Bigg Boss Uppal Balu: నావి వల్గర్ వీడియోసా? నీకు శాపం తగులుతుంది నవదీప్.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష .. ఉప్పల్ బాలు ఫైర్

Bigg Boss Uppal Balu: సోషల్ మీడియాలో సెన్సేషల్ వీడియోస్ తో, కామెంట్లతో వైరల్ గా నిలిచే ఉప్పల్ బాలుకు కోపమొచ్చింది. బిగ్ బాస్ 10 తెలుగు అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ కావడంతో సంచలన కామెంట్లు చేశారు. నవదీప్ కు శాపం తగులుతుందని వీడియో రిలీజ్ చేశారు. 

Published on: Aug 14, 2026, 13:25:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Uppal Balu: ఇటీవలే 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఆడిషన్స్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన ఉప్పల్ బాలు.. సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష నుంచి తనను ఎలిమినేట్ చేయడంపై మండిపడ్డాడు. ముఖ్యంగా నవదీప్ కు శాపం పెట్టారు.

నావి వల్గర్ వీడియోసా? నీకు శాపం తగులుతుంది నవదీప్.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష .. ఉప్పల్ బాలు ఫైర్
నావి వల్గర్ వీడియోసా? నీకు శాపం తగులుతుంది నవదీప్.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష .. ఉప్పల్ బాలు ఫైర్

అసలేం జరిగిందంటే?

డిఫరెంట్ వీడియోస్ తో సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు తెగ పాపులర్ అయ్యారు. నెటిజన్లకు అతని పేరు పరిచయమే. ఈ ఉప్పల్ బాలు తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షకు వెళ్లారు. అతనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. అయితే అగ్నిపరీక్ష నుంచి అతను ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

ఉప్పల్ బాలు ఫైర్

బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ కావడంతో ఉప్పల్ బాలు ఫుల్ ఫైర్ అయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇందులో బిగ్ బాస్ మేకర్స్, ముఖ్యంగా జడ్జ్ గా ఉన్న నవదీప్ పై బాలు సంచలన కామెంట్లు చేశారు.

మిడిల్ క్లాస్

‘‘మిడిల్ క్లాస్ వాళ్లకు మనసు ఉండదా? మేం ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్నిపరీక్షకు వచ్చాం. గ్రూప్ డిస్కషన్స్ లో, ఎగ్జామ్ లో సెలెక్ట్ అయి ఫైనల్ కు వచ్చాం. అక్కడ మాకు ఒక గేమ్ పెట్టకుండా, ఓ టాస్క్ ఇవ్వకుండా మీ వీడియోలు వల్గర్ గా ఉంటాయని, దేనికి పనికొస్తాయని అడిగారు’’ అని ఉప్పల్ బాలు చెప్పుకొచ్చారు.

మీ వీడియోలు ఎందుకు?

‘‘నవదీప్ మీ వీడియోలు ఎందుకు పనికొస్తాయండీ? మీరు సమాజంలో ఎవరికైనా దానం చేశారా? ఓ లక్ష రూపాయలు ఇచ్చారా? ఎవరికైనా పుస్తెమట్టెలు ఇచ్చారా?’’ అని ఉప్పల్ బాలు డైరెక్ట్ గా వీడియోలో అడిగారు.

‘‘మీరే తోపులు అని అనుకుంటున్నారు. మీకు అవకాశం ఇస్తే అక్కడున్నారు. అగ్నిపరీక్షకు పిలిచి అవమానించడం కాదు. మీకు కచ్చితంగా తగులుతుంది. నవదీప్ అసలు వదిలిపెట్టను. నాకు న్యాయం జరగాలి’’ అని ఉప్పల్ బాలు డిమాండ్ చేశారు.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కామనర్లను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష నిర్వహించనున్నారని తెలిసింది. ఆగస్టు 15 నుంచి ఈ షో టెలికాస్ట్ కానుంది. అయితే ఇప్పటికే ఆడిషన్లు, టాస్క్ లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ బాలు చేసిన కామెంట్లు వివాదానికి కారణమయ్యాయి. ఈ సారి బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే కాంట్రవర్సీ మొదలైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More