Prabhas: అల్లు సినిమాస్‌లో ధురంధర్ 2- సందీప్ వంగాతో కలిసి చూసిన ప్రభాస్- రాత్రి 3 గంటలకు ఫ్యాన్స్- వీడియోలు వైరల్
Prabhas: అల్లు సినిమాస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి డార్లింగ్ వచ్చాడు. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధురంధర్ 2 సినిమాను చూశాడు. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ రాత్రి 3 గంటలకు వెయిట్ చేయడం తెగ వైరల్ గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 అదరగొడుతోంది. ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీ చూశాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి అల్లు సినిమాస్ లో సినిమా వీక్షించాడు.

సందీప్ తో ప్రభాస్
సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి అల్లు సినిమాస్ లో ధురంధర్ 2 చూడటం వైరల్ గా మారింది. వీళ్లకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మూడు గంటలకు
అల్లు సినిమాస్ లోకి ప్రభాస్ వెళ్లడం, మూవీ చూడటం, అక్కడి నుంచి బయటకు రావడం.. ఇలా వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ అల్లు సినిమాస్ కు వచ్చాడనే విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ రాత్రి 3 గంటల వరకు అక్కడే ఉన్నారు. ప్రభాస్ ను చూసేందుకు గేటు బయట వేచి చూశారు.
స్పిరిట్ గురించి
ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటిస్తున్నాడు. స్పిరిట్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి చేస్తోంది. ఈ సినిమాను మార్చి 5, 2027న రిలీజ్ చేయనున్నారు.
ప్రభాస్ జోరు
2026 సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ మూవీతో థియేటర్లకు వచ్చాడు ప్రభాస్. కానీ ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ అంచనాలు అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనే మరో మూవీ రిలీజ్ చేసేందుకు ప్రభాస్ ప్లాన్స్ చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం అతను హీరోగా నటిస్తున్న ఫౌజీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
అప్పుడే రిలీజ్
హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను 2026 డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇది కాకుండా ప్రభాస్ లైనప్ లో సలార్ 2 కూడా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ టైమ్ సెట్ చేసుకుని మరీ ధురంధర్ 2 చూడటం విశేషం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


