OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- వరుణ్ తేజ్ హారర్ కామెడీ టు లోకేష్ రివేంజ్ థ్రిల్లర్

OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం అదిరిపోయే సినిమాలు రానున్నాయి. వరుణ్ తేజ్ హారర్ కామెడీ కొరియన్ కనకరాజు నుంచి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డీసీ వరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్‌, హాట్‌స్టార్‌లలో టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

Published on: Sep 1, 2026, 05:36:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Top 7 OTT Movies To Watch This Week: ఈ వారం ఇంటి వద్దే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే సినీ ప్రియులకు ఓటీటీ సంస్థలు అదిరిపోయే వార్త అందించాయి. ఈ వారం ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కానుండగా వాటిలో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ టాప్ సినిమాలు 7 వరకు ఉన్నాయి.

ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- వరుణ్ తేజ్ హారర్ కామెడీ టు లోకేష్ రివేంజ్ థ్రిల్లర్
ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- వరుణ్ తేజ్ హారర్ కామెడీ టు లోకేష్ రివేంజ్ థ్రిల్లర్

టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఆ టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కొరియన్ కనకరాజు (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- సెప్టెంబర్ 4)

రాయలసీమలోని పెనుకొండ నేపథ్యంలో సాగే ఒక విచిత్రమైన కథాంశంతో వరుణ్ తేజ్, సత్య, రితికా నాయక్ నటించిన కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎలాంటి బాధ్యతలు లేకుండా జాలీగా తిరిగే ఒక రాయలసీమ కుర్రాడు ఒక కొరియన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే కొరియా నుంచి వచ్చిన ఒక పురాతన పాత్రతో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక కొరియన్ ఆత్మ అతని శరీరంలోకి ప్రవేశించడంతో, అతడు 'కొరియన్ కనకరాజు'గా మారి చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తాయి. హారర్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ అంశాల మేళవింపుగా ఈ తెలుగు చిత్రం రూపొందింది.

జగమే సంగీతం (అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 4)

అమెజాన్ ప్రైమ్ హిందీ ఒరిజినల్ ఓటీటీ సిరీస్'బండిష్ బ్యాండిట్స్' స్ఫూర్తితో తెరకెక్కిన తెలుగు క్లాసికల్ మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం'. గోదావరి తీరాన ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం వైకుంఠపురం నేపథ్యంలో సాగే ఈ కథ 8 ఎపిసోడ్లుగా అలరించనుంది. కర్ణాటక సంగీత దిగ్గజం శాస్త్రి (ప్రకాష్ రాజ్) మనవడు బాలు (అక్షయ్ లాగుసాని). తాతగారి సంగీత వారసత్వాన్ని మోసే బాలు జీవితంలోకి, పాప్ సింగర్ కవిత (సుస్మితా శెట్టి) అడుగుపెడుతుంది. సంప్రదాయ సంగీతానికి, ఆధునిక పాప్ రంగానికి నడుమ సాగే ఈ ప్రయాణంలో శ్రీకాంత్, మధుబాల, సుమన్, సిజ్జు, షఫీ కీలక పాత్రల్లో నటించారు.

గాంధారి (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- సెప్టెంబర్ 3)

బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'గాంధారి'. ఒక బిజీ రైల్వే స్టేషన్‌లో తన చిన్న కూతురు తప్పిపోవడంతో, ఆమెను వెతికే క్రమంలో బాణి (తాప్సీ)పై తీవ్రమైన దాడి జరుగుతుంది. దాంతో ఆమె కంటిచూపు కోల్పోతుంది. కూతురిని కాపాడుకునేందుకు కంటిచూపు లేకపోయినా ఒక విధ్వంసకర శక్తిగా మారి, 'జైపూర్రా' అనే అనామక ప్రాంతంలో సాగుతున్న బాలల అక్రమ రవాణా ముఠాలపై బాణి చేసే సాయుధ పోరాటమే ఈ కథ. ఇందులో ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు.

ధమాల్ 4 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- సెప్టెంబర్ 4)

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ఫ్రాంచైజీ 'ధమాల్' ఇప్పుడు నాలుగో పార్టుతో నవ్వుల విందు అందించడానికి వస్తోంది. గుడ్డు, లల్లన్, ఆది, మానవ్ బృందం మళ్లీ ఒక నిధి వేట కోసం బయలుదేరుతారు. 'షైతాన్ సింగ్' దాచిపెట్టిన నిధి రహస్యాన్ని ఒక పెద్దాయన చెప్పడం, ఆ నిధి మ్యాప్ ముక్కలు అయిపోవడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, రితేష్ దేశ్‌ముఖ్, జావైద్ జాఫెరీల కామెడీ టైమింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

డీసీ (సన్ నెక్ట్స్ ఓటీటీ - సెప్టెంబర్ 4)

తమిళంలో సూపర్ హిట్ అయిన రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'డీసీ' తెలుగు డబ్బింగ్ రూపంలో సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. పోలీసుల అరాచకత్వానికి బలైన ఒక అమాయక కుటుంబాన్ని కాపాడేందుకు సమాజం వెలివేసిన దేవదాస్ (లోకేష్ కనగరాజ్), అతని స్నేహితులు చేసే పోరాటమే ఈ కథ. ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ నుంచి ఆ కుటుంబాన్ని కాపాడుతూ నీతి, న్యాయం కోసం వారు పడే తపన ఈ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఆకట్టుకుంటుంది.

ఉన్మాదం (సోనీ లివ్ ఓటీటీ- సెప్టెంబర్ 4)

మలయాళంలో ప్రశంసలు అందుకున్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఉన్మాదం' పేరుతో తెలుగులోకి వస్తోంది. పోలీసు ఉద్యోగం ఇష్టం లేక, సినీ రచయిత కావాలని కలలుకనే షెల్లీ (కుంచాకో బోబన్) అనే కానిస్టేబుల్ కథ ఇది. తన బదిలీ కోసం ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒక మిస్సింగ్ కేస్‌ను చేతికి తీసుకుంటాడు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ, అతనికి కొన్ని అతీంద్రియ అనుభవాలు ఎదురవుతాయి. నిజానికి, భ్రమకు మధ్య నలిగిపోయే పోలీస్ ఆఫీసర్ కథగా ఇది సాగుతుంది.

ది కోర్ట్ (జియో హాట్‌స్టార్ ఓటీటీ- సెప్టెంబర్ 4)

నత్తి సమస్యతో బాధపడే యాజిని (ఆర్. యోగలక్ష్మి) అనే ప్రతిభావంతురాలైన యువ న్యాయవాది కథే 'ది కోర్ట్'. సమాజంలో గొప్ప పేరున్న తన తండ్రి రాజశేఖర్ (వి. జయప్రకాష్) నీడలోనే పెరిగిన ఆమె, ఒక క్లిష్టమైన కేసులో కోర్టులోనే తండ్రికి ఎదురెళ్లాల్సి వస్తుంది. శారీరక వైకల్యాన్ని, సమాజపు అంచనాలను దాటుకుని ఆమె న్యాయం కోసం ఎలా నిలబడింది అనేది భావోద్వేగపూరితమైన విచారణ డ్రామాగా రూపుదిద్దుకుంది.

తెలుగులో 6, ఒక్కరోజే 6

ఇలా ఈ వారం సెప్టెంబర్ 3, 4 తేదీల్లో 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇందులో ధమాల్ 4 తప్పా మిగిలిన 6 సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. అలాగే, సెప్టెంబర్ 4 ఒక్కరోజే 6 సినిమాలు ఓటీటీలోకి వచ్చేయనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More