి శ్రుతి హాసన్ బయటకు వస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు ఆమెను క్లిక్ మనిపించేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను ఉద్దేశించి "మమ్మా" అని పిలిచారు. ఆ పిలుపు వినగానే శృతి ఒక్కసారిగా ఆగిపోయి, తీవ్రమైన కోపానికి గురైంది.

శ్రుతి హాసన్ ఫైర్
ఫొటోగ్రాఫర్ పై శ్రుతి హాసన్ ఫైర్ అయింది. ఆ వ్యక్తి వైపు తిరిగి.. "ఎవరు మమ్మా? మీ అమ్మనా నేను? ఏం మాట్లాడుతున్నావు అసలు?" అని హిందీలో (కౌన్ హై మమ్మ? ఆప్కీ మమ్మ హై? క్యా బాత్ కర్ రహే హో తుమ్?) అని శ్రుతి ఘాటుగా సమాధానమిచ్చింది.
వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు శ్రుతి స్పందన సరైనదే అని సమర్థిస్తుంటే, మరికొందరు ఆమె అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
ఇంటర్నెట్ రియాక్షన్
మెజారిటీ నెటిజన్లు శ్రుతి హాసన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా, వారితో అతి చనువు ప్రదర్శించే పాపరాజ్జీల తీరును తప్పుపడుతున్నారు. "ఆమెను మమ్మా అని పిలవాల్సిన అవసరం ఏముంది? ఆమె సీరియస్ అవ్వడంలో తప్పు లేదు" అని ఒకరు కామెంట్ చేయగా, "ఈ పాపరాజ్జీలకు అసలు మర్యాద తెలియదు" అని మరొకరు మండిపడ్డారు.
ఎందుకా కోపం?
అయితే, శ్రుతి హాసన్ ఇంతలా కోప్పడాల్సిన పని లేదని కొందరు వాదిస్తున్నారు. సెలబ్రిటీలను సరదాగా పిలిచే క్రమంలో ఇలాంటి పదాలు వాడుతుంటారని, దానికి ఇంత ఘాటుగా సమాధానం ఇవ్వక్కర్లేదని మరికొందరు అంటున్నారు. గతంలోనూ జయా బచ్చన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
శ్రుతి హాసన్ సినిమాలు
ప్రస్తుతం శ్రుతి హాసన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. దుల్కర్ సల్మాన్ సరసన 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీటితో పాటు ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్: పార్ట్ 2' లో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


