Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు మందు పరీక్ష- రోహిణి అహంకారం, పాపం పండిందంటూ బాలు శాపం-చేతులెత్తేసిన విద్య
Gunde Ninda Gudi Gantalu Serial August 4th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 4వ తేది ఎపిసోడ్‌లో బాలు తాగాడాని మీనా నిందలు వేస్తుంది. దాంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో బాలు మందు పరీక్ష చేయించుకుంటాడు. రోహిణి చాలా అహంకారంగా మాట్లాడుతుంది. నీ పాపం పండింది పార్లరమ్మా అని బాలు శాపం పెడతాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మటన్ కొట్టు మాణిక్యం కూరగాయలు కట్ చేస్తుంటాడు. ఇద్దరు వచ్చి ఆవకాయ్ ఉందా అని అడుగుతారు. ఏంటీ పెగ్గులు వేస్తున్నారా అని మాణిక్యం అంటాడు. మీకెలా తెలుసు అని వాళ్లు అంటే.. నాకు తలకాయ ఉందని మాణిక్యం అంటాడు.

థ్యాంక్స్ తలకాయ్ అంకుల్
ఆవకాయ్ ఇచ్చి దూరంగా వెళ్లి కూర్చుని తాగమంటాడు మాణిక్యం. దాంతో థ్యాంక్స్ తలకాయ అంకుల్ అని వాళ్లు చెప్పి వెళ్లిపోతారు. అటువైపే మీనా వస్తుంటుంది. ఆవకాయ్ తీసుకున్నవాళ్లు మందు బాటిల్ పట్టుకెళ్లడం చూసి మా ఆయనతో వీళ్లు తాగట్లేదు కదా అని పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది మీనా. అప్పుడే వాళ్లు అక్కడే ఒక పెగ్ పోసుకుంటారు.
అప్పుడు బాలు వస్తాడు. బాలు మీద మందు పడుతుంది. పార్కింగ్‌లో తాగమని చెబుతాడు బాలు. ఆవకాయ్ చూసి టెంప్ట్ అయి టేస్ట్ చూస్తాడు. అది చూసి బాలు తాగుతున్నాడని మీనా అపార్థం చేసుకుంటుంది. తాగుబోతులు వెళ్లిపోతారు. బాలును తాగుతున్నారని, వాసన వస్తుందని నిలదీస్తుంది. రవి వస్తే అతనికి కూడా బాలు తాగుతున్నాడని చెబుతుంది మీనా.
బాలు తాగలేదని, ఏ పాపం ఎరగని అంటాడు. మరి ఇంత వాసన వస్తుందేంటని చెబితే ఇద్దరం ఢీకొన్నాం, మందు మీద పడిందని బాలు చెబుతాడు. లేదు గ్లాస్ గ్లాస్ చీస్ చెప్పుకుంటే పడిందని మీనా అంటుంది. ఆ తాగుబోతులతోనే చెప్పిస్తా పదా అని పార్కింగ్ సైడ్ తీసుకెళ్తాడు బాలు. అక్కడ మాణిక్యం కారులోనుంచి సామాన్లు దించుతుంటాడు.
బాలుకు మందు పరీక్ష
మరోవైపు కామాక్షి తన నగల గురించి గొప్పగా చెప్పుకుంటుంది. నగలు కొట్టేద్దామంటే కుదరట్లేదని పద్మావతి అంటే.. పెళ్లి కూతురు గదిలో చాలా నగలు ఉన్నాయి. అవి కొట్టేద్దామని పురుషోత్తం అంటాడు. వంటలు చాలా బాగున్నాయని అంటున్నారు. ఎవరు చేశారని ప్రభావతి అడుగుతుంది. వంట మాస్టర్‌కి బాగా లేకపోతే పెళ్లి కొడుకు మేనమామే చేశాడని రంగా చెబుతాడు.
అయితే, చాలా మంచివాళ్లని ప్రభావతి అంటుంది. మరోవైపు తాగుబోతులు కనిపించరు. బాలు కథలు పడుతున్నాడని రవి అంటాడు. బాటిల్ సరిపోకా ఇంకోటి కొనుక్కోడానికి వెళ్లారేమే అని మీనా అంటే.. నిందలు వేయకే అని బాలు అంటాడు. మీనా అనడంతో బాలు వెళ్లి ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర మందు తాగానో లేదో బ్రీత్ అనలజైర్‌తో టెస్ట్ చేయమని, తన భార్య తన శీలాన్ని శంకిస్తుందని వేడుకుంటాడు బాలు.
ఈ నిందలు లోకమంతాపడుతుందన్నమాట అని ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటాడు. తన భార్య ముందు అగ్ని పరీక్షలాగా ఆల్కహాల్ టెస్ట్ చేయమని బాలు అంటాడు. పోలీస్‌ను తీసుకొస్తున్నాడేంటని రవి అంటాడు. రవి, మీనా ముందు బ్రీత్ అనలైజర్‌లో ఊదుతాడు బాలు. అందులో బాలు తాగలేదని కానిస్టేబుల్ చెబుతాడు. నీ భర్త చాలా పవిత్రుడు అని అతను అంటాడు.
