Chiranjeevi Birthday: చిరంజీవికి నాగబాబు పర్యావరణ కానుక- బర్త్ డే స్పెషల్‌గా కదంబ వృక్షం- ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే?
Naga Babu Plantation Gift To Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ గ్రీన్ ఛైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు కోకాపేటలో ప్రత్యేకంగా కదంబ వృక్షాన్ని నాటారు. ఆడంబరాల కంటే పర్యావరణానికి మేలు చేసే మొక్కలు నాటడమే అసలైన బహుమతి అని నాగబాబు చెప్పారు.
Naga Babu Plantation Gift To Chiranjeevi Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఇవాళ (ఆగస్ట్ 22) రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి సోదరుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

కడియం నుంచి ప్రత్యేక 'కదంబ వృక్షం'
చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 'కదంబ వృక్షం' (కదంబవాసిని) మొక్కను నాగబాబు నాటారు. ఈ జాతి మొక్కల విశిష్టతను వివరిస్తూ, 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క త్వరగానే ఏపుగా పెరుగుతుందని చెప్పారు.
10 నుంచి 15 డిగ్రీల వేడి వరకు తగ్గించి
ఇది దట్టమైన పచ్చదనాన్ని అందించడమే కాకుండా, పరిసరాల్లో దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించి చల్లని నీడను ఇస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనలు వెదజల్లే ప్రత్యేకమైన పూలను పూస్తుందని మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువే గొప్ప బహుమతి
ఈ పర్యావరణ వేడుకపై నాగబాబు స్పందిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. "అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గం" అని నాగబాబు తెలిపారు.
ఈ చెట్లలాగే మీ కీర్తి ఎదుగుతూనే ఉండాలి
ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని నాగబాబు కోరారు. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుందని చెప్పుకొచ్చారు. "హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా! ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలి" అని అన్నయ్య చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాగబాబు.
మెగా కుటుంబంలో 120కి పైగా మొక్కలు
మెగా కుటుంబ సాంప్రదాయంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల తదితర కుటుంబ సభ్యుల పేర్లతో దాదాపు 120కి పైగా మొక్కలు నాటినట్లు ఆయన స్పష్టం చేశారు.
మొక్కలు నాటే అలవాటును పెంచుకోవాలి
సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి, శుభకార్యాలు, ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మొక్కలు నాటే అలవాటును పెంచుకోవాలని ఈ సందర్భంగా నాగబాబు కోరారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


