OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్- కాలేజీ పక్కన బావిలో ఆత్మ రహస్యం- 7.5 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
Secret Of Kalinga OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ హారర్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ సినిమా సీక్రెట్ ఆఫ్ కళింగ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 7.5 రేటింగ్ ఉన్న ఈ సినిమాలో దళపతి విజయ్‌పై సెటైర్లు వేసి వైరల్ అయిన ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా చేశాడు. మరి సీక్రెట్ ఆఫ్ కళింగ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.
Secret Of Kalinga OTT Release Today: హారర్ కామెడీ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఓటీటీలో భయపెడుతూనే నవ్వించే కథలను మన ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇదే బాటలో మలయాళంలో ఇటీవల థియేటర్లలోకి వచ్చి అలరించిన మిస్టరీ హారర్ కామెడీ మూవీ ‘సీక్రెట్ ఆఫ్ కలింగ’ (Secret of Kalinga) ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

దళపతి విజయ్‌పై సెటైర్లు వేసి వైరల్
ఇటీవల దళపతి విజయ్‌పై సెటైర్లు చేస్తూ వైరల్ అయిన ధ్యాన్ శ్రీనివాసన్ ఈ సినిమాలో హీరోగా చేశాడు. అతనితోపాటు అల్తాఫ్ సలీమ్, రియాజ్ ఖాన్, సోషల్ మీడియా స్టార్ నితిన్ పరమేశ్వర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి హిట్ సాధించింది.
కొత్త దర్శకుడు సనీష్ ఉణ్ణిషకృష్ణన్
ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి సీక్రెట్ ఆఫ్ కళింగ సినిమా పదికి 7.5 రేటింగ్ సంపాదించుకుంది. నూతన దర్శకుడు సనీష్ ఉణ్ణిషకృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, కామెడీ, ట్విస్టులతో సాగుతుంది.
కాలేజ్ క్యాంపస్..
సీక్రెట్ ఆఫ్ కళింగ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రాచీన కళింగ సామ్రాజ్యానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, అవశేషాలు ఉన్న ఒక కాలేజ్ క్యాంపస్ నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఆ క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న దట్టమైన అడవిలో ఒక పురాతనమైన బావి ఉంటుంది.
పురాతన బావి రహస్యం!
శతాబ్దాల నాటి ఒక శక్తివంతమైన ఆత్మ ఆ బావి నుంచి బయటకు రావడం, ఆ తర్వాత ఆ కాలేజ్ క్యాంపస్‌లో, ఆ ఊరిలో చోటుచేసుకునే విచిత్రమైన, నవ్వులు పూయించే సంఘటనల చుట్టూ దర్శకుడు కథను నడిపించారు. ఒక ప్రత్యేక సమయంలో బావిలోనుంచి శక్తివంతమైన దెయ్యం వచ్చి అమ్మాయిలను కంట్రోల్ చేసే కథగా సాగుతుంది. ఆ బావిలోనే ఆ ఆత్మ రహస్యం ఉంటుంది.
సీక్రెట్ ఆఫ్ కళింగ నటీనటులు
జిష్ణు ఎమ్. ఆర్యన్, సనీష్ ఉణ్ణిషకృష్ణన్ సంయుక్తంగా ఈ చిత్రానికి కథ, కథనాన్ని అందించారు. మాళవిక మీనన్, ఉల్లాస్ పందళం, మెరీనా మైఖేల్, అన్వర్ షరీఫ్, అదీర్షా, గౌరి నంద, లక్ష్మి నందన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ఐరా ఫిల్మ్స్ పతాకంపై బషీర్ వరం తరప్పిళ్ళి, సుల్తాన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆశ్రిత్ సంతోష్ ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వర్తించారు.
సీక్రెట్ ఆఫ్ కళింగ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
మలయాళ చిత్రాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కొత్తదనంతో కూడిన మలయాళ కథలను చూసేందుకు సినీ ప్రియులు నిరంతరం ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే సీక్రెట్ ఆఫ్ కలింగ ఓటీటీలోకి ఇవాళ (జూలై 24) వచ్చేసింది.
సన్ నెక్ట్స్ ఓటీటీలో
సన్ నెక్ట్స్ (Sun NXT)లో సీక్రెట్ ఆఫ్ కళింగ ఓటీటీ రిలీజ్ అయింది. అంటే, జూలై 24 నుంచి సన్ నెక్ట్స్‌లో సీక్రెట్ ఆఫ్ కళింగ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి హారర్ థ్రిల్లర్, కామెడీ మూవీ చూడాలనుకునే ఓటీటీ ప్రియులకు ఈ సినిమా ఒక మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


