Gunde Ninda Gudi Gantalu: రోహిణి గదిలో బాలు, మీనా సోదా.. చింటు డ్రెస్ చూసి షాక్.. పార్లరమ్మను పూర్తిగా దూరం చేసే ప్లాన్

Gunde Ninda Gudi Gantalu Serial August 11th Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 11 ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా. ఇందులో బాలు, మీనా కలిసి రోహిణి గదిలో సోదాలు చేస్తారు. అక్కడ వాళ్లకు దొరికిన ఓ డ్రెస్ పార్లరమ్మను మరిన్ని కష్టాల్లోకి నెట్టబోతోంది.

Published on: Aug 10, 2026, 14:09:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial August 11th Promo: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు రోజు రోజుకూ ఉత్కంఠ రేపుతూ సాగుతోంది. రోహిణి మలేషియా నాటకాన్ని బట్టబయలు చేసి ఆమెను ఇంట్లో నుంచి తరిమేలా చేసిన బాలు, మీనా అక్కడితో ఆగకుండా ఆమె దాస్తున్న రహస్యాన్ని ప్రభావతి ముందు పెట్టడానికి పెద్ద ప్లానే వేస్తారు.

Gunde Ninda Gudi Gantalu: రోహిణి గదిలో బాలు, మీనా సోదా.. చింటు డ్రెస్ చూసి షాక్.. పార్లరమ్మను పూర్తిగా దూరం చేసే ప్లాన్
Gunde Ninda Gudi Gantalu: రోహిణి గదిలో బాలు, మీనా సోదా.. చింటు డ్రెస్ చూసి షాక్.. పార్లరమ్మను పూర్తిగా దూరం చేసే ప్లాన్

బాలు, మీనా కొత్త ప్లాన్

స్టార్ మా తాజాగా రిలీజ్ చేసిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ కొత్త ప్రోమోలో బాలు, మీనా సరసాలాడుతున్నట్లుగా చూపించారు. మీనాను గట్టిగా పట్టుకున్న బాలు ఆమెను ముద్దేదో అడుగుతాడు అనుకుంటే.. మనం వెళ్లి రోహిణి గదిలో ఆమె దాచిన ఏవైనా సీక్రెట్స్ ఉన్నాయేమో అని చూద్దాం అంటాడు.

అది విని మీనా షాకవుతుంది. వాళ్లు లేనప్పుడు గదిలోకి వెళ్లి అలా చూడటం పద్ధతి కాదని వారిస్తుంది. మరి వాళ్లు ఉన్నప్పుడు గదిలోకి వెళ్లి మనల్ని చూడనిస్తారా.. ఏం కాదు వెళ్దాం మీనా అని ఆమెను బాలు తీసుకెళ్తాడు.

రోహిణి బీరువాలో చింటు డ్రెస్

గదిలోకి వెళ్లగానే మీనాను వాళ్ల బీరువా తెరిచి చూడమంటాడు బాలు. మీనా బీరువా తెరవగానే అందులో చిన్న పిల్లలు వేసుకునే డ్రెస్ కనిపిస్తుంది. అది చూడగానే మీనా షాక్ తింటుంది. బాలుకి చూపిస్తుంది. దాచి పెట్టారంటే కచ్చితంగా ఏదో రహస్యం దాగి ఉన్నట్లే.. ఈ డ్రెస్ ఎవరిది.. దీని వెనుక ఉన్నది ఎవరో కచ్చితంగా కనిపెట్టాల్సిందే అని బాలు అంటాడు.

అక్కడితో సీరియల్ ప్రోమో ముగుస్తుంది. పార్లరమ్మ దాచిన చింటు సీక్రెట్ ను బాలు బయటపెడతాడా? ఆమెను ఇంటికి పూర్తిగా దూరం చేస్తాడా అన్న ఆసక్తి నెలకొంది. చింటు రోహిణి కొడుకే అన్న నిజం తెలిస్తే బాలు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత రోహిణి పరిస్థితి ఏమవుతుందో రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.

ఇంటికి తిరిగొచ్చిన మనోజ్

అంతకుముందు సీరియల్ సోమవారం (ఆగస్ట్ 10) ఎపిసోడ్ లో మనోజ్ ను పోలీస్ స్టేషన్ నుంచి బాలు, సత్యం ఇంటికి తీసుకొస్తారు. స్టేషన్ లోనూ మనోజ్ రచ్చ చేయడం, అరుణ్ తో బాలు గొడవ పడటంతో అతన్ని జైలుకు పంపించడానికి అరుణ్ సిద్ధమవుతాడు. అయితే సత్యం కంటతడి పెట్టడంతో అరుణ్ వెనక్కి తగ్గుతాడు. మనోజ్ ను పంపించేస్తాడు. అతన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ సమస్యలకు పరిష్కారం రావాలంటే సుశీల రావాల్సిందే అని బాలు, సత్యం అనుకుంటారు.

తాను వెళ్లి అమ్మను తీసుకొస్తానని సత్యం అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రోహిణి మోసం గురించే మనోజ్ తలుచుకొని ఏడుస్తుంటాడు. తల్లి ప్రభావతి కూడా లేకపోవడంతో అతని పరిస్థితి మరింత దారుణంగా తయారువుతుంది. మరి ఇప్పుడు బాలు, మీనా కలిసి వేసిన కొత్త ప్లాన్ తో రోహిణి పరిస్థితి ఏమవుతుంది? అది తెలిసి మనోజ్ ఏమవుతాడో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More