Gunde Ninda Gudi Gantalu: సత్యంకు పోలీస్ స్టేషన్‌లో ఘోర అవమానం.. అరుణ్‌తో బాలు గొడవ.. స్టేషన్‌లో షర్ట్ లేకుండా మనోజ్
Gunde Ninda Gudi Gantalu Today Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 7 ప్రోమోలో మనోజ్ కారణంగా సత్యంకు పోలీస్ స్టేషన్ లో ఘోరమైన అవమానం జరుగుతుంది. దీంతో అరుణ్ తో మరోసారి బాలు గొడవకు దిగుతాడు.
Gunde Ninda Gudi Gantalu Today Promo: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపుతో ఎంతో ఆసక్తి రేపుతోంది. తాజాగా ఆ ఛానెల్ రిలీజ్ చేసిన ప్రోమోలో సత్యం ఫ్యామిలీ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. మనోజ్ కారణంగా సత్యంకు కూడా ఘోర అవమానం జరుగుతుంది.

విద్య ఇంట్లో రోహిణి
గుండె నిండా గుడి గంటలు తాజా ప్రోమోలో రోహిణి తన ఫ్రెండ్ విద్య ఇంట్లోనే ఉంటుంది. ఆమె మనోజ్ ఫోన్ చేశాడా అని అడుగుతుంది. కానీ తనపై అతనికి ఏ స్థాయిలో కోపం ఉందో తెలుసని, ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఎలా ఫోన్ చేస్తాడని రోహిణి అంటుంది. మనోజ్ కాబట్టి నువ్వు బతికిపోయావ్ వేరే వాళ్లు అయి ఉంటే నీ పరిస్థితి మరోలా ఉండేదని విద్య అంటుంది.
మనోజ్ అరెస్ట్ విషయం చెప్పిన మణికంఠ
ఇటు మణికంఠతో కలిసి వెళ్తుంటే మనోజ్ రోడ్డుపై రచ్చ చేస్తాడు. అతడు లేడీ కానిస్టేబుల్ తో ప్రవర్తించిన తీరు, ఎస్సై అరుణ్ అతన్ని అరెస్ట్ చేయడం గురించి మణికంఠ సత్యం ఇంటికి వచ్చి చెబుతాడు. దీంతో ఇంట్లో వాళ్లు షాక్ తింటారు.
పోలీస్ స్టేషన్ కు బాలు, సత్యం
విషయం తెలియగానే బాలు, సత్యం వెంటనే పోలీస్ స్టేషన్ కు పరుగెత్తుతారు. అక్కడ షర్ట్ లేకుండా బనియన్ పై మనోజ్ కూర్చొని ఉంటాడు. అతన్ని చూసి వాళ్లు షాక్ తింటారు. అప్పుడే అరుణ్ రావడంతో నువ్వేంటి ఇక్కడ అని ఒకరికొకరు అడుగుతారు. అతడు మా అన్నయ్య అని బాలు అనడంతో మీ ఇంట్లో అందరూ ఇంతేనా అని అరుణ్ అంటాడు.
సత్యంకు ఘోర అవమానం
తన అన్నను అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నానని, వదిలేస్తే తీసుకెళ్తానని బాలు అంటాడు. కుదరదు అని అరుణ్ అంటాడు. అంతేకాదు ఇలాంటి కొడుకులను కన్నారేంటి సార్ అని సత్యంతో అరుణ్ అనడంతో అతడు తలదించుకుంటాడు. తన తండ్రి జోలికి రావద్దని అరుణ్‌తో బాలు గొడవ పడతాడు. వదిలేస్తావా లేదా అని గద్దించడంతో కోర్టుకెళ్లి తేల్చుకోపో అని అరుణ్ తేల్చి చెబుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


