Harish Shankar: తొలిసారి తన పాటలనే రీమిక్స్ చేస్తున్న పవన్-ఉస్తాద్ భగత్ సింగ్‌లో రెండు క్లాసిక్ హిట్స్-హరీష్ శంకర్ లీక్
Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. ఫస్ట్ టైమ్ పవన్ కల్యాణ్ లో సినిమా కోసం ఆయన సాంగ్సే రీమిక్స్ చేశామని లీక్ చేశాడు. అంతే కాకుండా ఓ సర్ ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు టైమ్ దగ్గరపడింది. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కల్యాణ్ సినిమాలో తొలిసారి ఆయన పాటలే రీమిక్స్ చేసినట్లు లీక్ చేశాడు.

హరీష్ శంకర్
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ తీసిన రెండో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దీన్ని పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా హరీష్ తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
స్పెషల్ లీక్
రీమిక్స్ పార్ట్ ఏందో ఉందంట కదా మూవీలో అని హరీష్ శంకర్ ను హోస్ట్ ప్రశ్నించాడు. ‘‘నేనేదో మీకు స్పెషల్ గా లీక్ చేద్దామంటే మీరే అడిగారు. పవన్ కల్యాణ్ సినిమా సాంగ్స్ ను చాలా మంది తమ మూవీస్ కోసం రీమిక్స్ చేసుకున్నారు. ఆయనకు కూడా మ్యూజిక్ పై మంచి పట్టుంది’’ అని హరీష్ శంకర్ చెప్పాడు.
సాంగ్స్ రీమిక్స్
‘‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఈ రేయి తీయనది పాటలను ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రీమిక్స్ చేశాం. పవన్ కల్యాణ్ సినిమాలో పవన్ కల్యాణ్ సాంగ్స్ రీమిక్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. దాని తాలూకా హింట్ మొన్న ఇచ్చిన ట్రైలర్ లో ఉంది. మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది’’ అని హరీష్ శంకర్ వెల్లడించాడు.
డ్యాన్స్ బిట్
వేరే వేరే హీరోల డ్యాన్స్ లు పవన్ చేసినట్లు ఓ డ్యాన్స్ బిట్ ఉందని తెలిసిందని హోస్ట్ మరో ప్రశ్న అడిగాడు. ‘‘డ్యాన్స్ బిట్ అని కాదు కానీ. పవన్ కల్యాణ్ వాకింగ్ పైనే ఓ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద తానే సెటైర్ వేసుకోవడం పవన్ కల్యాణ్ గొప్పతనం. ఈ సీక్వెన్స్ సర్ ప్రైజింగ్ గా ఉండబోతుంది’’ అని హరీష్ శంకర్ చెప్పాడు.
ఉస్తాద్ భగత్ సింగ్
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది కానుకగా మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ఇందులో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


