ఎక్స్‌క్లూజివ్‌.. సందీప్ రెడ్డి వంగాతో గొడవ.. స్పిరిట్ గురించి ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్లు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నాడనే వార్తలు వస్తున్నాయి. సందీప్ తో ప్రకాష్ రాజ్ గొడవ పడ్డాడనే పుకార్లు వినిపించాయి. దీనిపై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్లు చేశాడు. 

Published on: Feb 9, 2026, 13:42:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' మూవీ మొదటి నుంచి వార్తల్లోనే ఉంది. హీరోయిన్ గా దీపికా పదుకొణెను తప్పించి త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. దీపికాపై వేటు వివాదం కొంతకాలం పాటు నడించింది. ఇప్పుడేమో ప్రకాష్ రాజ్ ను తప్పించారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై ప్రకాష్ రాజ్ స్పందించాడు.

ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి వంగా
ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి వంగా

అర్థం లేని పుకార్లు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో విభేదాల కారణంగా స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నాడనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై హిందూస్థాన్ టైమ్స్ ప్రకాష్ రాజ్ ను సంప్రదించింది. ఈ ఊహాగానాలను ప్రకాష్ రాజ్ కొట్టిపడేశాడు. ‘‘ఇవి అర్థం లేని పుకార్లు. నాకు దీని గురించి ఏమీ తెలియదు' అని క్లారిటీనిచ్చాడు. స్పిరిట్ మూవీలో నటిస్తున్నట్లు కన్ఫామ్ చేశాడు.

సందీప్ తో విభేదాలు

స్పిరిట్ సినిమా చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఏమో హీరోయిన్ గా దీపికా పదుకొణెను అనుకున్నారు. కానీ పని గంటల డిమాండ్ కారణంగా ఆమెను తప్పించి, త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడేమో మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో క్రియేటివ్ విభేదాల కారణంగా నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక సీన్ షూటింగ్, స్క్రిప్ట్ తీరుపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేసి షూటింగ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారని పుకార్లు వినిపిస్తున్నాయి. వీటిపై ప్రకాష్ రాజ్ క్లారిటీనిచ్చాడు.

ఆడియో స్టోరీ

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ స్పిరిట్. ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే మూవీపై అంచనాలు మొదలయ్యాయి. ఇక 2025 అక్టోబర్ లో ఆడియో స్టోరీ అని స్పిరిట్ టీమ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇందులో కేవలం వాయిస్ మాత్రమే వినిపించింది.

స్పిరిట్ సౌండ్ స్టోరీలో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ వినిపించింది. దాని ప్రకారం ప్రభాస్ ఐపీఎస్ గా నటిస్తున్నాడని అర్థమైంది. అలాగే ప్రకాష్ రాజ్ జైలు సూపరింటెండెంట్ గా నటిస్తున్నాడనే క్లారిటీ వచ్చింది. లాస్ట్ ఈయర్ డిసెంబర్ లో రిలీజైన ఫస్ట్ లుక్ కూడా స్పిరిట్ పై హైప్ పెంచేసింది.

రిలీజ్ డేట్

ప్రభాస్ స్పిరిట్ సినిమాను మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, త్రిప్తి డిమ్రి, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు నటిస్తున్నారు. స్పిరిట్ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More