OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మాత్రం ఇంట్రెస్టింగ్- హాట్‌స్టార్ టు ఈటీవీ విన్

OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే 5 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహాలలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Aug 31, 2026, 14:40:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

New OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఈటీవీ విన్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలోకి తెలుగులో 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మాత్రం ఇంట్రెస్టింగ్- హాట్‌స్టార్ టు ఈటీవీ విన్
ఓటీటీలోకి తెలుగులో 14 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మాత్రం ఇంట్రెస్టింగ్- హాట్‌స్టార్ టు ఈటీవీ విన్

డిఫరెంట్ జోనర్లలో సినిమాలు

హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ, హారర్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ వంటి వివిధ రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ తెలుగు ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 25

పార్ట్ టైమర్స్ (తెలుగు లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ రివేంజ్ రొమాంటిక్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది లాస్ట్ సన్‌రైజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 26

కేజేక్యూ (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- ఆగస్టు 28

ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 26

న్యూటన్స్ థర్డ్ లా (తెలుగు క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28

ది విస్పర్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28

ఆహా ఓటీటీ

ఆకలి రాజ్యం 2026 (తెలుగు, తమిళ బైలింగువల్ యూత్ సెంట్రిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

హరుడు (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28

మరిన్ని ఓటీటీల్లో

అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్టు 28

హంగ్రీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్టు 28

నందిని (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- ఆగస్టు 30

5 మాత్రం మరింత ఇంట్రెస్టింగ్

ఇలా గత వారం (ఆగస్టు 24 నుంచి 30 వరకు) తెలుగులో ఏకంగా 14 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, ఇందులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 5 తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More