Romanchakam OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన సందీప్ రెడ్డి వంగా బడ్డీ కామెడీ మూవీ.. రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Romanchakam OTT Streaming Details: ఓటీటీలోకి నిన్న థియేటర్లలో విడుదలైన బడ్డీ కామెడీ రొమాంటిక్ మూవీ రోమాంచకం రానుందనే వార్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో, సుమంత్ ప్రభాస్ హీరోగా చేశాడు. మరి ఈ రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 4, 2026, 14:45:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Romanchakam OTT Release Details: 'మేమ్ ఫేమస్' చిత్రంతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన సరికొత్త రొమాంటిక్ బడ్డీ కామెడీ ఎంటర్‌టైనర్ 'రోమాంచకం'.

ఓటీటీలోకి నిన్న రిలీజైన సందీప్ రెడ్డి వంగా బడ్డీ కామెడీ మూవీ.. రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన సందీప్ రెడ్డి వంగా బడ్డీ కామెడీ మూవీ.. రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్

'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడంతో విడుదలకి ముందే రోమాంచకం మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 3న అంటే నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సమయంలోనే రోమాంచకం ఓటీటీ వివరాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

సుమంత్ ప్రభాస్ హీరోగా చేసిన రోమాంచకం సినిమాలో బ్యూటిఫుల్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయిన్‌గా చేసింది. అనంతిక ఇదివరకు తెలుగులో 'మ్యాడ్', '8 వసంతాలు' చిత్రాలతో నటిగా బాగా మెప్పించింది. ఈ రోమాంచకం సినిమాకు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు.

నవ్వులు పూయిస్తున్న కమెడియన్

భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు తోడవడంతో ఈ చిన్న సినిమాకు బిజినెస్ వర్గాల్లో ఊహించని క్రేజ్ లభించింది.

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఫేమ్ నరేంద్ర రవి తనదైన కామెడీ టైమింగ్‌తో రోమాంచకం సినిమాలో బాగా ఆకట్టుకున్నాడని, థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడని టాక్ వస్తోంది. ఇక వాసుకి వైభవ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను మరింత పెంచాయని కామెంట్స్ వస్తున్నాయి.

ఇంటర్వెల్ ట్విస్ట్ హైలెట్

అయితే, రోమాంచకం సినిమాలో లవ్ స్టోరీ ఉన్నప్పటికీ ఇది మెయిన్‌గా బడ్డీ కామెడీ అని రివ్యూవర్స్ అంటున్నారు. హీరో తన ఫ్రెండ్స్‌తో చేసే కామెడీ, అల్లరి సినిమాకు హైలెట్‌గా నిలిచిందట. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఆకట్టుకుందని సమాచారం.

ఇక రోమాంచకం కథలోకి వెళితే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే యువకుడు హైదరాబాద్‌లో ఒక చిన్న రోమాంచకం పేరుతో ఓ డేటింగ్ యాప్ తయారు చేస్తాడు. ఆ డేటింగ్ యాప్‌లోనే అన్వేష్‌కు చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్) పరిచయం అవుతుంది.

ఓటీటీలోకి రోమాంచకం

ఇద్దరి మధ్య చాటింగ్, ఫోన్ కాల్స్, సరదా సంభాషణలతో ప్రేమలో పడతారు. ఒక రోజు మైథిలి పుట్టినరోజకు సర్‌ప్రైజ్ ఇద్దామని చెన్నై వెళ్తాడు అన్వేష్. ఓ హోటల్‌లో ఉండి మైథిలిని పిలుస్తాడు అన్వేష్. ఫోన్‌లో సరే అని చెప్పిన మైథిలి ఎంతకు రాదు. ఏమైందని చూస్తే ఫోన్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింట్లో అన్వేష్‌ను మైథిలి బ్లాక్ చేస్తుంది.

అది తెలిసి అన్వేష్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు మైథిలి ఎందుకు అన్వేష్‌ను బ్లాక్ చేసింది? మైథిలి ఎందుకు మాయమైంది? దానికి కారణం ఏంటీ? అనేదే రోమాంచకం సినిమా మిగతా కథ. ఇలాంటి రోమాంచకం ఓటీటీలోకి వచ్చేయనుంది.

రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్

డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రోమాంచకం ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లో రోమాంచకం ఓటీటీ రిలీజ్ కానుంది. అలాగే, అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రోమాంచకం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని టాక్ వస్తోంది.

అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ రెస్పాన్స్‌ను బట్టి రోమాంచకం ఓటీటీ డేట్ మారే అవకాశం కూడా ఉందని సమాచారం. కానీ, ఓటీటీ రిలీజ్ వరకు ఆగడం కంటే థియేటర్లలో రోమాంచకం సినిమాను ఎక్స్‌పీరియెన్స్ చేయడం బెటర్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More