నీ పాపం పండింది
నా భర్త పదవిని కాపాడి ఎంతో మేలు చేశారని పోలీస్‌కు థ్యాంక్స్ చెబుతాడు బాలు. అత్తయ్య అనడంతో తెలుసుకుందామని వచ్చాను. అనవసరంగా అపార్థం చేసుకున్నాని మీనా ఫీల్ అవుతుంది. నేను తాగానని ఎవరు చెప్పారని బాలు అంటే.. మీ అన్నయ్య చూశాడట, అత్తయ్యకు చెబితే నన్ను వచ్చి అడిగిందని మీనా అంటుంది.
దాంతో బాలు వెళ్లి మనోజ్‌తో గొడవ పడతాడు. తాగుబోతులతో చూశాను అని మనోజ్ అంటాడు. మన లెవెల్ ఏంటీ మనోజ్ డ్రైవర్లతో, పూలమ్ముకునేవాళ్లతో మాటలు పడటమేంటని రోహిణి అంటుంది. మరి మీ నాన్న ఏం చేస్తాడు, ఏం చేసేవాడు, ఎన్ని లక్షలు సంపాదించాడు, వీడేమైనా సంపాదించాడా అని బాలు రివర్స్ కౌంటర్ ఇస్తాడు.
పార్లర్ కూడా అత్తయ్య పెట్టించింది, మా డబ్బులతో ఫర్నిచర్ షాప్ పెట్టుకుని లెవెల్ గురించి మాట్లాడుతున్నావా అని రోహిణి అని మీనా అంటుంది. మేము కూడా వాటా అడగమంటావా అని రవి అంటాడు. వీళ్లకు అహంకారం పెరిగిపోయింది. నీ పాపం పండింది. నీ అహంకారానికి రోజులు చెల్లిపోతాయి. మా స్థాయి తగ్గించి అన్నందుకు ఇంతకింత అని బాలు అంటాడు.
త్వరలోనే గుణపాఠం నేర్చుకుంటావ్
మీనా ఆపుతుంది. అంటే జరుగుతుందని మీనా అంటుంది. ఆరోజు ఏదో అయిందని ప్రతిసారి అవుతుందా. ఎన్ని గొడవలు అయినా నేను మనోజ్ కలిసి ఉంటాం. దమ్ముంటే మేము విడిపోతాం అని అనమను అని రోహిణి ఛాలెంజ్ చేస్తుంది. ఆ మాట నేను అనను, పైనా తధాస్తు దేవతలు ఉంటారు. నువ్వు కూడా అనకు. నీ కాపురం మీద ఎందుకు రిస్క్ చేసుకుంటావ్. కానీ, నీ అహంకారినికి త్వరలోనే గుణపాఠం నేర్చుకుంటావని శాపం పెడతాడు బాలు.
బాలు వెళ్లిపోతాడు. శాపం పెడుతున్నాడు శాపం అని రోహిణి విసుక్కుంటుంది. మరోవైపు పెళ్లికూతురు నగలే లేపేద్దామని దొంగ జంట అనుకుంటుంది. కామాక్షి నగల గురించి గొప్పగా చెప్పుకోవడం చూసి రంగా కుర్చీ ఎత్తి పెళ్లి పనులు పెట్టుకుని నగల గురించి పురాణం చెబుతావా, చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో కామాక్షి భయపడుతుంది.
మరోవైపు పెళ్లికూతురుని తీసుకురుమ్మని పంతులు అంటే.. అమ్మా మీనా నీ చేయి చాలా మంచిది నువ్వు తీసుకురా అని ప్రభావతి ప్రేమగా అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మీనా వెళ్తుంది. తను ముఖేష్ కోసం అన్నా, వినడానికి చాలా బాగుంది. ఇదే నిజమైతే బాగుండు అని బాలుతో మీనా అంటుంది. మరోవైపు మురళి కోసం విద్య కంగారుగా అటు ఇటు తిరుగుతుంది.
మురళిని కొట్టిన విద్య
అది చూసి మురళి సంతోషిస్తాడు. యాక్సిడెంట్ గురించి అందరిని అడుగుతుంది విద్య. ప్రేమ లేకుండే ఇంత దూరం వస్తుందా. బాలు అన్నా నీ ఐడియా అదిరిపోయింది. ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది అని మురళి తన ఫ్రెండ్‌తో అంటాడు. తర్వాత మురళిని చూసి చాలా టెన్షన్ పడుతుంది. నీకు ఏం కాలేదా అని ముట్టుకుని కంగారుగా అంటుంది విద్య.
నా మీద ప్రేమ లేకుంటే ఇంత కంగారుగా పడుతున్నావ్ ఎందుకు అని నిలదీస్తాడు మురళి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదా అని మురళి అంటాడు. అంటే ఇదంతా నాటకమా అని విద్య అంటుంది. అవును, ప్రేమలో ఇదంతా కామన్. లేకుంటే నువ్వు చెప్పేదానివి కాదు అని మురళి అంటాడు. ప్రేమ అంటే నమ్మకం. ఇలా ఎమోషన్స్‌తో ఆడుకోవడం కాదు అని మురళిని లాగిపెట్టి కొడుతుంది విద్య.
నీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిందిరా అని మురళి ఫ్రెండ్ అంటుంది. ఇప్పుడు మండపానికి వెళ్లలేను. ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వాలా. రోహిణి నిన్ను ఆ దేవుడే కాపాడాలని విద్య చేతులెత్తేస్తుంది. మరోవైపు సుందరిని తీసుకొచ్చేందుకు మీనా వెళ్తుంది. ఇక్కడ ఇంకా నగలున్నాయి. మీరు వెళ్లండి మీనా అక్క తాళం వేస్తుందని సుందరి అంటుంది.
గదిలో ఇరుక్కున్న మాణిక్యం
ఇంతలో పద్మావతి చేతిలోనుంచి కత్తి కిందపడుతుంది. అదెందుకు అని మీనా అడిగితే.. పూలు కట్ చేయడానికని అబద్ధం చెబుతుంది పద్మావతి. మీనా తాళం వేసి సుందరిని తీసుకెళ్తుంది. తర్వాత పద్మావతి పిన్నీసుతో తాళం తీసి నగలన్నీ అక్కడే ఉన్న బ్యాగులో సర్దుతుంది. చీరలు కూడా సర్దుతుంది. అప్పుడే మాణిక్యం అటువైపు వస్తాడు.
డోర్ ఓపెన్ ఉందేంటని లోపలికి వెళ్తాడు. పద్మావతి దాక్కుని బయటకు వెల్లి డోర్ లాక్ వేసి వెళ్లిపోతుంది. మాణిక్యం గదిలో ఇరుక్కుపోతాడు. సుందరి వాళ్లు పెళ్లిదండలు మార్చుకుంటారు. పెళ్లి జరుగుతుంది. మరోవైపు నాకు ఒకావిడ మీద అనుమానంగా ఉందని మీనా అంటుంది. మరోవైపు మాణిక్యం డోర్‌ను ఒక పాప తీస్తుంది.
పెళ్లి అయిపోయిందని చెబుతుంది. అక్షింతలు వేయాలని మాణిక్యం వెళ్తాడు. మరోవైపు పద్మావతి వెళ్తుంటే మీనా ఎదురుపడుతుంది. ఆగిపోయావేంటీ పదా అని పురుషోత్తం వచ్చి తీసుకెళ్లిపోతాడు. అప్పుడే బాలు వస్తాడు. ఆవిడ వచ్చేటప్పుడు బ్యాగ్ లేదు. పైగా కంగారు పడుతున్నారు అని బాలుతో మీనా చెబుతుంది. ఆటోలో కూర్చుంటారు దొంగ జంట.
దొంగ జంటను పట్టుకున్న బాలు మీనా
బాలు వెళ్లి ఆపుతాడు. అప్పగింతల వరకు ఉండాల్సిందే అని ఆటోను పంపించి దొంగ జంటను దింపుతారు. ప్రభావతి అమ్మా, మనోజ్ మావయ్య ఏమవుతారు బాలు అడుగుతాడు. మనోజ్ మావయ్య పెద్దనాన్న అవుతాడని పురుషోత్తం అంటాడు. మరి వెంకటస్వామి పోలీసు అవుతాడు. తనే అన్ని మర్యాదలు చేస్తాడని బాలు చెబుతాడు.
దాంతో ఇద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. మీనా చేయిని కత్తితో కోస్తాడు పురుషోత్తం. దాంతో అతన్ని ఎడాపెడా బాదుతాడు. ఇంతలో కామాక్షి, రంగా వస్తారు. ఏమవుతారు అని బాలు అడిగితే.. సరిగా తెలియదంటారు. దొంగ జంట బ్యాగ్ నుంచి నగలు తీస్తాడు బాలు. అంతా షాక్ అవుతారు.
అమ్మో అమ్మో నా కూతురు నగలు అని రంగా, కామాక్షి అంటారు. ఆ హడావిడిలో దొంగ జంట పారిపోతుంది. పోనిలెండి అని, నగలు దొరికాయిగా అని మీనా అంటుంది. మీకు డౌట్ ఎలా వచ్చిందని కామాక్షి అడిగితే.. జరిగింది చెబుతుంది మీనా. తర్వాత మాణిక్యంను కలిసి స్వీట్ అడుగుతాడు రంగా.
మాణిక్యం ఏర్పాట్లు
నా ఫ్రెండ్ ఫ్యామిలీ పెళ్లికి వచ్చిందిగా. వాళ్లంతా వెళ్లిపోయారు. కానీ, వాళ్ల కొడుకు భార్య ఉన్నారు. వాళ్ల ఉండటం వల్ల చాలా నష్టం నుంచి బయటపడ్డాం అని నగల విషయం మాణిక్యంకు చెబుతాడు రంగా. అంత సహాయం చేస్తే సింపుల్‌గా స్వీట్ పెట్టి పంపిస్తామా. నేను ఏర్పాట్లు చేస్తానని మాణిక్యం అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


