Gunde Ninda Gudi Gantalu Balu: గుండె నిండా గుడి గంటలు ఫ్యాన్స్ కు బాలు గుడ్ న్యూస్.. బిగ్ బాస్ 10కు వెళ్తున్నాడా? లేదా?
Gunde Ninda Gudi Gantalu Balu: బుల్లితెరపై సంచలన టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకెళ్తున్న ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. బిగ్ బాస్ 10లోకి తాను వెళ్లబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఓ క్లారిటీనిచ్చాడు. ఇంతకీ బాలు ఏమన్నాడంటే?
Gunde Ninda Gudi Gantalu Balu: కింగ్ నాగార్జున హోస్ట్ గా త్వరలోనే ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో స్టార్ మా టాప్ సీరియల్ ‘గుండె నిండా గుడి గంటలు’ లో ‘బాలు’ పాత్రతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న విష్ణు కాంత్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తాడనే టాక్ వినిపించింది.

గుండె నిండా గుడి గంటలు బాలు క్లారిటీ
గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గడపకు దగ్గరైన బాలు అలియాస్ విష్ణు కాంత్ తన బిగ్ బాస్ 10 తెలుగు ఎంట్రీపై రియాక్టయ్యాడు. మాస్ అండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న విష్ణుకాంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారని, అందుకే సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడని పెద్ద ఎత్తున రీల్స్, పోస్టులు వైరల్ అయ్యాయి.
ఈ ప్రచారంపై స్వయంగా విష్ణుకాంత్ స్పందిస్తూ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశాడు.
ఫ్యాన్స్ ప్రేమకు
తాను సీరియల్ వదిలేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు విష్ణుకాంత్ ధన్యవాదాలు తెలిపాడు. తాను బిగ్ బాస్ కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చాడు.
"నేను బిగ్‌బాస్‌కి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల కింద దాదాపు 4 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. చాలా మంది నాకు పర్సనల్‌గా మెసేజ్‌లు చేసి 'బాలు గారు సీరియల్ వదిలి వెళ్లకండి' అని కోరారు. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది" అని విష్ణు పేర్కొన్నాడు.
బిగ్ బాస్ కు వెళ్లను
"నేను బిగ్ బాస్‌కి వెళ్లడం లేదు. మీరందరూ కోరుకుంటున్నట్లు బాలు లాగే మీ ముందు ఉంటాను, బాలు లాగానే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. మన సీరియల్‌పై మీరు చూపిస్తున్న ప్రేమే నన్ను ఇక్కడ ఉంచింది. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి" అని చెబుతూ విష్ణుకాంత్ ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు.
టాప్ సీరియల్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి బాలు తప్పుకోబోతున్నాడనే ప్రచారానికి స్వయంగా వీడియోతో విష్ణు కాంత్ తెరదించాడు. బిగ్ బాస్ కు వెళ్లడం లేదని చెప్పేశాడు. విష్ణుకాంత్ ఇచ్చిన ఈ క్లారిటీతో ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ వీక్షకులు, బాలు అభిమానులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ మాలో వస్తున్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ లో దూసుకెళ్తూ టాప్ సీరియల్ గా కొనసాగుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


