Prabhas Fauzi Look: ఫౌజీ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. వింటేజ్ గెటప్‌లో రెబల్ స్టార్ మాస్ రాంపేజ్!

Prabhas Fauzi Look: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా చేస్తున్నాడు. అయితే సెట్స్ నుంచి ప్రభాస్ వింటేజ్ లుక్ లీక్ అయిందంటూ ఓ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

Published on: Apr 4, 2026, 17:57:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. రెబల్ స్టార్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో 'ఫౌజీ' ఒకటి. 'సీతారామం' వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిందంటూ ఓ ఫొటో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

ఫౌజీ పోస్టర్ లో ప్రభాస్
ఫౌజీ పోస్టర్ లో ప్రభాస్

వింటేజ్ లుక్‌లో ప్రభాస్

ఈ లీక్డ్ ఫోటోలో ప్రభాస్ గతంలో ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. ఫౌజీ సినిమా 1940ల నాటి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. దీంతో ప్రభాస్ గెటప్ పూర్తిగా వింటేజ్ స్టైల్‌లో ఉంది. మందపాటి మీసం, ట్రిమ్ చేసిన హెయిర్ స్టైల్, రెట్రో దుస్తుల్లో డార్లింగ్ లుక్ చూస్తుంటే 'మిర్చి' రోజులు గుర్తుకొస్తున్నాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ముఖ్యంగా యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ కావడంతో, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంటర్నెట్ షేక్

ఫౌజీ సినిమా నుంచి ప్రభాస్ లీక్ ఫొటో ఇదేనంటూ ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో రచ్చ చేస్తున్నారు. లుక్ అదిరిపోయిందని, బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏం ప్లాన్ చేశావ్ హను రాఘవపూడి, బాక్సాఫీస్ ను తగలబెట్టేస్తారా? ఏంటీ అని కామెంట్లు చేస్తున్నారు.

ఏఐ ఫొటోనా?

అయితే కొంతమంది మాత్రం ఇది ప్రభాస్ ఫౌజీ లుక్ కాదని వాదిస్తున్నారు. ఇది ఎడిట్ చేసిన ఫొటో అని, ఏఐతో క్రియేట్ చేశారని పోస్టులు పెడుతున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తేనే ఓ క్లారిటీ అనేది వస్తుంది.

భారీ బడ్జెట్‌తో పీరియడ్ డ్రామా

మైత్రీ మూవీ మేకర్స్ ఫౌజీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. స్వాతంత్య్రనికి పూర్వం జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను హను రాఘవపూడి మలిచినట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే ఒక సైనికుడిగా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. రజాకార్ల ఉద్యమం లేదా ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులను కూడా సినిమాలో టచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

జోరుగా షూటింగ్

ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లలో శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్‌కు జోడీగా ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పూజా కార్యక్రమాల ఫోటోలు, చిన్న గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ లీక్డ్ ఫోటోతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఫౌజీ సినిమాను 2026లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని అంటున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More