Bigg Boss 10 Agnipariksha: మనుషుల్లా కూడా చూడరా? బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షపై దారుణమైన ట్రోల్స్.. శ్రీముఖి పనికిరాదంటూ!
Bigg Boss 10 Agnipariksha: తెలుగులో పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. బిగ్ బాస్ 10 కంటే ముందు కామనర్లను హౌజ్ లోకి తీసుకునేందుకు అగ్నిపరీక్ష సీజన్ 2 నిర్వహిస్తున్నారు. అయితే ఈ అగ్నిపరీక్ష ఇప్పుడు తీవ్రమైన ట్రోల్స్ ను ఎదుర్కుంటోంది. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Bigg Boss 10 Agnipariksha: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష' (Bigg Boss 10 Agnipariksha) ప్రారంభంలోనే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకవైపు సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పల్ బాలు (Uppal Balu) ఈ షో యాజమాన్యం, నవదీప్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు యాంకర్ శ్రీముఖి (Srimukhi) కంటెస్టెంట్ 'రన్నింగ్ రాజా' (Running Raja) పట్ల ప్రవర్తించిన తీరుపై నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష రచ్చ
బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలోకి వెళ్లాలని చాలా మంది జనాలు అనుకుంటారు. అందు కోసం పోటీపడతారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి కామనర్లను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష సీజన్ లో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ షో టెలికాస్ట్ అవుతోంది. అయితే ఈ అగ్నిపరీక్ష ఇప్పటికే రచ్చ క్రియేట్ చేస్తోంది.
నవదీప్‌పై ఉప్పల్ బాలు ఫైర్
సోషల్ మీడియాలో డిఫరెంట్ వీడియోలతో వైరల్ అయిన ఉప్పల్ బాలు ఈ అగ్ని పరీక్ష లో ఫైనల్ స్టేజ్ వరకూ వెళ్లారు. కానీ చివర్లో ఎలిమినేట్ అయ్యారు. అయితే తనను ఎలిమినేట్ చేయడం అన్యాయం అంటూ ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే స్టార్ట్ చేశాడు.
తనవి వల్లర్ వీడియోస్ అన్నారని, ఎందుకు పనికి రావని అవమానించారని అగ్నిపరీక్ష షోపై, ముఖ్యంగా జడ్జ్ గా ఉన్న నవదీప్ పై ఉప్పల్ బాలు ఫైర్ అవుతూనే ఉన్నారు.
శ్రీముఖికి నెటిజన్ల షాక్!
తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖిపై తాజాగా దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. అగ్ని పరీక్ష షోకు యాంకర్ గా ఉన్న ఆమె రన్నింగ్ రాజా అనే కంటెస్టెంట్ పట్ల ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం. రన్నింగ్ రాజా అనె కంటెస్టెంట్ ఆడిషన్స్ కు వచ్చారు. అతణ్ని శ్రీముఖి లాగా ఇమిటేట్ చేయమని జడ్జ్ లు అడిగారు. అతను తనకు వీలైనంత చేసి కామెడీ పండించాలని అనుకున్నారు.
ఇందులో భాగంగానే శ్రీముఖి దగ్గరకు రన్నింగ్ రాజా వెళ్లారు. దీంతో ‘‘నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా’’ అని శ్రీముఖి తన సీట్లో నుంచి లేచి వెళ్లిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎందుకు పనికిరావంటూ
అగ్నిపరీక్ష అని ఆశతో పిలిచి జనాలను వీళ్లు అవమానిస్తున్నారని సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ శ్రీముఖి ఎందుకు పనికి రాదని, గొర్రెలు కాయడానికి కూడా పనికి రాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఏ విషయాన్ని అయినా మర్యాదగా చెప్పాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


